Vegetable Powders: వేసవిలో పచ్చళ్ళు, వడియాలే కాదు.. కొన్నిరకాల కూరగాయలతో పొడులను కూడా తయారు చేసుకోవచ్చు తెలుసా..!
Vegetable Powders: వేసవికాలం వచ్చేసింది. ఇక తెలుగువారి లోగిళ్ళలో పచ్చళ్ళు, వడియాల సందడి మొదలయ్యింది. అయితే ఈ ఎండలను బాబోయ్ ఎండలు అనుకోకుండా.. కొంతమంది మహిళలు బుర్రకు పదును పెట్టి....
Vegetable Powders: వేసవికాలం వచ్చేసింది. ఇక తెలుగువారి లోగిళ్ళలో పచ్చళ్ళు, వడియాల సందడి మొదలయ్యింది. అయితే ఈ ఎండలను బాబోయ్ ఎండలు అనుకోకుండా.. కొంతమంది మహిళలు బుర్రకు పదును పెట్టి.. ఎండని వాడేసుకుంటారు. ఇంట్లో ఉండే కొన్ని రకాల కూరగాయలు పాడవకుండా పొడుల కింద తయారు చేస్తారు.. వాటిని కూరల్లోకి, సూప్ తయారీకి.. వాడతారు., ఈరోజు అలా కొన్ని పొడుల తయారీ గురించి ఈరోజు తెలుసుకుందాం..!
1.అల్లం పొడి
ముందుగా అల్లాన్ని శుభ్రంగా కడిగి.. ముక్కలుగా తురమాలి. తర్వాత ఓ ప్లేట్ లో పెట్టి వాటిని ఎండబెట్టాలి. అలా రెండు మూడు రోజల పాటు అంటే అల్లం ముక్కలు గల గలమనే వరకూ ఎండబెట్టాలి. తర్వాత వాటిని మిక్సి లో వేసి పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ ను జల్లెడ పట్టుకోవాలి. అప్పుడు అల్లం లో పౌడర్ ను తడిలేని గాజు సీసాలో వేసుకుని భద్రపరచుకోవాలి. ఇక అందులో నుంచి వచ్చే పీచుని తటీ తయారీ సమయంలో ఉపాయోగించుకోవచ్చు.
2. వెల్లుల్లి :
వెల్లుల్లిని రెబ్బలు ఒలిచి, కడిగి మిక్సి లో వేసి పేస్ట్ చేయాలి. మరీ మెత్తగా అవసరం లేదు.. అలా మీకేసీ చేసిన వెల్లుల్లిని స్టీల్ ప్లేట్ లో పలుచగా పెట్టి రెండో రోజులపాటు ఎండబెట్టాలి. గలగల మంటున్నప్పుడు మిక్సి లో వేసుకుని.. పౌడర్ గా చేసుకోవాలి. తర్వాత ఆ పొడిని బాటిల్ లో భద్రపరచుకోవాలి.
3. ఉల్లిపాయలు…
చిప్స్ మేకర్ తో ఉల్లిపాయలు తరిగి ఎండలో పెట్టి… గలగల మన్నాక మిక్సి లో వేయండి. ఇది జల్లించనఖ్ఖర్లేదు. ఉల్లిపాయ పొడి లో కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ కలిపితే పొడి డ్రై గా ఉంటుంది.
4. క్యారెట్ పొడి..
క్యారెట్ ని తురిమి ప్లేట్ లో వేసి ఎండ లో ఎండించండి. రెండోరోజు మిక్సి వేసి పౌడర్ చేసి జల్లించండి.
5. టోమేటో…
టోమేటోలు తరిగి… నూనె లేకుండా బాణలిలో వేసి నీరు మొత్తం ఇగిరె వరకు కలుపుతూ ఉండండి. గుజ్జు గా అయ్యాక ఒక ప్లేట్ లో పలుచగా పరిచి ఎండలో పెట్టండి. ఇది కాస్త టైమ్ తీసుకుంటుంది. మూడో రోజు…వడియాల్లా వస్తాయి. వాటిని చిన్న ముక్కలుగా చేసి ఎండబెట్టి. మిక్సిలో వేసి పౌడర్ గా పట్టుకోవాలి. తర్వాత దానిని జల్లించి బాటిల్ లో భద్రపరచుకోవాలి.
ఇలా కూరగాయలను పొడులుగా చేసి పెట్టుకుంటే.. ఎప్పుడైనా టొమాటో సూప్, క్యారెట్ సూప్ ఇలా తయారు చేసుకోవచ్చు. అయితే ఇలా బీట్ రూట్, మామిడికాయ పొడులను కూడా తయారు చేసుకోవచ్చు.
Also Read: ప్రభుత్వాసుప వద్ద పది రూపాయలకే ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణలు.. రోగులకు స్పెషల్ మెనూ కూడా