Electric Scooter: అతి తక్కువ ధరలో లార్డ్స్ స్టార్టప్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రండి ‘జూమ్’ చేసి చూద్దాం..
గత కొన్నేళ్లుగా పలు ఈవీ స్టార్టప్స్ దేశ వ్యాప్తంగా పుట్టుకొచ్చాయి. వీటి నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ లు లాంచ్ అవుతున్నాయి. కాగా వీటిల్లో ప్రీమియం హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు బాగా డిమాండ్ ఏర్పడుతోంది. ఈ సెగ్మెంట్ ఇప్పటికే పలు ఈవీ కంపెనీలు తమ ఉత్పత్తులను సైతం లాంచ్ చేశాయి. అటువంటి ఓ ఈవీ స్టార్టప్ లార్డ్స్ ఆటోమోటివ్. దీని నుంచి విడుదలైన స్కూటర్ లార్డ్స్ జూమ్. దేశంలోనే అనువైన బడ్జెట్లో లభించే స్కూటర్ గా ఇది నిలుస్తోంది.
మన దేశంలోని ఆటోమొబైల్ మార్కెట్ ఎలక్ట్రిఫై అవుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దారులు పెద్ద ఎత్తున కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నారు. అలాగే కొనుగోలు దారుల నుంచి కూడా అదే విధమైన డిమాండ్ వాటికి ఉంటుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అంతకంతకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు దీనికి ప్రధాన కారణంగా మారుతున్నాయి. పైగా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు కార్బన ఉద్ఘారాలను నియంత్రించే క్రమంలో ప్రపంచంలోని అన్ని దేశాలు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఇవి పూర్తి పర్యావరణ హితం కావడంతో అందరికీ వీటిపై ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలోనే గత కొన్నేళ్లుగా పలు ఈవీ స్టార్టప్స్ దేశ వ్యాప్తంగా పుట్టుకొచ్చాయి. వీటి నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ లు లాంచ్ అవుతున్నాయి. కాగా వీటిల్లో ప్రీమియం హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు బాగా డిమాండ్ ఏర్పడుతోంది. ఈ సెగ్మెంట్ ఇప్పటికే పలు ఈవీ కంపెనీలు తమ ఉత్పత్తులను సైతం లాంచ్ చేశాయి. అటువంటి ఓ ఈవీ స్టార్టప్ లార్డ్స్ ఆటోమోటివ్. దీని నుంచి విడుదలైన స్కూటర్ లార్డ్స్ జూమ్. దేశంలోనే అనువైన బడ్జెట్లో లభించే స్కూటర్ గా ఇది నిలుస్తోంది. ఈ నేపథ్యంలో దీని గురించిన పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం..
లార్డ్స్ జూమ్ డిజైన్..
లార్డ్స్ జూమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లుక్ పెద్ద ఇంప్రెసివ్ గా ఏమి ఉండదు. ఇది చూడటానికి సాధారణ స్కూటర్ మాదిరిగానే కనిపిస్తుంది. అంత ఆకర్షణీయంగా ఏమి ఉండదు. దీనికి ముందు వైపు పెద్ద ఇన్వర్టెడ్ డెల్టా షేప్డ్ హెడ్ ల్యాంప్ ఉంటుంది. ఎల్ఈడీ ల్యాంప్ అందులో ఉంటుంది. హ్యాండిల్ బార్స్ కి టర్న్ ఇండికేటర్స్ అమర్చారు.
ఈ స్కూటర్లో పూర్తి డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ అమర్చారు. దీనిలో రైడర్ కు అవసరమైన ముఖ్యమైన సమచారాన్ని డిస్ ప్లే చేస్తుంది. ఈ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్కు ఇరువైపు స్విచ్ లు అందించారు. ఇవి వివిధ ఫంక్షన్లను నిర్వర్తించడానికి ఉపయోగపడుతుంది. ఎడమ చేతి వైపు హర్న్ బటన్ ఇచ్చారు. అయితే ఇది అంత అనువుగా లేదు. ఈ స్కూటర్లో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ లోపంగా చెప్పొచ్చు. కుడిచేతి వైపు మూడు రైడింగ్ మోడ్లకు సంబంధించిన బటన్స్ ఇచ్చారు. అలాగే రివర్స్ మోడ్ కు ప్రత్యేక మైన స్విచ్ ను అమర్చారు.
ఇక ఫుట్ బోర్డ్ ప్రాంతం కాస్త స్పేషియస్ గా అమర్చారు. ఈ స్కూటర్లో సీట్ వెడల్పుగా ఉంది. అలాగే బ్యాక్ రెస్ట్ కూడా బాగానే ఉంది. వెనువైపు వెళ్తే పొడవైన పెద్దదైన టైల్ లైట్ ఉంటుంది. మందపాటి గ్రాబ్ రెయిల్ ఉంటుంది. ఈ లార్డ్స్ జూమ్ మూడు విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
లార్డ్స్ జూమ్ ఫీచర్లు..
ఈ స్కూటర్ లో పూర్తి డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ అందుబాటులో ఉంటుంది. ఎల్సీడీ ప్యానల్ డిస్ ప్లే చేస్తుంది. ఇది స్కూటర్ కు సంబంధించిన పలు సమచారాన్ని దానిలో చూపుతుంది. అయితే కనెక్టివిటీ ఆప్షన్లు ఏమి లేవు. దీని ధర రూ. 54,000 నుంచి రూ. 69,999(ఎక్స్ షోరూం) ఉంటుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 24 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. అయితే రైడింగ్ మోడ్ లను బట్టి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలుగుతుంది.
బ్యాటరీ రేంజ్..
దీనిలో 48వోల్ట్స్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే 60వోల్టుల లిథియం అయాన్ బ్యాటరీ వేరియంట్ సింగిల్ చార్జ్ పై 100 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. ఇది రి ప్లేసబుల్ బ్యాటరీ అవడం వినియోగదారులకు అదనపు సౌలభ్యాన్ని అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..