Horse Gram Soup: కూల్ వెదర్ లో వేడి వేడి ఉలవచారు.. తింటే ఆహా అనాల్సిందే!!
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. చల్లచల్లగా కూల్ కూల్ గా ఉంది వెదర్. ఈ టైంలో వేడి వేడిగా ఏమన్నా తినాలనిపిస్తూంటుంది. అయితే కేవలం పొట్టను మాత్రమే హ్యాపీగా ఉంచడమే కాకుండా..

దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. చల్లచల్లగా కూల్ కూల్ గా ఉంది వెదర్. ఈ టైంలో వేడి వేడిగా ఏమన్నా తినాలనిపిస్తూంటుంది. అయితే కేవలం పొట్టను మాత్రమే హ్యాపీగా ఉంచడమే కాకుండా.. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు అవసరం. కాబట్టి చక్కగా.. వేగంగా అయ్యే ఉలవచారును చేసుకుని తింటే ఆహా.. అనాల్సిందే. మరి అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా..!
ఎలా చేస్తారంటే: ప్రెషర్ కుక్కర్ లో ఉలవలు మునిగేంత వరకూ నీరు పోయాలి. నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకూ వాటిని ఉడికించాలి. ఉలవలు బాగా మొత్తగా ఉడకాలి. ఆ తర్వాత ఒక గ్రైండర్ లో ఉలవలు, ఎండు కొబ్బరి, ఉల్లిపాయ ఒకటి వేసి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి.
స్టవ్ మీద లోతుగా ఉన్న గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేడెక్కాక.. ఆవాలు, ఇంగువ వేయాలి. అనంతరం అందులో రెండు గ్లాసుల వాటర్ పోసి మరగనివ్వాలి. ఈ టైంలో ఉలవల పేస్ట్ కూడా వేసి కలపాలి. అది రసంలా మారి వేడి అయిన తర్వాత రసం పౌడర్ కలుపుకోవాలి.
రసం పౌడర్ తో పాటు చింతపండు పులుసు కూడా కొంచెం వేసుకోవాలి. బాగా మరిగాక ఆ తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, కొత్తి మీర తరుగు వేసుకుని దించి.. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఆ మజానే వేరు. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని కూడా దీన్ని తినవచ్చు. ఉలవలు ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో మంచి ఫైబర్ ఉంటుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి…