Cut Vegetables Side Effects: కట్ చేసి కూరగాయలను నిల్వ ఉంచుతున్నారా.. చాలా డేంజర్!

ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో కూరగాయలను కట్ చేయాల్సిన పనే ఉండటం లేదు. కట్ చేసిన కూరగాయలే సూపర్ మార్కెట్స్, ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటున్నాయి. అలాగే ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ కారణంగా.. ఖాళీగా ఉన్న సమయంలోనే కూరగాయలను కట్ చేసుకుని ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచుకుంటున్నారు. ఇలా కట్ చేసి నిల్వ ఉంచి వెజిటేబుల్స్ ని తినడం వల్ల లేని పోని సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలా కట్ చేసిన కూరగాయలను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక..

Cut Vegetables Side Effects: కట్ చేసి కూరగాయలను నిల్వ ఉంచుతున్నారా.. చాలా డేంజర్!
Cut Vegetables
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 30, 2023 | 7:50 AM

ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో కూరగాయలను కట్ చేయాల్సిన పనే ఉండటం లేదు. కట్ చేసిన కూరగాయలే సూపర్ మార్కెట్స్, ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటున్నాయి. అలాగే ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ కారణంగా.. ఖాళీగా ఉన్న సమయంలోనే కూరగాయలను కట్ చేసుకుని ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచుకుంటున్నారు. ఇలా కట్ చేసి నిల్వ ఉంచి వెజిటేబుల్స్ ని తినడం వల్ల లేని పోని సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలా కట్ చేసిన కూరగాయలను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాల్సింది పోయి.. విష పదార్థాలు చేరుతున్నాయి. ఇలాగే లేటెస్ట్ గా కట్ చేసి.. నిల్వ ఉంచిన ఉల్లిపాయలను తినడం వల్ల కాలిఫోర్నియాలోని 72 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ కట్ చేసిన ఉల్లిపాయల్లో సాల్మొనెల్లాను గుర్తించారు అధికారులు.

సాల్మొనెల్లా అంటే ఏంటి?

సాల్మొనెల్లా అనేది ఫుడ్ ద్వారా వ్యాపించే ఇన్ ఫెక్షన్. ఇది నిల్వ ఉంచి ఆహార పదార్థాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. సాల్మొనెల్లా ఉన్న ఆహారాలను తినడం వల్ల తీవ్ర అస్వస్థతకు గురవుతారు. ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా నెలకొంటుంది. సాల్మొనెల్లా ఇన్ ఫెక్షన్ సోకితే.. జ్వరం, వికారం, వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపులో నొప్పి ఇలాంటి కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

అయితే ఈ ఇన్ ఫెక్షన్ అనేది కొందరిలో తొందరగా బయట పడితే.. మరి కొందరిలో లేటుగా బయట పడుతుంది. అయితే దీనికి చికిత్స ఉంది కాబట్టి పెద్దగా భయ పడాల్సిన అవసరం లేదు. లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే చికిత్స తీసుకోవాలి. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారికి, ఐదేళ్లు కంటే చిన్న పిల్లలు.. నిల్వ చేసిన ఆహారానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వీరిలో రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది.

ఫ్రెష్ గా కట్ చేసుకుని తింటేనే హెల్దీ:

టైమ్ లేక ఇప్పుడు చాలా మంది ముందుగానే కట్ చేసుకుని ఫ్రిడ్జ్ లో నిల్వ చేస్తున్నారు. ఇలా చేయడం చాలా తప్పని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే బయట కూడా నిల్వ చేసిన ఆహారానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఉల్లిపాయలైనా, వెజిటేబుల్స్ అయినా.. కట్ చేయనంత వరకే వాటిలో పోషక విలువలు ఉంటాయి. ఒక్కసారి కట్ చేసిన తర్వాత వెంటనే వాటిని వంటల్లో వినియోగించాలి. లేదంటే వాటిట్లో బ్యాక్టీరియా, సూక్ష్మీ జీవులు చేరి తిష్ట వేస్తాయి. దీంతో వివిధ రకాల వ్యాధులు, ఇన్ ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు కూరగాయలను కట్ చేసుకుని వాడుకోవడం మంచిది.

గమనిక: ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి నిపుణులను సంప్రదించడం మేలు.