AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karappusa: గోధుమ పిండితో కారప్పూస.. పిల్లల కోసం హెల్దీ స్నాక్..

సంక్రాంతి పండుగ అంటేనే బోలెడన్ని రకాల పిండి వంటలు తయారు చేస్తారు. పిల్లలకు నచ్చేలా స్నాక్స్ ప్రిపేర్ చేస్తారు. అందులోనూ హెల్దీగా ఉండాలి అనుకుంటారు. అలాంటి వారు గోధుమ పిండితో ఈ కారప్పూస తయారు చేయండి. సాధారణంగా చనగ పిండితో కారప్పూస తయారు చేస్తారు. చనగ పిండి ఎక్కువగా తినకూడదు కాబట్టి.. గోధుమ పిండితో కూడా వేయవచ్చు..

Karappusa: గోధుమ పిండితో కారప్పూస.. పిల్లల కోసం హెల్దీ స్నాక్..
Karappusa
Chinni Enni
| Edited By: |

Updated on: Jan 19, 2025 | 7:16 PM

Share

సంక్రాంతి పండుగ అంటేనే బోలెడన్ని రకాల పిండి వంటలు తయారు చేస్తారు. పిల్లలకు నచ్చేలా స్నాక్స్ ప్రిపేర్ చేస్తారు. అందులోనూ హెల్దీగా ఉండాలి అనుకుంటారు. అలాంటి వారు గోధుమ పిండితో ఈ కారప్పూస తయారు చేయండి. సాధారణంగా చనగ పిండితో కారప్పూస తయారు చేస్తారు. చనగ పిండి ఎక్కువగా తినకూడదు కాబట్టి.. గోధుమ పిండితో కూడా వేయవచ్చు. గోధుమ పిండితో చేసినా చాలా రుచిగా ఉంటాయి. వీటిని బాక్సుల్లో పిల్లలకు స్నాక్స్ పెట్టవచ్చు. మరి ఈ గోధుమ పిండితో కారప్పూస ఎలా తయారు చేస్తారు. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

గోధుమ పిండి కారప్పూసకు కావాల్సిన పదార్థాలు:

గోధుమ పిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం, ఆయిల్.

గోధుమ పిండి కారప్పూస తయారీ విధానం:

ముందుగా ఓ గిన్నె తీసుకుని అందులో నీళ్లు వేసి వేడి చేయండి. చిన్న మంట పెట్టండి. పైన ఓ స్టెయినర్ పెట్టండి. అందులో ఒక క్లాత్ వేయండి. ఆ క్లాత్‌పై మీరు తీసుకున్న బియ్యం పిండి, గోధుమ పిండి వేయండి. ఆ తర్వాత క్లాత్ కప్పేసి ఓ పది నిమిషాలు ఆవిరి మీద పిండిని ఉడికించండి. ఇప్పుడు ఆ గిన్నెలోని పిండిని తీసేసి.. ఖాళీగా ఉండే లోతైన గిన్నె తీసుకోండి. ఒకసారి ఆ పిండిని చేతితో నలిపి.. ఆ తర్వాత జల్లెడ పట్టండి. జల్లెడ పట్టిన పిండిలో ఉప్పు, కారం, ఓ రెండు స్పూన్ల ఆయిల్ వేసి అంతా కలపండి. కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఉంచి వేడి చేయండి. పిండి గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా నీళ్లు కలపొచ్చు. ఆ తర్వాత కారప్పూస వేసుకునే చక్రంలో పిండిని ఉంచి.. ఆయిల్‌లో తిప్పండి. మంటని మీడియం మంటపై ఉంచండి. రెండు వైపులా ఎర్రగా వేగిన తర్వాత ఓ ప్లేట్‌లోకి తీసుకోండి. అంతే ఎంతో రుచిగా ఉండే గోధుమ పిండి కారప్పూస సిద్దం.

Follow Us
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా