Sorakaya Manchuria: వెరైటీగా సొరకాయ మంచూరియా.. టేస్ట్‌లో తగ్గేదెలా..

సొరకాయ అంటే అసలు ఎవరికీ ఇష్టం ఉండదు. సొరకాయ కర్రీ చేస్తున్నాం అంటే ఆమడ దూరం పారిపోతారు. అసలు సొరకాయ తినేందుకు ఎవరూ ఇష్ట పడరు. కానీ సొరకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. సొరకాయలో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. కానీ సొరకాయని అందరూ తినేలా చేయవచ్చు. స్నాక్స్‌లో మంచూరియా కూడా ఒకటి. చాలా మంది వీటిని లొట్టలేసుకుంటూ తినేస్తారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఇప్పుడు సొరకాయతో మనం మంచూరియా..

Sorakaya Manchuria: వెరైటీగా సొరకాయ మంచూరియా.. టేస్ట్‌లో తగ్గేదెలా..
Sorakaya Manchuria
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 24, 2024 | 9:55 PM

సొరకాయ అంటే అసలు ఎవరికీ ఇష్టం ఉండదు. సొరకాయ కర్రీ చేస్తున్నాం అంటే ఆమడ దూరం పారిపోతారు. అసలు సొరకాయ తినేందుకు ఎవరూ ఇష్ట పడరు. కానీ సొరకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. సొరకాయలో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. కానీ సొరకాయని అందరూ తినేలా చేయవచ్చు. స్నాక్స్‌లో మంచూరియా కూడా ఒకటి. చాలా మంది వీటిని లొట్టలేసుకుంటూ తినేస్తారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఇప్పుడు సొరకాయతో మనం మంచూరియా కూడా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. అచ్చం మంచూరియా తిన్న ఫీలింగ్ ఉంటుంది. మరి సొరకాయ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

సొరకాయ మంచూరియాకు కావాల్సిన పదార్థాలు:

సొరకాయ, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కార్న్ ఫ్లోర్, మైదా, గోధుమ పిండి, జీలకర్ర, వంట సోడా, ఆయిల్, ఉల్లి కాడలు, కరివేపాకు, కొత్తి మీర, ఉల్లిపాయ, క్యాప్సికమ్, చిల్లీ ాస్, టమాటా సాస్.

సొరకాయ మంచూరియా తయారీ విధానం:

ముందుగా సొరకాయ తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇందులో గోధుమ పిండి, మైదా, కార్న్ ఫ్లోర్ కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇందులోనే జీలకర్ర, ఉప్పు, వంట సోడా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కావాలంటే కొన్ని నీళ్లు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని ఉండలుగా చుట్టుకోవాలి. వీటిని వేడి అయిన ఆయిల్‌లో వేడి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని టాసింగ్ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి అందులో స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చి మిర్చి, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత చిల్లీ సాస్, టమాటా సాస్, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి అందులోనే కొద్దిగా నీళ్లు వేసి బాగా మరుగుతున్నప్పుడు మంచూరియా ముక్కలు వేసి అదంతా బాగా పట్టేలా తిప్పుకోవాలి. అవగానే ఓ ప్లేట్‌లోకి తీసుకుని తినడమే. అంతే ఎంతో రుచిగా ఉండే సొరకాయ మంచూరియా సిద్ధం.