AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిడ్-19 టీకాలు పంపినందుకు భారత్‏కు థ్యాంక్స్.. క్యూట్ క్యూట్‏గా చెప్పిన భూటాన్ గర్ల్.. వీడియో వైరల్..

Covid-19 Vaccine: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ భూటాన్ అమ్మాయి వీడియో తెగ వైరల్ అవుతుంది. అవును.. అందులో తాను ఎలాంటి ప్రయోగాలు

కోవిడ్-19 టీకాలు పంపినందుకు భారత్‏కు థ్యాంక్స్.. క్యూట్ క్యూట్‏గా చెప్పిన భూటాన్ గర్ల్.. వీడియో వైరల్..
Bhutan Girl
Rajitha Chanti
|

Updated on: Mar 30, 2021 | 1:42 PM

Share

Covid-19 Vaccine: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ భూటాన్ అమ్మాయి వీడియో తెగ వైరల్ అవుతుంది. అవును.. అందులో తాను ఎలాంటి ప్రయోగాలు చేయలేదు. కేవలం తన ముద్దు ముద్దు మాటలతో భారత దేశానికి కృతజ్ఞతలు తెలిపింది. ఆ వీడియోలో.. హిమాలయ రాజ్యానికి కోవిడ్-19 టీకాలు పంపినందుకు భారత్‏కు చాలా థ్యాంక్స్ అంటూ ఆ అమ్మాయి చాలా క్యూట్‏గా చెప్పింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఆ అమ్మాయి కృతజ్ఞతలు చెప్పిన తీరుకు ముగ్దులైపోయి..సో నైస్.. క్యూట్.. వెర్రీ ఇన్నోసెంట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దాదాపు 37 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో కోవిడ్ -19 టీకాలను భూటాన్‌కు పంపినందుకు భారత ప్రభుత్వానికి ఆ అమ్మాయి హిందీ, ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ కృతజ్ఞతలు తెలిపింది.

మాకు “మాకు భారీ సంఖ్యలో కోవిడ్ వ్యాక్సిన్లను ఇచ్చినందుకు భారత ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భారతదేశాన్ని మా పొరుగు దేశంగా కలిగి ఉండటానికి మేము భూటానీస్ చాలా అదృష్టవంతులం..శుక్రియా అంటూ ఆ చిన్నారి చెప్పుకోచ్చింది. ఈ వీడియోను భూటాన్ భారత రాయబారి రుచిరా కాంబోజ్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ క్రమంలోనే “ఖెన్‌రాబ్! నీ ‘ధన్యవాదాలు’ మా హృదయాలను హత్తుకుంది. అంటూ #VaccineMaitri #indiabhutanfriensdhip సోషల్ మీడియోలో ట్రెండ్ అవుతున్నాయి.

మార్చి 22 న భూటాన్ దేశానికి భారతదేశం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) చేత తయారు చేయబడిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ అదనంగా 400,000 మోతాదులను పంపారు. భూటాన్ ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ, మహమ్మారి సమయంలో టీకా పనిచేస్తుందని తెలిపారు. “కోవిషీల్డ్ యొక్క అదనపు 400,000 మోతాదులను స్వీకరించడం ఆనందంగా ఉంది, మా టీకా కార్యక్రమం యొక్క దేశవ్యాప్తంగా రోల్ అవుట్ సాధ్యమవుతుంది. భూటాన్ ప్రజలు మరియు నేను ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము, మహమ్మారి సమయంలో భారతదేశ ప్రజలకు అనంతమైన ఆశీర్వాదంగా మారినప్పుడు ఇవి అందుతాయి ”అని ఆయన అన్నారు. COVID-19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో భారత్ బేషరతు మద్దతు ఇచ్చిందని భూటాన్ విదేశాంగ మంత్రి తాండి డోర్జీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ట్వీట్..

ట్వీట్..

Also read:

Aadhar Card: పాన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేశారా ? మార్చి 31st లాస్ట్ .. మిస్ చేసారో ఇక అంతే సంగతులు..