మధ్యాహ్నం లేదా సాయంత్రం కూడా టీ ఉండాల్సిందే. ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత, ఫ్రెష్ అప్ కావడానికి ప్రతి ఒక్కరూ కప్పు టీ తీసుకుంటారు. అయితే టీతో పాటు బిస్కెట్లు ను కొందరు తీసుకుంటే.. మరికొందరు కట్లెట్స్, నూనెలో వేయించిన పదార్ధాలను టీ తో కలిపి తీసుకుంటారు. ఇలా చేయడం వలన జీర్ణం అవ్వడానికి సమయం పడుతుంది. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరగడం ప్రారంభమవుతుంది.