Spicy Chicken Rasam: కమ్మగా స్పైసీ చికెన్ రసం.. రాగి ముద్దలోకి అదుర్స్!
ప్రస్తుతం వాతావరణంలో పరిస్థితులు మారుతున్నాయి. అప్పుడే ఎండ ఇరగదీస్తూ.. వెంటనే మబ్బు కమ్మి వర్షం పడుతుంది. ఇలాంటి వాతావరణంలో ఎక్కువగా జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సరైన విధంగా ఇమ్యూనిటీ ఉండేలా చూసుకోండి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఈ స్పైసీ చికెన్ రసం చక్కగా హెల్ప్ చేస్తుంది. కమ్మగా ఉండటమే కాకుండా ఆరోగ్యం కూడా..

ప్రస్తుతం వాతావరణంలో పరిస్థితులు మారుతున్నాయి. అప్పుడే ఎండ ఇరగదీస్తూ.. వెంటనే మబ్బు కమ్మి వర్షం పడుతుంది. ఇలాంటి వాతావరణంలో ఎక్కువగా జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సరైన విధంగా ఇమ్యూనిటీ ఉండేలా చూసుకోండి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఈ స్పైసీ చికెన్ రసం చక్కగా హెల్ప్ చేస్తుంది. కమ్మగా ఉండటమే కాకుండా ఆరోగ్యం కూడా. చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. అలాంటి వారు ఒక్కసారి ఈ చికెన్ రసాన్ని ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది. అంతే కాకుండా ఈ రసం.. రాగి ముద్దలో వేసుకుని తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఈ సండేకి చికెన్ రసంతో ఎంజాయ్ చేయండి. మరి ఇంకెందుకు లేట్ స్పైసీ చికెన్ రసం ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
స్పైసీ చికెన్ రసంకు కావాల్సిన పదార్థాలు:
చికెన్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, నిమ్మరసం, కొత్తి మీర తరుగు, లవంగాలు, యాలకులు, గసగసాలు, అల్లం, వెల్లుల్లి, నెయ్యి లేదా ఆయిల్.
స్పైసీ చికెన్ రసం తయారీ విధానం:
ఈ చికెన్ రసం తయారు చేసుకోవడానికి ముందుగా చికెన్‌ని, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో ఉల్లిపాయలు, కొత్తి మీర తరుగు, లవంగాలు, యాలకులు, గసగసాలు, అల్లం, వెల్లుల్లి, పసుపు, కారం వేసి పేస్టులా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి.. అందులో నెయ్యి లేదా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టిన మసాలాలు వేసి ఆయిల్ పైకి తేలేంత వరకూ కుక్ చేసుకోవాలి.
ఆ తర్వాత కనీసం ఒక లీటర్ వాటర్ అయినా వేసి ఉడికించుకోవాలి. ఈ నీళ్లు ఉడుకుతున్నప్పుడే చికెన్ ముక్కలు వేసి.. సిమ్‌లో ఓ 20 నిమిషాలు కుక్ చేయండి. చివరగా కొత్తి మీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ఎంతో రుచిగా ఉండే స్పైసీ చికెన్ రసం రెడీ. దీన్ని సూప్‌లా తాగొచ్చు. లేదా రాగి ముద్దతో అయినా తినవచ్చు. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది.








