Snacks Tips: ఇంట్లోనే అటుకులతో ఇలా చేసి పెట్టండి.. పిల్లలు అస్సలు విడిచిపెట్టరు!
పిల్లలకు ఏది పెట్టాలన్నా పది సార్లు ఆలోచిస్తారు తల్లులు. ఇది పెడితే ఆరోగ్యమా.. కాదా అని తర్జన భర్జనలు పడుతూ ఉంటారు. వీలైనంత వరకూ వాళ్లకు బెస్ట్ ఇవ్వాలనే చూస్తారు. ముఖ్యంగా ఆహార విషయంలో వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు పెరుగుతున్న అనారోగ్య సమస్యలు.. పిల్లలకు రాకుండా ఉండాలంటే.. ఇంట్లోని తల్లులు ముఖ్య పాత్ర పోషించాలి. ఇలా హెల్దీగా ఏ స్నాక్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే కనుక..

పిల్లలకు ఏది పెట్టాలన్నా పది సార్లు ఆలోచిస్తారు తల్లులు. ఇది పెడితే ఆరోగ్యమా.. కాదా అని తర్జన భర్జనలు పడుతూ ఉంటారు. వీలైనంత వరకూ వాళ్లకు బెస్ట్ ఇవ్వాలనే చూస్తారు. ముఖ్యంగా ఆహార విషయంలో వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు పెరుగుతున్న అనారోగ్య సమస్యలు.. పిల్లలకు రాకుండా ఉండాలంటే.. ఇంట్లోని తల్లులు ముఖ్య పాత్ర పోషించాలి. ఇలా హెల్దీగా ఏ స్నాక్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే కనుక.. అటుకులతో ఇలా నగ్గెట్స్ చేసి పెట్టండి. అందులోనూ ప్రజెంట్ వాతావరణం చల్లగా ఉంది కాబట్టి.. వేడి వేడిగా ఏమైనా తినాలని పిల్లలకు కూడా అనిపిస్తూ ఉంటుంది. బయట నుంచి కొని తీసుకు రావడం కూడా అంత ఆరోగ్యం కాదు. సాధారణంగా అటుకులు ఉంటూ ఉంటాయి. వీటితో నగ్గెట్స్ చేస్తే.. టేస్ట్ కి టేస్ట్.. హెల్త్ హెల్త్ కలిసి వస్తాయి. ఇంకెందుకు లేట్ మరి అటుకుల నగ్గెట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
అటుకుల నగ్గెట్స్ కి కావాల్సిన పదార్థాలు:
అటుకులు, ఉల్లి పాయలు, ఉడికించిన బఠానీలు, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, బంగాళ దుంపలు, పచ్చి మిర్చి, జీల కర్ర పొడి, కార్న్ ఫ్లోర్, కొత్తి మీర, బియ్యం పిండి, బ్రెడ్ పొడి, నూనె, ఆమ్ చూర్ పౌడర్.
అటుకుల నగ్గెట్స్ తయారీ విధానం:
అటుకులను ముందుగా శుభ్రంగా కడిగి ఒక నిమిషం పాటు నీటిలో నాన బెట్టి తీసుకోవాలి. ఇలా చేస్తే అటుకులు మెత్తగా అవుతాయి. వీటిని గట్టిగా పిండి లోతైన గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించిన బంగాళ దుంపలు మెత్తగా చేసుకుని వేయాలి. ఇక ఒకదాని తర్వాత మరకొటి ఉల్లి పాయలు, ఉడికించిన బఠానీలు, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, పచ్చి మిర్చి, జీల కర్ర పొడి, కార్న్ ఫ్లోర్, కొత్తి మీర, బియ్యం పిండి, బ్రెడ్ పొడి, నూనె, ఆమ్ చూర్ పౌడర్ వేసి అన్నీ బాగా కలిసేలా కలుపు కోవాలి.
ఇప్పుడు వీటిని మీకు ఇష్టమైన షేప్ లో తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. ఈలోపు రెడీ అయిన నగ్గెట్స్ ని ఒక్కొక్కటిగా కార్న్ ఫ్లోర్ వాటర్ లో ముంచి.. ఆ తర్వాత బ్రెడ్ క్రంబ్స్ లో రెండు వైపులా ముంచి.. నెక్ట్స్ ఆయిల్ లో వేసి మీడియం మంటపై ఎర్రగా అయ్యేంత వరకూ వేయించు కోవాలి. అంతే అటుకుల నగ్గెట్స్ సిద్ధమవుతాయి. వీటిని టమాటా కెచప్ లేదా పుదీనా చట్నీతో తింటే భలే టేస్టీగా ఉంటాయి. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి తయారు చేసుకోండి.