Paneer Bhurji: ధాబా స్టైల్ పన్నీర్ బుర్జీని ఇలా చేయండి.. లొట్టలేసుకుంటూ మొత్తం తినేస్తారు!

మనం తీసుకునే ఆహారంలో పన్నీర్ కూడా ఒకటి. పన్నీర్ తో ఎన్నో రకాల వెరైటీలను ట్రై చేసి ఉంటారు. వెజిటేరియన్ ప్రియులు ఎక్కువగా హోటల్, రెస్టారెంట్స్ లో దొరికే పన్నీర్ ఐటెమ్స్ ని టేస్ట్ చేసే ఉంటారు. రోటీలు, చపాతీ, థందూరి రోటీ, జింజర్ రోటీ, బటర్ నాన్ వీటితో పాటు తింటే అబ్బా.. ఆ రుచే వేరు. లొట్టలేసుకుంటూ మొత్తం లాగించేస్తారు. పన్నీర్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పన్నీర్ లో క్యాల్షియం, ప్రోటీన్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరాన్ని, ఎముకలను..

Paneer Bhurji: ధాబా స్టైల్ పన్నీర్ బుర్జీని ఇలా చేయండి.. లొట్టలేసుకుంటూ మొత్తం తినేస్తారు!
Paneer Bhurji
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 30, 2023 | 7:00 AM

మనం తీసుకునే ఆహారంలో పన్నీర్ కూడా ఒకటి. పన్నీర్ తో ఎన్నో రకాల వెరైటీలను ట్రై చేసి ఉంటారు. వెజిటేరియన్ ప్రియులు ఎక్కువగా హోటల్, రెస్టారెంట్స్ లో దొరికే పన్నీర్ ఐటెమ్స్ ని టేస్ట్ చేసే ఉంటారు. రోటీలు, చపాతీ, థందూరి రోటీ, జింజర్ రోటీ, బటర్ నాన్ వీటితో పాటు తింటే అబ్బా.. ఆ రుచే వేరు. లొట్టలేసుకుంటూ మొత్తం లాగించేస్తారు. పన్నీర్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పన్నీర్ లో క్యాల్షియం, ప్రోటీన్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరాన్ని, ఎముకలను దృఢంగా చేస్తాయి. కాబట్టి పన్నీర్ ను తింటే ఎలాంటి నష్టాలు లేవు. అయితే మరీ ఎక్కువగా తినకూడదు. అలాగే పన్నీర్ బుర్జీ గురించి వినే ఉంటారు. దీన్ని ఎక్కువగా ధాబాల్లో చేస్తారు. చపాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో తింటే భలే రుచిగా ఉంటుంది. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి ధాబా స్టైల్ పన్నీర్ బుర్జీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

పన్నీర్ బుర్జీకి కావాల్సిన పదార్థాలు:

పన్నీర్, క్యాప్సికం, టమాటా, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, నెయ్యి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, ఉప్పు, నిమ్మరసం, కొత్తి మీర, నిమ్మ రసం.

ఇవి కూడా చదవండి

ధాబా స్టైల్ పన్నీర్ బుర్జీ తయారీ విధానం:

ముందుగా ఒక మందపాటి, విశాలంగా ఉన్న కడాయి తీసుకోవాలి. ఇందులో కొద్దగా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. వేడి అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి రంగు మారాక.. క్యాప్సికం వేసి కలుపుకోవాలి. దీన్ని రెండు నిమిషాల పాటు వేయించుకున్నాక.. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి.. వాసన పోయేంత వరకూ బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి, మెత్తబడేంత వరకూ ఫ్రై చేసుకోవాలి.

నెక్ట్స్ ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత పన్నీర్ నలిపి వేసుకోవాలి. దీన్ని బాగా వేయించుకున్నాక.. దించే ముందు ఆ కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్ట్స్ కొత్తి మీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బుర్జీ రెడీ. దీన్ని పలావ్ లో అయినా చపాతీలోకి అయినా తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది.

ఇక్కడ కెప్టెన్..అక్కడ మాజీ కెప్టెన్..ఇక ఆసీస్‌కు మూడిందా?
ఇక్కడ కెప్టెన్..అక్కడ మాజీ కెప్టెన్..ఇక ఆసీస్‌కు మూడిందా?
కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో పనులు: మంత్రి నారాయణ
కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో పనులు: మంత్రి నారాయణ
ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి.. పత్తి చేనులో పాతెట్టాడు
ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి.. పత్తి చేనులో పాతెట్టాడు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ మట్కా టీమ్‌.. వీడియో
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ మట్కా టీమ్‌.. వీడియో
చపాతీలు మెత్తగా, దూదిలా రావాలంటే ఈసారి ఇవి కలపండి..
చపాతీలు మెత్తగా, దూదిలా రావాలంటే ఈసారి ఇవి కలపండి..
కొల్లాజెన్ పౌడర్ అందానికి, ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా
కొల్లాజెన్ పౌడర్ అందానికి, ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా
ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమె..
ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమె..
కత్తి పట్టిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
కత్తి పట్టిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తిరుమలలో మహిళలు తలలో పూలు ఎందుకు పెట్టుకోరు...?
తిరుమలలో మహిళలు తలలో పూలు ఎందుకు పెట్టుకోరు...?
44,228 తపాలా జీడీఎస్‌ పోస్టుల ఫలితాలు విడుదల.. కటాఫ్‌ ఎంతంటే
44,228 తపాలా జీడీఎస్‌ పోస్టుల ఫలితాలు విడుదల.. కటాఫ్‌ ఎంతంటే
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!