High BP control tips : హై బీపీతో బాధపడుతున్నారా? అయితే తప్పక తినాల్సిన ఆహార పదార్థాలు ఇవే..
High BP control tips: బీపీ పరిమితికి మించి ఉంటే గుండె తదితర అవయవాల దెబ్బతినే ప్రమాదం ఉంది. కాగా హైపర్ టెన్షన్ ను పూర్తిగా నియంత్రించలేం. అయితే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా
High BP control tips: అధిక రక్తపోటు అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఒత్తిడి, ఆహారం, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చాలామంది అధిక రక్తపోటు బాధితులుగా మారుతున్నారు. రక్తపోటు 140/90 కంటే ఎక్కువ ఉంటే.. అది అధిక రక్తపోటు కిందకే వస్తుంది. అదేవిధంగా 180/90 కంటే ఎక్కువ ఉంటే మాత్రం మరింత జాగ్రత్తపడాల్సిందే. బీపీ పరిమితికి మించి ఉంటే గుండె తదితర అవయవాల దెబ్బతినే ప్రమాదం ఉంది. కాగా హైపర్ టెన్షన్ ను పూర్తిగా నియంత్రించలేం. అయితే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే హైబీపీ తీవ్రతరం కాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
సిట్రస్ పండ్లు
బీపీ బాధితులు ఎక్కువగా ఉండేవారు సిట్రస్ పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సిని అధిక మొత్తంలో కలిగి ఉంటాయి. అదేవిధంగా వివిధ రకాల పోషకాలు, ఖనిజాలతో నిండి ఉంటాయి. ప్రతిరోజూ మధ్యాహ్నం పూట ఒక పుల్లటి పండు తినండి. కావాలంటే కివీ తినవచ్చు. విటమిన్ సి కాకుండా, ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది.
కొత్తిమీర ఆకులు
కొత్తిమీర ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వీటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్తపోటును సులభంగా నియంత్రించవచ్చు. కావాలంటే డైట్ లో చేర్చుకుని వారానికి ఒకసారి తినొచ్చు. రక్తపోటుతో పాటు ఇది ఉదర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.
అవిసె గింజలు
వీటిలో పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. అదేవిధంగా అవిసె గింజలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, టైప్ -2 డయాబెటిస్ లాంటి వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తాయి. 100 గ్రాముల అవిసె గింజల్లో18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇవి కండరాలను బలంగా మారుస్తుంది. ఇందులోని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: