అప్ కమింగ్ తెలుగు సినిమాల్లో వెయ్యి కోట్ల మార్క్‌ను టచ్ చేసే రేంజ్ అంచనాలు ఉన్న సినిమాలు రెండే. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పుష్ప 2తో పాటు ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబో తెరకెక్కుతున్న సలార్. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్లుగా తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాల మీద వెయ్యి కోట్ల ఆశలు గట్టిగానే ఉన్నాయి. మరి వీళ్లైన మరోసారి నేషనల్ బాక్సాఫీస్ ముందు మన జెండా ఎగరేస్తారేమో చూడాలి.