AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: టీవీ చూస్తూ అన్నం తింటున్నారా.. ఇది ఎంత డేంజరో తెలుసా!

చాలా మంది భోజనం చేసేటప్పుడు టీవీ, ఫోన్ చూడటం అలవాటు. ఎంతో ఇంట్రెస్టింగ్ గా టీవీ లేదా ఫోన్ చూస్తూ.. ఒక్కో ముద్ద తింటూ అందులో లీనం అయిపోతారు. అలా తినొద్దని ఇంట్లో పెద్దవాళ్లు కూడా చెబుతూంటారు. కానీ ఎవరూ పట్టించుకోరు. అయితే ఇలా టీవీ లేదా ఫోన్ చూస్తూ భోజనం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెద్దవాళ్లకు మాత్రమే ఈ అలవాటు కాదు..

Health Tips: టీవీ చూస్తూ అన్నం తింటున్నారా.. ఇది ఎంత డేంజరో తెలుసా!
Eating While Watching Tv
Chinni Enni
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 30, 2023 | 8:35 AM

Share

చాలా మంది భోజనం చేసేటప్పుడు టీవీ, ఫోన్ చూడటం అలవాటు. ఎంతో ఇంట్రెస్టింగ్ గా టీవీ లేదా ఫోన్ చూస్తూ.. ఒక్కో ముద్ద తింటూ అందులో లీనం అయిపోతారు. అలా తినొద్దని ఇంట్లో పెద్దవాళ్లు కూడా చెబుతూంటారు. కానీ ఎవరూ పట్టించుకోరు. అయితే ఇలా టీవీ లేదా ఫోన్ చూస్తూ భోజనం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెద్దవాళ్లకు మాత్రమే ఈ అలవాటు కాదు.. పిల్లలు సైతం ఫోన్ లేదా టీవీ చూస్తూ అన్నం తింటామని మారాం చేస్తూ ఉంటారు. ఇలా పదేళ్ల లోపు పిల్లలు.. టీవీ లేదా ఫోన్ చూస్తూ భోజనం చేయడం వల్ల వారు స్థూలకాయానికి గురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు. ఇవే కాదు ఇంకా ఎన్నో సమస్యలు వస్తాయని వెల్లడించారు. మరి అవేంటో, ఎలా జాగ్రత్త పడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్నో సమస్యలు వస్తాయి:

ఇలా ఫోన్ లేదా టీవీ చూసే అలవాటు తగ్గించుకోకపోతే దీర్ఘకాలికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుందట. ఈ అలవాటు పెద్దలకు కానీ, పిల్లలకు కానీ ఉంటే వెంటనే మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల కళ్లు బలహీన పడటం, ఊబకాయం, పొట్ట సమస్యలు, గ్యాస్ సమస్యలు, ఒత్తిడి, టెన్షన్ ఇలా అనేక సమస్యలను వస్తాయి.

ఇవి కూడా చదవండి

భోజనంపై ఏకాగ్రత ఉండదు:

ఇలా టీవీ లేదా ఫోన్ చూడటం వల్ల వాళ్లు ఏం తింటున్నారో దానిపై ఏకాగ్రత ఉండదు. అన్నం కూడా నమలకుండా తొందరగా మింగేస్తారు. దీంతో అరుగుదల సమస్యలు కూడా తలెత్తుతాయి. అలాగే రాత్రి సమయంలో భోజనం చేయడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది.

పరిమితికి మించి తినేస్తారు:

టీవీ లేదా ఫోన్ చూస్తున్నప్పుడు పరిమితికి మించి భోజనం చేస్తారు. దీంతో తిన్న ఆహారం జీర్ణం కాదు. ఒక్కో సమయంలో ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితులు నెలకొంటాయి. తినేటప్పుడు కాకుండా.. తిన్న తర్వాత చూడటం మంచిది.

ఎదుటి వారితో సంబంధాలు ఉండవు:

ఎదుటి వారితో సంబంధాలు కూడా ఉండవు. వాళ్ల సమస్యలను కుటుంబ సభ్యలతో షేర్ చేసుకునే సమయం కూడా ఉండదు. అందరూ కలిసి భోజనం చేస్తున్నా.. ఎవరి ప్రపంచం వారికే ఉంటుంది. దీని వల్ల ఇంట్లో విభేధాలు కూడా తలెత్తవచ్చు. ఈ ఎఫెక్ట్ పిల్లలపై పడుతుంది. తినేటప్పుడు ఒక్కోసారి అందులో బాగా లీనం అయిపోతారు. దీంతో చుట్టు పక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు. మానసికంగా కూడా ఒత్తిడికి గురవుతారని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకూ భోజనం చేసేటప్పుడు టీవీ లేదా ఫోన్ చూడకపోవడమే బెటర్.

గమనిక: ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి నిపుణులను సంప్రదించడం మేలు.