AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: గుండె జబ్బులు ఉన్నవారు నెయ్యి, వెన్న తినవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

పెద్దవారిలోనే కాదు యువతలో కూడా గుండె జబ్బుల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. హార్ట్ పేషెంట్లు కూడా తమ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. తద్వారా ప్రమాదం పెరగదు. ఆహారంలో ఎక్కువ కొవ్వు కలపడం వల్ల కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతుంది. హృద్రోగులు నెయ్యి లేదా వెన్న తినకుండా ఉండటానికి కారణం ఇదే. హృద్రోగుల ఆహారపు అలవాట్లు కూడా అంతంతమాత్రంగానే ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు...

Health Tips: గుండె జబ్బులు ఉన్నవారు నెయ్యి, వెన్న తినవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
Health Tips
Subhash Goud
|

Updated on: Oct 30, 2023 | 7:00 AM

Share

గుండె జబ్బులతో బాధపడేవారు ఆహారంలో నెయ్యి, వెన్నను సక్రమంగా తీసుకుంటే ఎలాంటి హాని ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నెయ్యి, వెన్నలో సంతృప్త కొవ్వు పుష్కలంగా ఉంటుంది. గుండె జబ్బుల ముప్పు పెరగడానికి ఇదే కారణం. హృద్రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణుల ద్వారా తెలుసుకుందాం..

పెద్దవారిలోనే కాదు యువతలో కూడా గుండె జబ్బుల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. హార్ట్ పేషెంట్లు కూడా తమ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. తద్వారా ప్రమాదం పెరగదు. ఆహారంలో ఎక్కువ కొవ్వు కలపడం వల్ల కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతుంది. హృద్రోగులు నెయ్యి లేదా వెన్న తినకుండా ఉండటానికి కారణం ఇదే. హృద్రోగుల ఆహారపు అలవాట్లు కూడా అంతంతమాత్రంగానే ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

చాలా మంది గుండె జబ్బులున్న వారు తమ ఆహారంలో నెయ్యి, వెన్నకు దూరంగా ఉంటారు. అయితే హృద్రోగులు నెయ్యి లేదా వెన్నని నిజంగా మానుకోవాలా లేక వాటిని ఆహారంలో చేర్చుకోవాలా అనేది ప్రశ్న. దీనికి సంబంధించి నిపుణుల సూచనలు, సలహాలు అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నెయ్యితో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం:

యోగా గురువు, యోగా ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు డాక్టర్ హంస యోగేంద్ర మాట్లాడుతూ, ప్రజలు ఈ విషయంలో తరచుగా గందరగోళానికి గురవుతారు. నెయ్యి, వెన్నలో సంతృప్త కొవ్వు పుష్కలంగా ఉంటుంది. గుండె జబ్బుల ముప్పు పెరగడానికి ఇదే కారణం.

హృద్రోగులు నెయ్యి, వెన్న తినవచ్చా?:

హృద్రోగులు ఇంట్లో తయారు చేసిన తెల్ల వెన్న, నెయ్యి తక్కువ మోతాదులో తినవచ్చని డాక్టర్ హంస యోగీందర్ చెబుతున్నారు. జున్ను, పప్పులు, కూరగాయలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారంపై దృష్టి పెట్టండి. చక్కెర, అధిక సోడియం వస్తువులను కూడా పరిమితం చేయండి. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లకు బదులుగా మీ ఆహారంలో తృణధాన్యాలు చేర్చండి.

మీ ఆహారం, పానీయాలను కూడా నియంత్రించండి:

ఇది కాకుండా, మీ ఆహారం, పానీయాలను నియంత్రించండి. మిమ్మల్ని మీరు వీలైనంత ఎక్కువగా హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి. దీని కోసం పుష్కలంగా నీరు తాగండి. అలాగే హైడ్రేటెడ్ గా ఉండండి. మద్యం సేవించవద్దు మీ రక్తంలో చక్కెర, రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ పండుగలను ఆనందించండి. అయితే గుండె జబ్బులు ఉన్నవారు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చాలా మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం, ఆహారపు అలవాట్లలలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి