AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vegetable Soup: అధిక బరువుకు ఆకుకూరల సూప్ తో చెక్!!

ఆకు కూరలు తింటే చాలా మంచిదని డాక్టర్లు చెప్పడమే కాదు.. మనకు కూడా తెలుసు. కానీ మనం వాటిని చాలా దూరంగా పెడుతూంటాం. ప్రస్తుతం ఉన్న కాలంలో చాలా మంది జంక్ ఫుడ్ కి అలవాటు పడ్డారు. రోజుకు ఏదో రూపంలో జంక్ ఫుడ్ మన బాడీలోకి వెళ్లిపోతూ..

Vegetable Soup: అధిక బరువుకు ఆకుకూరల సూప్ తో చెక్!!
vegetable soup
Chinni Enni
|

Updated on: Jul 22, 2023 | 3:51 PM

Share

ఆకు కూరలు తింటే చాలా మంచిదని డాక్టర్లు చెప్పడమే కాదు.. మనకు కూడా తెలుసు. కానీ మనం వాటిని చాలా దూరంగా పెడుతూంటాం. ప్రస్తుతం ఉన్న కాలంలో చాలా మంది జంక్ ఫుడ్ కి అలవాటు పడ్డారు. రోజుకు ఏదో రూపంలో జంక్ ఫుడ్ మన బాడీలోకి వెళ్లిపోతూ ఉంటుంది. అయితే కాస్త సమయం వెచ్చిస్తే.. ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ఆకు కూరలు తినని వాళ్లు ఈ వెజిటేబుల్ సూప్ చేసుకుని హాయిగా లాంగించేయొచ్చు. దీని వల్ల అధిక బరువుకు కూడా పుల్ స్టాప్ పెట్టొచ్చు. వీటిని తీసుకోవడం వల్ల డీటాక్స్ గా పని చేసి బరువు తగ్గుతారు. మరి ఆ సూప్ ఏంటి? ఎలా చేసుకోవాలో ఓసారి లుక్కేసెద్దాం.

ఈ వెజిటేబుల్ సూప్ కి కావాల్సిన పదార్థాలేంటంటే.. పాలకూర, మెంతికూర, బ్రకోలీ, వాటర్, ఆలీవ్ ఆయిల్ లేదా నెయ్యి, కొత్తిమీర, కార్న్ ఫ్లోర్, తులసి ఆకులు, అల్లం, మిరియాలు, ఉప్పు.

తయారీ విధానం: ఓ గిన్నెలో నీరు పోసి ఆకు కూరలు, తరిగిన కూరగాయాలు, ఉప్ప వేసి 8 నుంచి 10 నిమిషాల పెట్టి మీడియం మంట మీద ఉడికించాలి. ఆ తర్వాత మరో పాన్ లో నెయ్యి లేదా ఆలీవ్ ఆయిల్ వేసి ఉల్లిపాయ, వెల్లుల్లి వేసి బాగా వేగించుకోవాలని. ఈ లోపు ఉడకపెట్టిన ఆకుకూరల, కూరగాయల మిశ్రమాన్ని మిక్సీలో వేసి బాగా గ్రైడ్ చేసి.. ఉల్లిపాయ, వెల్లుల్లి వేసి ఫ్రై చేస్తోన్న పాన్ లో కలపాలి.

ఇవి కూడా చదవండి

ఇవి ఉడుకుతుండగా.. ఓ చిన్న గిన్నెలో మొక్కజొన్న కొంచెం పిండి వేసి అందులో వాటర్ పోసి కలిపిన మిశ్రమాన్ని కూడా వేసి మరిగించాలి. ఇప్పుడు సూప్ మందంగా తయారవుతుంది. ఇప్పుడు కొత్తమీర తరుగు, సరిపడ ఉప్పు, మిరియాల పొడి వేస్తే సూప్ రెడీ.

ఈ రెయినీ సీజన్ లో ఇలాంటివి తీసుకుంటే ఫిట్ నెస్, ఆరోగ్యం మన సొంతమవుతుంది. ఈ సూప్ తీసుకోవడం వల్ల శరీర ఛాయ కూడా మెరుస్తూ ఉంటుంది. ఆకు కూరల్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సీ, విటమిన్ కే, విటమిన్ ఎలు పుష్కలంగా ఉంటాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి…

వందే భారత్ రైళ్లపై మరో కీలక అప్డేట్
వందే భారత్ రైళ్లపై మరో కీలక అప్డేట్
మంటల్లోంచి బుసలు కొడుతూ బయటకొచ్చిన నాగుపాము.. ఆ తర్వాత సీన్
మంటల్లోంచి బుసలు కొడుతూ బయటకొచ్చిన నాగుపాము.. ఆ తర్వాత సీన్
రైళ్లలో తెల్లటి బెడ్‌షీట్లే ఎందుకు ఇస్తారో తెలుసా..? ఆ రహస్యం..
రైళ్లలో తెల్లటి బెడ్‌షీట్లే ఎందుకు ఇస్తారో తెలుసా..? ఆ రహస్యం..
లైవ్ మ్యాచ్‌లో వికెట్ కీపర్ సెలబ్రేషన్ చూస్తే నవ్వాపుకోలేరంతే..!
లైవ్ మ్యాచ్‌లో వికెట్ కీపర్ సెలబ్రేషన్ చూస్తే నవ్వాపుకోలేరంతే..!
నారీ నారీ నడుమ మురారి సినిమాను మిస్ అయిన హీరో ఎవరంటే..
నారీ నారీ నడుమ మురారి సినిమాను మిస్ అయిన హీరో ఎవరంటే..
వందే భారత్ స్లీపర్ రైళ్లలో కొత్త లగేజీ రూల్స్.. ఆ పరిమితి దాటితే.
వందే భారత్ స్లీపర్ రైళ్లలో కొత్త లగేజీ రూల్స్.. ఆ పరిమితి దాటితే.
పగడపు రత్నం: ఇది మీ జీవితం మార్చేస్తుంది.. కానీ ఈ తప్పు చేస్తే..?
పగడపు రత్నం: ఇది మీ జీవితం మార్చేస్తుంది.. కానీ ఈ తప్పు చేస్తే..?
చలికాలంలో రోజుకు ఎన్ని కప్పుల చాయ్ తాగాలి.. ఎక్కువ తాగితే..
చలికాలంలో రోజుకు ఎన్ని కప్పుల చాయ్ తాగాలి.. ఎక్కువ తాగితే..
బరువు తగ్గడానికి భోజనం మానేస్తున్నారా..?మీరు డేంజర్‌లో పడినట్టే!
బరువు తగ్గడానికి భోజనం మానేస్తున్నారా..?మీరు డేంజర్‌లో పడినట్టే!
నమ్మకంతో చోటిస్తే, నట్టేట ముంచేసిన టీమిండియా ప్లేయర్..?
నమ్మకంతో చోటిస్తే, నట్టేట ముంచేసిన టీమిండియా ప్లేయర్..?