AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండే రెండు చాలు.. అన్నం తిన్నాక వీటిని తింటే ఏం జరుగుతుందో మీరు ఊహించలేరు..

Green Chillies Benefits: మన వంటింట్లో పచ్చిమిరపకాయ లేనిదే ఏ కూరకూ రుచి రాదు. అయితే చాలా మంది దీనిని కేవలం కారం కోసమే వాడుతుంటాం. కానీ మీరు రోజూ తినే భోజనంలో ఒకటో రెండో పచ్చిమిరపకాయలు ఉంటే అవి మీ శరీరంలో అద్భుతాలు చేస్తాయని మీకు తెలుసా? అవును.. పచ్చిమిర్చి కేవలం నాలుకకు చురుకు పుట్టించడమే కాదు ఎన్నో అద్భుతాలను చేస్తుంది. ఈ చిన్న మిరపకాయలో దాగున్న ఆ పెద్ద ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం..

రెండే రెండు చాలు.. అన్నం తిన్నాక వీటిని తింటే ఏం జరుగుతుందో మీరు ఊహించలేరు..
Green Chillies Health Benefits
Krishna S
|

Updated on: Mar 27, 2026 | 5:16 PM

Share

మన భారతీయ భోజనంలో పచ్చిమిరపకాయ లేనిదే రుచి రాదు. కూరల్లో వేసినా, పక్కన నంజుకున్నా ఆ కిక్కే వేరు. అయితే చాలా మంది మహిళలు దీనిని కేవలం కారం కోసమే తింటారని అనుకుంటారు. కానీ ఈ చిన్న మిరపకాయలో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. బరువు తగ్గడం నుండి రోగనిరోధక శక్తి పెంచడం వరకు పచ్చిమిరపకాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. పచ్చిమిరపకాయలో క్యాప్సైసిన్ అనే క్రియాశీల పదార్ధం ఉంటుంది. ఇది శరీరంలో వేడిని పెంచి, జీవక్రియను ఉత్తేజపరుస్తుంది.

బరువు తగ్గడానికి వరం

మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? అయితే మీ భోజనంలో పచ్చిమిరపకాయ ఉండాల్సిందే. ఇందులోని క్యాప్సైసిన్ థర్మోజెనిసిస్‌ను పెంచి, శరీరంలోని అదనపు కేలరీలను దహించడానికి సహాయపడుతుంది. ఇది సహజంగానే మీ మెటబాలిజం రేటును పెంచుతుంది.

విటమిన్ సి ఖజానా

ఉసిరికాయ తరహాలోనే పచ్చిమిరపకాయలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడుతుంది. అంతేకాదు విటమిన్ సి వల్ల మీ చర్మం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ముఖంలో సహజమైన కాంతి పెరుగుతుంది.

షుగర్ లెవల్స్ నియంత్రణ

జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ పరిశోధన ప్రకారం.. పచ్చిమిరపకాయలు రక్తంలోని చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తాయి. భోజనం చేసిన తర్వాత ఇన్సులిన్ పనితీరును మెరుగుపరిచి, చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఇవి అడ్డుకుంటాయి.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

పచ్చిమిరపకాయలు తినడం వల్ల జీర్ణ ఎంజైమ్‌లు, జీర్ణరసాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మనం తిన్న ఆహారం త్వరగా, సాఫీగా అరగడానికి తోడ్పడుతుంది.

ఎన్ని తినాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

ఆరోగ్యంగా ఉన్న మహిళలు రోజుకు ఒకటి లేదా రెండు చిన్న పచ్చిమిరపకాయలు తినడం సురక్షితం. అయితే, అతిగా తింటే కడుపులో మంట లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే అల్సర్లు ఉన్నవారు, మొలల సమస్యతో బాధపడేవారు లేదా తీవ్రమైన అసిడిటీ ఉన్నవారు పచ్చిమిరపకాయలను తగ్గించడం లేదా పూర్తిగా మానుకోవడం మంచిది. ప్రకృతి అందించిన ఈ స్పైసీ ఔషధాన్ని పరిమితంగా తీసుకుంటే.. అది మీ ఆరోగ్యానికి రక్షణ కవచంలా మారుతుంది. కాబట్టి బాస్, రేపటి నుండి మీ భోజనంలో ఆ పచ్చిమిర్చి ఘాటును మిస్ అవ్వకండి..

Follow Us
చికెన్ లేకపోతే ఏంటి? ఈ 5 ఫుడ్స్ ప్రోటీన్‌కు బెస్ట్ ఆప్షన్స్
చికెన్ లేకపోతే ఏంటి? ఈ 5 ఫుడ్స్ ప్రోటీన్‌కు బెస్ట్ ఆప్షన్స్
కామద ఏకాదశి.. ఈ వస్తువులు దానం చేశారంటే.. సంపద, ఐశ్వర్యం మీ వెంట
కామద ఏకాదశి.. ఈ వస్తువులు దానం చేశారంటే.. సంపద, ఐశ్వర్యం మీ వెంట
భక్తితో అగ్గిపెట్టెపై రామాయణాన్ని చిత్రీకరించిన కళాకారుడు!
భక్తితో అగ్గిపెట్టెపై రామాయణాన్ని చిత్రీకరించిన కళాకారుడు!
ఆ దేశాన్ని మింగేస్తున్న సముద్రం.. 30 ఏళ్లలో మ్యాప్ నుంచే మాయం..
ఆ దేశాన్ని మింగేస్తున్న సముద్రం.. 30 ఏళ్లలో మ్యాప్ నుంచే మాయం..
అప్పుడే ఓటీటీలోకి 'ఉస్తాద్ భగత్ సింగ్'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అప్పుడే ఓటీటీలోకి 'ఉస్తాద్ భగత్ సింగ్'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కాశ్మీర్‌ కాదు మన అరకు.. పరవశించిపోయిన పర్యాటకులు.. ఇదిగో వీడియో
కాశ్మీర్‌ కాదు మన అరకు.. పరవశించిపోయిన పర్యాటకులు.. ఇదిగో వీడియో
శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమె..
శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమె..
పెట్రోల్‌పై పన్ను ఎలా విధిస్తారు..? ఎన్ని రకాలుగా ఉంటుంది..?
పెట్రోల్‌పై పన్ను ఎలా విధిస్తారు..? ఎన్ని రకాలుగా ఉంటుంది..?
ప్రకృతినే శాసించ గల శక్తి .. హనుమంతుడికి ఇచ్చింది ఎవరో తెలుసా?
ప్రకృతినే శాసించ గల శక్తి .. హనుమంతుడికి ఇచ్చింది ఎవరో తెలుసా?
చికెన్ లేదా గుడ్డు.. దేనిలో ఎక్కువ ప్రోటిన్ ఉటుంది
చికెన్ లేదా గుడ్డు.. దేనిలో ఎక్కువ ప్రోటిన్ ఉటుంది