Chettinad Masala Dosa: చెట్టినాడ్ స్టైల్ లో మసాలా దోశను ఇలా తిన్నారంటే.. అస్సలు వదిలిపెట్టరు!
ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా చేసే అల్పా హారాల్లో దోశలు కూడా ఒకటి. దోశలు అంటా చాలా మందికి ఇష్టం. దోశ తినడం వల్ల కూడా పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారు ప్రతి రోజూ నార్మల్ దోశ తింటే.. మంచి ఫలితం ఉంటుంది. చట్నీ ఉన్నా లేకున్నా.. కూడా దోశను ఓ టైమ్ పాస్ గా తినేయవచ్చు. దోశల్లో ఇప్పటికే చాలా వెరైటీలు చూసే ఉంటారు. కానీ ఈ చెట్టినాడ్ స్పెషల్ మసాలా దోశను ఒక్కసారి తిన్నారంటే.. అస్సలు వదిలి పెట్టరు. మళ్లీ మళ్లీ ఇదే కావాలి..

ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా చేసే అల్పా హారాల్లో దోశలు కూడా ఒకటి. దోశలు అంటా చాలా మందికి ఇష్టం. దోశ తినడం వల్ల కూడా పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారు ప్రతి రోజూ నార్మల్ దోశ తింటే.. మంచి ఫలితం ఉంటుంది. చట్నీ ఉన్నా లేకున్నా.. కూడా దోశను ఓ టైమ్ పాస్ గా తినేయవచ్చు. దోశల్లో ఇప్పటికే చాలా వెరైటీలు చూసే ఉంటారు. కానీ ఈ చెట్టినాడ్ స్పెషల్ మసాలా దోశను ఒక్కసారి తిన్నారంటే.. అస్సలు వదిలి పెట్టరు. మళ్లీ మళ్లీ ఇదే కావాలి అంటారు. ఇది చేయడం కూడా చాలా సింపుల్. ఎప్పుడూ ఒకే రకం దోశలు కాకుండా.. ఇలా వెరైటీగా కూడా దోశలు తినొచ్చు. ఈ చెట్టినాడ్ దోశలను ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
చెట్టినాడ్ మసాలా దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు:
బియ్యం, పెసర పప్పు, మినపప్పు, కంది పపపు, శనగ పప్పు, ఎండు మిర్చి, జీలకర్ర, పసుపు, ఉప్పు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు ఇంగువ, ఉల్లిపాయ, కొత్తి మీర, నూనె.
చెట్టినాడ్ దోశ తయారీ విధానం:
ముందుగా ఒక పాత్రలోకి బియ్యాన్ని, మిగిలిన పప్పులన్నీ తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి.. నీళ్లు పోసి ఓ మూడు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత వీటిని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. ఇందులోకే ఎండు మిర్చి, జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ మిశ్రమంలో ఇంగువ, పసుపు, ఉల్లి పాయలు, ఉప్పు, కొత్తి మీర వేసి బాగా కలపాలి.
ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి బాగా వేడి చేసుకోవాలి. పెనం వేడెక్కాక.. దోశ వేసుకోవాలి. ఈ దోశలు మరీ పల్చగా రావు. కొద్దిగా నూనె వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే చెట్టినాడ్ స్పెషల్ మసాలా దోశ రెడీ. వీటిని ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు లేదా వీకెండ్స్ లో చేసుకుంటే చాలా బావుంటాయి. చట్నీ లేకున్నా నార్మల్ దోశలనే తినాలి అనిపిస్తుంది. ఈ దోశలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.




