Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh ambani: అంబానీకి మరో బెదిరింపు మెయిల్‌.. ఇప్పుడు ఏకంగా రూ.200 కోట్లు డిమాండ్‌

మరోసారి మెయిల్‌ పంపుతూ ఎక్కువ మొత్తంలో డబ్బును డిమాండ్‌ చేశాడు దుండగుడు. ముఖేష్ అంబానీ నుండి 200 కోట్ల రూపాయలు రాబట్టేందుకు ప్లాన్‌ వేశారు. ముందుగా స్పందించకపోవడంతో ఇప్పుడు రూ.200 కోట్లు ఇవ్వాలని మెయిల్‌లో డిమాండ్‌ చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అంతకుముందు, ముఖేష్ అంబానీని షార్ప్ షూటర్‌తో కాల్చివేస్తానని శుక్రవారం సాయంత్రం ఇ-మెయిల్ వచ్చిందని ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ పోలీసులకు..

Mukesh ambani: అంబానీకి మరో బెదిరింపు మెయిల్‌.. ఇప్పుడు ఏకంగా రూ.200 కోట్లు డిమాండ్‌
Ambani
Follow us
Subhash Goud

|

Updated on: Oct 29, 2023 | 7:04 PM

దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, బిలియనీర్ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి వరుసగా రెండో రోజు కూడా హత్య బెదిరింపులు వచ్చాయి. ఈసారి కూడా అతనికి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. అది మునుపటి ఈ-మెయిల్ ఐడి నుంచే వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా పంపిన ఈమెయిల్‌కు స్పందించకపోవడంతో మరోసారి మెయిల్‌ పంపుతూ ఎక్కువ మొత్తంలో డబ్బును డిమాండ్‌ చేశాడు దుండగుడు. ముఖేష్ అంబానీ నుండి 200 కోట్ల రూపాయలు రాబట్టేందుకు ప్లాన్‌ వేశారు. ముందుగా స్పందించకపోవడంతో ఇప్పుడు రూ.200 కోట్లు ఇవ్వాలని మెయిల్‌లో డిమాండ్‌ చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

అంతకుముందు, ముఖేష్ అంబానీని షార్ప్ షూటర్‌తో కాల్చివేస్తానని శుక్రవారం సాయంత్రం ఇ-మెయిల్ వచ్చిందని ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ పోలీసులకు సమాచారం అందించాడు. దీనిపై గాందేవి పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. ఇప్పుడు మరోసారి అదే ఈ-మెయిల్ ఐడీ నుంచి హత్య బెదిరింపులు వచ్చాయి.

అక్టోబర్ 27న ముకేశ్ అంబానీకి మొదటి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. భారత్‌లో అత్యుత్తమ షార్ప్ షూటర్లు అతని వద్ద ఉన్నారని ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు. ప్రాణం కాపాడాలంటే రూ.20 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆ తర్వాత, సెక్యూరిటీ ఇన్‌చార్జి సమాచారం మేరకు, ముంబై పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 387 మరియు 506 (2) కింద గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో ముఖేశ్ అంబానీకి ముగ్గురు పిల్లలను చేర్చేందుకు షేర్ హోల్డర్లు ఆమోదం తెలిపిన రోజే ఈ బెదిరింపు మెయిల్ రావడం గమనార్హం. అదే రోజున కంపెనీ జూలై-సెప్టెంబర్ ఫలితాలను ప్రకటించింది. ఇందులో ముఖేష్ అంబానీ కంపెనీ రూ.19,878 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

అయితే ముఖేష్ అంబానీ లేదా అతని కుటుంబానికి హత్య బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది అక్టోబరు 5న రిలయన్స్‌ ఫౌండేషన్‌కు చెందిన ఓ ఆసుపత్రికి ఫోన్‌ చేసి అంబానీ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. ఆసుపత్రిని బాంబుతో పేల్చివేయాలనే చర్చ కూడా జరిగింది. అయితే, ఆ వ్యక్తిని మరుసటి రోజు బీహార్‌లో అరెస్టు చేశారు. అతన్ని రాకేష్ కుమార్ శర్మగా గుర్తించారు. ఇది మాత్రమే కాదు, కొన్ని సంవత్సరాల క్రితం ముఖేష్ అంబానీ ఇంటి ఆంటిలియా వెలుపల పేలుడు పదార్థాలతో నిండిన వాహనం గుర్తించడం కలకలం రేపింది. తాజాగా రెండు సార్లు ఇమెయిల్‌ రావడంతో పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

క్యాబ్ బుక్ చేసుకునే వారికి బిగ్‌ షాక్.. ఇకపై చుక్కలే!
క్యాబ్ బుక్ చేసుకునే వారికి బిగ్‌ షాక్.. ఇకపై చుక్కలే!
ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్టుని ఈజీగా చేసుకోండి.. రెసిపీ మీ కోసం
ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్టుని ఈజీగా చేసుకోండి.. రెసిపీ మీ కోసం
RRB రైల్వే పరీక్షల తేదీలు 2025 వచ్చేశాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
RRB రైల్వే పరీక్షల తేదీలు 2025 వచ్చేశాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. హనుమకొండకు కొత్త IIIT ఐటీ క్యాంపస్!
విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. హనుమకొండకు కొత్త IIIT ఐటీ క్యాంపస్!
రెండు రోజులపాటు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం..
రెండు రోజులపాటు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం..
గణపతి ఆలయాల్లో ఒక్కదానికి దర్శించినా చాలు జాతకంలో దోషం మాయం..
గణపతి ఆలయాల్లో ఒక్కదానికి దర్శించినా చాలు జాతకంలో దోషం మాయం..
బెట్టింగ్ కేసులో సినీ సెలబ్రెటీలకు బిగ్ రిలీఫ్.. కొత్త ట్విస్ట్!
బెట్టింగ్ కేసులో సినీ సెలబ్రెటీలకు బిగ్ రిలీఫ్.. కొత్త ట్విస్ట్!
అటు ఎండలు.. ఇటు వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం..
అటు ఎండలు.. ఇటు వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం..
సీన్ సీన్‌కు గుండె జారీ ప్యాంట్‌లోకి రావాల్సిందే..
సీన్ సీన్‌కు గుండె జారీ ప్యాంట్‌లోకి రావాల్సిందే..
డ్రాగన్ సినిమా పై దళపతి ప్రశంసలు..
డ్రాగన్ సినిమా పై దళపతి ప్రశంసలు..
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!