World Idli Day 2021: ఇడ్లీ నే కదా అని లైట్ తీసుకోకండి.. ఈ ఐదు రకాల ఇడ్లీలు టేస్ట్ చేశారంటే వాహ్ అనాల్సిందే..

World Idli Day 2021: మనం ప్రతి రోజూ ఉదయం తినే టిఫిన్‌లో ఎక్కువ ప్రాధాన్యత ఇడ్లీకే ఇస్తాం..

World Idli Day 2021: ఇడ్లీ నే కదా అని లైట్ తీసుకోకండి.. ఈ ఐదు రకాల ఇడ్లీలు టేస్ట్ చేశారంటే వాహ్ అనాల్సిందే..
Idli Types
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 30, 2021 | 2:36 PM

World Idli Day 2021: మనం ప్రతి రోజూ ఉదయం తినే టిఫిన్‌లో ఎక్కువ ప్రాధాన్యత ఇడ్లీకే ఇస్తాం. కారణం అది లైట్ ఫుడ్, ఆరోగ్యవంతమైన ఫుడ్ అని. ఇడ్లీ తినడం ద్వారా త్వరగా జీర్ణం అవడమే కాకుండా.. మనిషిని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది. అయితే, అంతటి ఇడ్లీకి ఒక ప్రత్యేకమైన రోజు ఒకటి ఉందని ఎంతమందికి తెలుసు? అవునండీ.. మదర్స్ డే, ఫాదర్స్ డే, ఎర్త్ డే అలా అన్నింటికీ ప్రత్యేకమైన రోజు ఉన్నట్లుగానే.. ఇడ్లీకి కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. మార్చి 30 వ తేదీని ఇడ్లీ రోజుగా పాటిస్తారు. 2015లో చైన్నైకి చెందిన ఇడ్లీ క్యాటరర్ ఎనియావన్ దీనిని గుర్తించాడు. ఈ రోజును జరుపుకోవడం కోసం ఎనియవన్ సుమారు 1,328 రకాల ఇడ్లీలను తయారు చేసి ఇడ్లీ ప్రత్యేకతను చాటి చెప్పాడు. అంతేకాదు.. ప్రపంచ ఇడ్లీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏకంగా 44 కిలో ఇడ్లీని కట్ చేసి సంబరాలు చేశాడు.

ఇంతకీ ఇడ్లీ ఎక్కడ పుట్టిందో తెలుసా? ఇడ్లీ మొదట ఇండోనేషియాలో పులియబెట్టిన ఆహారంగా ఉద్భవించింది. ఇది క్రీ.శ 800-1200లో భారతదేశానికి వచ్చింది. అయితే, ఈ ఇడ్లీ దక్షిణ భారతదేశ ప్రధాన వంటకంగా ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచింది. దక్షిణ భారత ప్రజలు ఎక్కువగా ఇడ్లీని సాంబార్, పచ్చడితో ఆరగిస్తుంటారు. ఇదిలాఉంటే.. ప్రపంచ ఇడ్లీ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఇంట్లోనే సులువగా చేసుకోగల అద్భుతమైన, ఆరోగ్యవంతమైన ఇడ్లీ రకాలను ఇప్పుడు తెలుసుకుందాం.

స్టఫ్‌డ్ ఇడ్లీ.. ఈ ఇడ్లీని పేరుకు తగ్గట్లుగానే.. మూంగ్ దాల్, పచ్చిమిర్చి, మరియు మెత్తని బంగాళాదుంపలతో తయారు చేస్తారు. బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ ఇడ్లీని తినడం ద్వారా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

రవ్వ ఇడ్లీ.. సాధారణంగా రవ్వతో చేసి ఇడ్లీ ఇది. దీనిలో చట్నీగా డీప్ ఫ్రైడ్ కొబ్బరి, పుదీనా పచ్చడిని యాడ్ చేసుకుంటారు. ఇది అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది.

ఓట్స్ ఇడ్లీ.. వోట్స్.. మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇడ్లీనే ఆరోగ్యం అంటే.. ఓట్స్ ఇడ్లీ అంటే ఇంకా స్పెషల్ అని చెప్పాలి. ఓట్స్ ఇడ్లీలో చాలా పోషకాలు ఉంటాయి. దీనిని జీవనశైలిలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుందనడం ఎలాంటి సందేహం లేదు.

మూంగ్ దాల్ ఇడ్లీ.. పచ్చి మిరపకాయలు, ఆవాలు, ఉల్లిపాయలతో చల్లిన మూంగ్ దాల్, బియ్యం మిశ్రమంతో ఈ ఇడ్లీని తయారు చేస్తారు. దీనిని సంబార్, కొబ్బరి పచ్చడితో తింటే సూపర్‌ అనాల్సిందే.

కాంచీపురం ఇడ్లీ.. ఈ ఇడ్లీని రవ్వ, బియ్యంతో తయారు చేస్తారు. ఆరోగ్యకరమైన పోషకాలతో నిండి ఉంటుంది. ఈ ఇడ్లీలను నెయ్యి, కొబ్బరి పచ్చడితో ఆరగిస్తే అద్భుతహ అనాల్సిందే.

Also read:

Yadadri Temple: యాదాద్రి దేవస్థానం కీలక నిర్ణయం.. బుధవారం నుంచి అర్జిత సేవలు రద్దు.. కారణం ఇదే..!

కోవిడ్-19 టీకాలు పంపినందుకు భారత్‏కు థ్యాంక్స్.. క్యూట్ క్యూట్‏గా చెప్పిన భూటాన్ గర్ల్.. వీడియో వైరల్..