TVS Ronin Special Edition: రెట్రో లుక్.. స్టైలిష్ డిజైన్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన రోనిన్.. ఫీచర్లు మామూలుగా లేవుగా..

ఫెస్టివ్ సీజన్లో ఆటోమొబైల్స్ ఫుల్ జోష్ మీద ఉంది. కొత్త ఉత్పత్తుల పరిచయాలు.. కొంగొత్త ఆఫర్లు లతో సేల్స్ ఊపందుకున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ టూ వీలర్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ టీవీఎస్ మోటార్ కొత్త రోనిన్ స్పెషల్ ఎడిషన్ బైక్ ను దేశంలో ఆవిష్కరించింది. దీని ధర రూ. 1.73లక్షలు(ఎక్స్ షోరూం) ఉంది. ఈ మోడ్రన్ రెట్రో లుక్ మోటార్ సైకిల్ లో టీవీఎస్ పలు ఆసక్తికర అప్ గ్రేడ్లను తీసుకొచ్చింది.

TVS Ronin Special Edition: రెట్రో లుక్.. స్టైలిష్ డిజైన్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన రోనిన్.. ఫీచర్లు మామూలుగా లేవుగా..
Tvs Ronin Special Edition
Follow us
Madhu

|

Updated on: Oct 29, 2023 | 5:00 PM

ఫెస్టివ్ సీజన్లో ఆటోమొబైల్స్ ఫుల్ జోష్ మీద ఉంది. కొత్త ఉత్పత్తుల పరిచయాలు.. కొంగొత్త ఆఫర్లు లతో సేల్స్ ఊపందుకున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ టూ వీలర్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ టీవీఎస్ మోటార్స్ కొత్త రోనిన్ స్పెషల్ ఎడిషన్ బైక్ ను దేశంలో ఆవిష్కరించింది. దీని ధర రూ. 1.73లక్షలు(ఎక్స్ షోరూం) ఉంది. ఈ మోడ్రన్ రెట్రో లుక్ మోటార్ సైకిల్ లో టీవీఎస్ పలు ఆసక్తికర అప్ గ్రేడ్లను తీసుకొచ్చింది. తద్వారా కస్టమర్లకు ఈ ఫెస్టివ్ సీజన్లో ఆసక్తిని కలుగజేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

విభిన్న కలర్ ఆప్షన్లలో..

టీవీఎస్ రోనిక్ స్పెషల్ ఎడిషన్ బైక్ ఇప్పుడు సరికొత్త కలర్ ఆప్షన్లో అందుబాటులోకి వచ్చింది. నింబస్ గ్రే షేడ్ లో, బైక్ బాడీపై విభిన్నంగా కనిపించే గ్రాఫిక్స్ తో పాత మోడల్ కన్నా కొత్త లుక్ లో దర్శనమిస్తోంది. ఈ బైక్ మొత్తం మూడు కలర్ స్కీమ్స్ లో అందుబాటులో వచ్చింది. అందుకే గ్రే షేడ్ బేస్ కలర్ ఆప్షన్ కాగా.. ఫ్యూయల్ ట్యాంక్ తో బండి సైడు ప్యానల్స్ కి వైట్ అండ్ రెడ్ స్ట్రైప్స్ వచ్చేలా కొత్త వేరియంట్లను తీసుకొచ్చారు. అలాగే బండికి ‘ఆర్’ అనే లోగో అమర్చిన తీరు ఆకర్షిస్తుంది. అలాగే చక్రాల రిమ్స్, హెడ్ ల్యాంప్ బెజెల్ బ్లాక్ ఫినిష్ లో ఇచ్చారు. ఈ స్పెషల్ ఎడిషన్ మోటర్ సైకిల్ లో ముందే అమర్చిన యూఎస్బీ చార్జర్, వైజర్, అలాగే ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈఎఫ్ఐ కవర్ ఉంటుంది.

ఊహించని అనుభూతి..

టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రీమియం బిజినెస్ హెడ్ విమల్ సంబ్లై మాట్లాడుతూ టీవీఎస్ రోనిన్ ని మోడ్రన్ రెట్రో స్టైల్, పీచర్లు రైడర్లకు వినూత్నమైన రైడింగ్ అనుభవాన్ని ఈ బైక్ ఇస్తుందని పేర్కొన్నారు. ఈ టీవీఎస్ రోనిన్ బైక్ గతేడాది మార్కెట్లోకి వచ్చిందన్నారు. కంపెనీ నుంచి వచ్చిన మొదటి ప్రీమియం లైఫ్ స్టైల్ సెగ్మెంట్ బైక్ గా కాగా.. ఇప్పుడు ఏడాది తర్వాత దీనిని అప్ గ్రేడ్ చేసి రెట్రో స్టైల్లో తీసుకొచ్చామని ఆయన చెప్పారు..

ఇవి కూడా చదవండి

టీవీఎస్ రోనిన్ స్పెసిఫికేషన్లు..

ఈ స్పెషల్ రోనిన్ బైక్లో మెకానికల్ గా ఎటువంటి మార్పులు చేయలేదు. దీనిలో కూడా పాత మోడల్ బైక్ లో లాగానే 225.9 సీసీ సింగిల్ సిలెండర్, ఆయిల్ కూల్డ్ మోటార్ ఉంటుంది. ఇది 20.1బీహెచ్పీ, 19.93 ఎన్ఎం గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ఇది స్లిప్పర్ క్లట్చ్ తో వస్తుంది. ముందు వైపు 41ఎంఎం ఫ్రంట్ ఫోర్క్, వెనుకవైపు ఏడు స్టెప్ అడ్జస్టబుల్ మోనో షాక్ అబ్జర్బర్ ఉంటుంది. ముందూ వెనుక డిస్క్ బ్రేకులు డ్యూయల్ ఏబీఎస్ చానల్ ఉంటుంది. టీ ఆకారంలో ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, రెండు రైడింగ్ మోడ్లు రెయిన్, అర్బన్ ఉంటాయి. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..