Kakinada GGH: ప్రభుత్వాసుపత్రి వద్ద పది రూపాయలకే ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణలు.. రోగులకు స్పెషల్ మెనూ కూడా

అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలి అన్నవారికి అన్నం పెట్టడం అన్ని దానాల్లోకంటే గొప్పదని పెద్దలు చెబుతారు.. విద్యాదానం, వస్త్రదానం ఇలా ఎన్ని దానాలున్నా అన్ని దానాల్లో కెల్లా అన్నదానం మిన్న. ఎందుకంటే ఎదుటివారి అవసరానికి...

Kakinada GGH: ప్రభుత్వాసుపత్రి వద్ద పది రూపాయలకే ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణలు.. రోగులకు స్పెషల్ మెనూ కూడా
Kakinada Ggh
Follow us

|

Updated on: Mar 30, 2021 | 9:43 AM

Kakinada GGH: అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలి అన్నవారికి అన్నం పెట్టడం అన్ని దానాల్లోకంటే గొప్పదని పెద్దలు చెబుతారు.. విద్యాదానం, వస్త్రదానం ఇలా ఎన్ని దానాలున్నా అన్ని దానాల్లో కెల్లా అన్నదానం మిన్న. ఎందుకంటే ఎదుటివారి అవసరానికి మనం ఎంత సాయం చేసినా ఎన్ని ఇచ్చినా ఇంకా కావాలి అనిపిస్తుంది. అదే ఆకలి అన్నవారికి అన్నం పెడితే మాత్రం ఇక చాలు అంటూ సంతృప్తిగా వెళ్తారు. అంతగొప్పది అన్నదానం. అయితే ఈ అన్నదానకార్యక్రమాన్ని కొంతమంది మహిళలు ఇంకా గొప్పగా నిర్వహిస్తున్నారు. వైద్యం కోసం వచ్చే రోగుల, బాధిత బంధువుల ఆకలిని అతి తక్కువ ధరకు తీరుస్తూ.. అన్నపూర్ణలు అనిపించుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే..

తూర్పుగోదావరి జిల్లా ముఖ్యపట్టణం కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం రోజూ భారీ సంఖ్యలో బాధితులు వస్తారు. అలా రోజూ ఈ ఆస్పత్రి వద్దకు వచ్చే వేల మంది పేదవారికి తక్కువ ధరకే భోజనం అందిస్తున్నారు ‘ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ ట్రస్ట్’ మహిళా సభ్యులు. జీజీహెచ్ ఆస్పత్రికి ఎక్కువ మంది పేద ప్రజలు వస్తారు.. వారిలో బయట హోటల్స్ కు వెళ్లి భోజనం చేసే స్తొమత లేనివారే ఎక్కువ. ఆలా బయట భోజనం చేస్తే జేబులు ఖాళీ అయిపోతాయి. అటువంటి వారి ఆకలి తీర్చడం కోసమే పది రూపాయలకే భోజనం అందించే ప్రయత్నం చేస్తున్నారు ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ ట్రస్ట్‌’కు చెందిన పదిమంది మహిళలు.

ఈ మహిళలు కూడా సామాన్య కుటుంబీకులే.. అయితే ఈ పదిమంది మహిళలు కలిసి.. తమకంటూ ఓ వ్యాపకం ఉండాలి.. ఏదైనా చేద్దామని ఆలోచించారు . ఏడాది క్రితం ఒక ట్రస్ట్ లో సభ్యులుగా చేరారు.. అక్కడ వంటలు చేయడంలో శిక్షణ పొందారు. అయితే అక్కడే ఈ పదిమంది మహిళలు తాము డిఫరెంట్ అని నిరూపించుకున్నారు. సంపదను సృష్టించే ఆదాయ మార్గాన్ని ఎంచుకోలేదు.. సేవతో కూడిన వ్యాపారాన్ని చేయాలనుకున్నారు. దీంతో వైద్యం కోసం వచ్చిన వారు తిండి కోసం పడుతున్న ఇబ్బందులు వీరు దృష్టిలో పడ్డాయి. దీంతో జీజీహెచ్ అస్పటల్ ఎదురుగా ఫలహారశాల పేరుతొ ఓ హోటల్ ను ఏర్పాటు చేశారు. కేవలం రూ. 10 లకే కడుపునిండా భోజనం పెడుతున్నారు. మెనులో రోగులకు స్పెషల్ కూడా ఉంది. రోగులకోసం ప్రత్యేకంగా జావ, మిరియాల చారు వంటి పథ్యం భోజనం దొరుకుతుంది. పెరుగన్నం, పులిహోర, చికెన్‌ బిర్యానీ వంటివి వీళ్లు అందించే మెనూలో ఉంటాయి.

ఇలా రోజుకి ఈ ఫలహారశాలలో రోజుకు 300 నుంచి 500 మంది ఆకలి తీర్చుకుంటున్నారు. ఈరోజుల్లో పది రూపాయలకు టీ కూడా రావడం లేదు.. మరి అటువంటి సమయంలో పది రూపాయలకే భోజనం అందిస్తున్న వీరిని అన్నపూర్ణలే అంటున్నారు.. హాస్పటల్ కి వచ్చి.. ఇక్కడ ఆకలి తీర్చుకుంటున్నవారు.

Also Read: మన పెద్దల దంతాలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండడానికి రహస్యమేమిటో తెలుసా..? వాటిని అనుసరిస్తున్న విదేశీయులు

Humanity is Still Alive: చిత్రం చెప్పిన విశేషం.. నడవలేని శునకంపై కరుణ చూపిన గ్రామీణ డాక్టర్.. పిక్ సోషల్ మీడియాలో వైరల్