- Telugu News Photo Gallery Vomiting while travelling, follow these tips are for you, check here is details
Home Remedies: ప్రయాణంలో వాంతులు అవుతున్నాయా.. ఈ చిట్కాలు మీకోసమే!
చాలా మందికి ప్రయాణం చేయాలంటే చాలా భయం. ప్రయాణం చేయడానికి అస్సలు ఇష్ట పడరు. దీనికి ముఖ్య కారణం.. ప్రయాణం చేసేటప్పుడు చాలా మందికి వికారం, తల తిరగడం, నీరసంగా ఉండటం, కడుపులో తిప్పడం, మోషన్ సిక్ నెస్ ఇలా ఇబ్బందిగా ఉంటుంది. వీటి వల్లనే ప్రయాణాన్ని ఇష్ట పడరు. ఈ భయంతోనే ఏమీ తినకుండా ప్రయాణం చేస్తారు. ఇలాంటి సమస్యలకు కొన్ని ఆయుర్వేద చిట్కాలతో..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Oct 30, 2023 | 8:00 AM

చాలా మందికి ప్రయాణం చేయాలంటే చాలా భయం. ప్రయాణం చేయడానికి అస్సలు ఇష్ట పడరు. దీనికి ముఖ్య కారణం.. ప్రయాణం చేసేటప్పుడు చాలా మందికి వికారం, తల తిరగడం, నీరసంగా ఉండటం, కడుపులో తిప్పడం, మోషన్ సిక్ నెస్ ఇలా ఇబ్బందిగా ఉంటుంది. వీటి వల్లనే ప్రయాణాన్ని ఇష్ట పడరు. ఈ భయంతోనే ఏమీ తినకుండా ప్రయాణం చేస్తారు. ఇలాంటి సమస్యలకు కొన్ని ఆయుర్వేద చిట్కాలతో చెక్ పెట్టవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లం: అల్లంతో వికారం, వాంతులు, సిక్ నెస్ వంటి సమస్యలకు బైబై చెప్పవచ్చు. ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ప్రయాణం చేసేటప్పుడు జింజర్ క్యాండీలను తింటూ ఉండండి. అంతే కాకుండా జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది.

అల్లం: అల్లంతో వికారం, వాంతులు, సిక్ నెస్ వంటి సమస్యలకు బైబై చెప్పవచ్చు. ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ప్రయాణం చేసేటప్పుడు జింజర్ క్యాండీలను తింటూ ఉండండి. అంతే కాకుండా జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది.

సోంపు: సోంపు గింజలు కూడా దాదాపు అందరి ఇళ్లలో ఉంటాయి. సోంపు తింటే తిన్న ఆహారం అరగడమే కాకుండా.. వికారం, వాంతులు వంటి లక్షణాలను తగ్గిస్తుంది. కాబట్టి మీరు జర్నీ చేసేటప్పుడు సోంపును కూడా వెంట తీసుకెళ్లండి. ప్రయాణంలో సోంపును తింటే ఈ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.

ఉసిరి: ఉసిరి కాయలో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. ఇందులో రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఉసిరి తిన్నా కూడా వికారం, నీరసం, వాంతులు, కడుపులో తిప్పడం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కాబట్టి మీరు ప్రయాణం చేసేటప్పుడు ఉసిరి తింటే సరిపోతుంది.





























