Weight Loss: అధిక బరువుతో బాధపడుతున్నారా..? రాత్రివేళ ఇలాంటి ఆహార పదార్థాలను తినండి

Weight Loss Tips: ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిఒక్కరూ.. అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లు పలు రోగాల బారిన

Weight Loss: అధిక బరువుతో బాధపడుతున్నారా..? రాత్రివేళ ఇలాంటి ఆహార పదార్థాలను తినండి
Bedtime Snacks
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 16, 2022 | 8:00 PM

Weight Loss Tips: ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిఒక్కరూ.. అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లు పలు రోగాల బారిన పడేలా చేస్తున్నాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ప్రతిఒక్కరూ బిజీగా ఉండటం వల్ల.. సమయానికి దొరికే ఏదో ఫాస్ట్ ఫుడ్ లాగించేస్తున్నారు. దీంతో పలు రోగాలతోపాటు.. ఊబకాయం బారిన పడుతున్నారు. అయితే మన జీవక్రియ బరువుపై ఆధారపడి ఉంటుంది. జీవక్రియ సాఫిగా సాగాలంటే.. బరువు తక్కువగా ఉండడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా జీవనశైలీ, ఆహారం కూడా మన బరువుపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. అయితే.. రాత్రివేళల్లో కాస్త ప్రశాంతత లభిస్తుంది. ఈ క్రమంలో చాలామంది ఎక్కువగా తిని హాయిగా నిద్రపోతుంటారు. ఇలా చేయడం వల్ల బరువు మరింత పెరుగుతారు. అయితే.. బరువు తగ్గాలని అనుకున్న చాలా మంది రాత్రిపూట తక్కువ తినాలి.. లేకపోతే అన్నం, రోటి పదార్థాలను దూరం చేసి ఇలాంటి స్నాక్స్ తినాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇవి తింటే బరువు తగ్గడంతోపాటు ఆరోగ్యంగా ఉండవచ్చని పేర్కొంటున్నారు.

అరటిపండు: అరటిపండులో ఉండే కార్బోహైడ్రేట్లు త్వరగా జీర్ణమవుతాయి. కావున బరువు పెరగకుండా ఉండాలనుకునే వారు తొందరగా జీర్ణమయ్యే ఆహారాలని తీసుకోవాలి. అలాంటప్పుడు అరటి పండు తింటే కడుపు నిండటంతోపాటు.. పలు సమస్యలు దూరమవుతాయి.

కూరగాయలు: కూరగాయల్లో దోసకాయ, క్యారెట్, బీట్‌రూట్ లాంటివి తినడం మంచింది. వీటితోపాటు.. శనగలు లాంటివి తీసుకోవడం ఉత్తమం. శనగలలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లతోపాటు బీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర జీవక్రియకు బాగా సహకరించి బరువును తగ్గిస్తాయి.

పెరుగు- పండ్లు: పెరుగులో పండ్లని కలుపుకుని తింటే చాల మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే పెరుగుతోపాటు.. ఆపిల్, ద్రాక్ష, దానిమ్మ, అరటి పండు లాంటివి కలిపి తింటే ఇంకా మంచిది. దీనివల్ల ఆకలి వేయదని.. దీంతోపాటు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.

నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి.. 

ముఖ్యంగా రాత్రి వేళల్లో నూనే పదార్థాలను దూరంగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే వాటివల్ల కొవ్వు పెరిగి శరీరానికి ఎక్కువ అనర్థాలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు. బరువు వెగంగా పెరగడంతోపాటు.. మధుమేహం బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Also Read:

Type 2 Diabetes: ఈ ఒక్క పండు చాలు మధుమేహం నుంచి మిమ్మల్ని కాపాడడానికి.. ముఖ్యంగా టైప్ 2 షుగర్ పేషెంట్స్ కు దివ్య ఔషధం

Super Foods: చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ రావొద్దంటే ఈ ఫుడ్స్‌ తప్పనిసరి.. సింపుల్‌ డైట్‌