Interesting Facts: షుగర్ పేషెంట్స్ సీతా ఫలం తినొచ్చా.. తింటే ఏమౌతుంది?

శీతాకాలంలో సీతా ఫలాలు కూడా ఎక్కువగా లభ్యమవుతాయి. వీటి ఎంతో టేస్టీగా ఉంటాయి. వీటిని ఇష్టపడని వారుండరు. అంత బావుంటాయి. సీతా ఫలాలతో కేవలం టేస్ట్ మాత్రమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా ఈ సీజన్ లో ప్రత్యేకంగా లభ్యమవుతాయి కాబట్టి.. వీటిని తింటే సీజనల్ గా వచ్చే వ్యాధులను తగ్గించు కోవచ్చు. శరీరంలో ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది. ముఖ్యంగా తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో సీతా ఫలాలు బాగా హెల్ప్ చేస్తాయి. అంతే కాకుండా వింటర్ సీజన్ లో స్కిన్ అనేది పొడిబారిపోయినట్టు అయి..

Interesting Facts: షుగర్ పేషెంట్స్ సీతా ఫలం తినొచ్చా.. తింటే ఏమౌతుంది?
Custard Apple
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 30, 2023 | 8:08 AM

శీతాకాలంలో సీతా ఫలాలు కూడా ఎక్కువగా లభ్యమవుతాయి. వీటి ఎంతో టేస్టీగా ఉంటాయి. వీటిని ఇష్టపడని వారుండరు. అంత బావుంటాయి. సీతా ఫలాలతో కేవలం టేస్ట్ మాత్రమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా ఈ సీజన్ లో ప్రత్యేకంగా లభ్యమవుతాయి కాబట్టి.. వీటిని తింటే సీజనల్ గా వచ్చే వ్యాధులను తగ్గించు కోవచ్చు. శరీరంలో ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది. ముఖ్యంగా తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో సీతా ఫలాలు బాగా హెల్ప్ చేస్తాయి. అంతే కాకుండా వింటర్ సీజన్ లో స్కిన్ అనేది పొడిబారిపోయినట్టు అయి.. అంద విహీనంగా కనిపిస్తుంది. సీతా ఫలాలతో ఆ సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు. వీటిని తిన్నా.. చర్మంపై రాసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి. ఎన్నో పోషకాలు ఉండే సీతా ఫలాలను.. షుగర్ పేషెంట్స్ తినడానికి సందేహిస్తూంటారు. ఇవి తింటే షుగర్ లెవల్స్ ఇంకా పెరుగుతాయని భయ పడుతూంటారు. మరి సీతా ఫలం గురించి ఇంకా ఎన్నో అనుమానాలు ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

డయాబెటీస్ ఉన్న వారు సీతా ఫలం తినొచ్చా:

సీతా ఫలం నేచురల్ స్వీట్ గా ఉంటుంది. అందుకే దీన్ని తినడానికి మధు మేహ వ్యాధిగ్రస్తులు అనుమానిస్తూంటారు. అయితే వీటిల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ ఉన్న వారు ఎలాంటి భయం లేకుండా వీటిని తినవచ్చు. అందులోనూ సీజనల్ గా దొరికే పండు కాబట్టి.. మితంగా సీతా ఫలాన్ని తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సీతా ఫలం తింటే బరువు పెరుగుతారా:

చాలా మందిలో సీతా ఫలం తింటే బరువు పెరుగుతారేమో అనే అనుమానం కూడా ఉంటుంది. అయితే ఇది కేవలం అపోహ మాత్రమేనని నిపుణులు కొట్టి పారేస్తున్నారు. సీతా ఫలంలో క్యాలరీలు, కొవ్వులు అనేవి చాలా తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక్క పండు తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి సీతా ఫలం తింటే హ్యాపీగా బరువు తగ్గొచ్చు.

పీసీఓఎస్ ఉన్న వారికి బెస్ట్:

పీసీఓఎస్ ఉన్న వారికి సీతా ఫలం బెస్ట్ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. పీసీఓఎస్ ఉన్న వారిలో హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ ఉంటుంది. దీని వల్ల నీరసం, అలసట, చికాకు, మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయి. అయితే సీతా ఫలంలో ఉండే ఐరన్ ఈ సమస్యలన్నింటినీ దూరం చేస్తుంది. అంతే కాకుండా గర్భిణిలు సీతా ఫలాన్ని తింటే.. మల బద్ధకాన్ని దూరం చేసుకోవచ్చు. అలాగే వికారం, వాంతులు వాంటి వాటికి కూడా చెక్ పెట్టవచ్చు.

కాబట్టి ఎలాంటి సందేహాలు లేకుండా సీతా ఫలాన్ని తినొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి నిపుణులను సంప్రదించడం మేలు.

GHMC లో రేపటి నుంచి ప్రాపర్టీ సర్వే
GHMC లో రేపటి నుంచి ప్రాపర్టీ సర్వే
అక్రమ కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ శాఖ ఉక్కుపాదం
అక్రమ కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ శాఖ ఉక్కుపాదం
సిలిండర్ల లోడుతో వెళ్తున్న వాహనం.. ప్రాణం పోతున్నా ??
సిలిండర్ల లోడుతో వెళ్తున్న వాహనం.. ప్రాణం పోతున్నా ??
తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ??
తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ??
రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! వైరల్‌ వీడియో
రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! వైరల్‌ వీడియో
గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!
గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!
150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. ఈ ఆకుతో అదిరిపోయే బెనిఫిట్స్‌
150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. ఈ ఆకుతో అదిరిపోయే బెనిఫిట్స్‌
ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా
ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా.. ఎన్ని రూ.వేలు కట్టాలో తెలుసా ?
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా.. ఎన్ని రూ.వేలు కట్టాలో తెలుసా ?
నేపాల్‌లో విమాన ప్రమాదం.. పైలెట్ ప్రాణాన్ని కాపాడిన ఓ కంటైనర్‌
నేపాల్‌లో విమాన ప్రమాదం.. పైలెట్ ప్రాణాన్ని కాపాడిన ఓ కంటైనర్‌