Mushrooms Benefits: ఇమ్యూనిటీని పెంచి.. ఒత్తిడిని తగ్గించే పుట్ట గొడుగులు.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్!
మనం తినే ఆహారంలో పుట్ట గొడుగులు కూడా ఒకటి. ఈ మష్రూమ్స్.. వెజిటేరియన్స్ కి నాన్ వెజ్ అని చెప్పవచ్చు. నాన్ వెజ్ తినని వాళ్లకు పన్నీర్ తర్వాత మష్రూమే వండి పెడతారు. మష్రూమ్ ని సరిగ్గా వండితే అచ్చం.. మటన్, చికెన్ తిన్నంత ఫీల్ ఉంటుంది. ఇది నిజంగానే మంచి సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. వీటిల్లో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అనారోగ్య సమస్యల్ని కూడా దూరం చేసుకోవచ్చు. మష్రూమ్స్ తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని..
మనం తినే ఆహారంలో పుట్ట గొడుగులు కూడా ఒకటి. ఈ మష్రూమ్స్.. వెజిటేరియన్స్ కి నాన్ వెజ్ అని చెప్పవచ్చు. నాన్ వెజ్ తినని వాళ్లకు పన్నీర్ తర్వాత మష్రూమే వండి పెడతారు. మష్రూమ్ ని సరిగ్గా వండితే అచ్చం.. మటన్, చికెన్ తిన్నంత ఫీల్ ఉంటుంది. ఇది నిజంగానే మంచి సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. వీటిల్లో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అనారోగ్య సమస్యల్ని కూడా దూరం చేసుకోవచ్చు. మష్రూమ్స్ తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఒత్తిడిని కూడా దూరం చేసుకోవచ్చు. అంతే కాకుండా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కూడా మష్రూమ్ తో తగ్గించుకోవచ్చు. ఈ మష్రూమ్స్ తో ముఖ్యంగా ఇమ్యూనిటీని బూట్స్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మష్రూమ్ లోని పోషకాలు:
మష్రూమ్స్ లో విటమిన్లు బీ1, బీ2, బీ9, బీ12, సి, డి2, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, ఫైబర్, తక్కువ కేలరీలు ఉంటాయి. ఇన్ని పోషక విలువలు ఉన్న పుట్ట గొడుగులను.. చలి కాలంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా, బలంగా ఉంటాం.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:
పుట్ట గొడుగులు రోగ నిరోధక శక్తిని పెంచే మంచి ఆహార పదార్థం. రిషి, చాగా, మైటెక్ వంటి రకాలు బీటా-గ్లూకాన్ లను కలిగి ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచేందుకు హెల్ప్ చేస్తాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల పలు రకాల ఇన్ ఫెక్షన్లు, వ్యాధులు, అనారోగ్య సమస్యలు రాకుండా పోరాడేందుకు శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది:
ఒత్తిడి అనేది ఇప్పుడు ఆధునిక జీవితంలో ఒక భాగంమైంది. ఒత్తిడికి ఎక్కువగా గురి కావడం వల్ల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. మష్రూమ్స్ లో ఉండే కార్డిసెప్స్, లయన్స్ మేన్ వంటివి ఒత్తిడిని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. అలాగే ప్రశాంతత, సమతుల్య భావాన్ని ప్రోత్సహిస్తుంది. పుట్ట గొడుగులను ప్రతి రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళనను దూరం చేసుకోవచ్చు.
అభిజ్ఞా వృద్ధి:
బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటేనే శరీరం మొత్తం హెల్దీగా ఉంటుంది. అయితే ఇప్పుడు సాధారణంగా అందరిలో మతి మరుపు, జ్ఞాపక శక్తి నశించడం, అల్జీమర్స్ రావడం వల్ల జరుగుతుంది. అదే పుట్ట గొడుగులను మన ఆహారంలో ఒక భాగం చేసుకోవడం వల్ల అభిజ్ఞా వృద్ధి చెందుతుంది. ఇది సరైన విధంగా ఉంటేనే వీటన్నింటిని అదుపులోకి తీసుకురావచ్చు.
గమనిక: ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి నిపుణులను సంప్రదించడం మేలు.