Hair Care Tips: బొప్పాయితో జుట్టు రాలడానికి చెక్.. ఇలా ఉపయోగిస్తే ఫలితం పక్కా..
సాధారణంగా బొప్పాయి పండులో ఎన్నో పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ పండును దేవదూతల ఫలము అని అంటుంటారు.
సాధారణంగా బొప్పాయి పండులో ఎన్నో పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ పండును దేవదూతల ఫలము అని అంటుంటారు. ఇందులో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి బొప్పాయి పండు వలన అనేక ప్రయోజనాలున్నాయి. అలాగే ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గించడానికి ఇది సహయపడుతుంది. బొప్పాయిలో కేరోటిన్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సీ, కే అధికంగా ఉంటాయి. అయితే ఇది కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా.. చర్మ సమస్యలకు, జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. బొప్పాయిని కొన్ని పద్దతులలో ఉపయోగిస్తే జుట్టు రాలడానికి చెక్ పెట్టవచ్చు. ఎలాగో తెలుసుకుందామా.
కొబ్బరి నూనె.. బొప్పాయి హెయిర్ మాస్క్.. తాజా బొప్పాయి ముక్కలను బ్లెండర్లో వేసి బొప్పాయి గుజ్జు తీసుకోవాలి. ఒక గిన్నెలో 2 చెంచాల బొప్పాయి గుజ్జు తీసుకొని అందులో అదే మొత్తంలో కొబ్బరి నూనె కలపాలి. దీనిని మీ తలపై మసాజ్ చేయండి. బొప్పాయి హెయిర్ మాస్క్‌ను సుమారు గంటసేపు ఉండనివ్వాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. దీన్ని వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేయండి.
పెరుగు.. బొప్పాయి హెయిర్ మాస్క్.. బొప్పాయి గుజ్జు చేయడానికి కొన్ని బొప్పాయి క్యూబ్స్ కలపాలి. ఈ గుజ్జును జల్లెడ సహాయంతో పిండి వేసి కంటైనర్‌లో భద్రపరుచుకోండి. 2 చెంచాల బొప్పాయి రసం తీసుకొని దానికి 2 చెంచాల పెరుగు కలపండి. ఈ బొప్పాయి హెయిర్ మాస్క్ ను జుట్టుకు అప్లై చేసి వేళ్ళతో మెత్తగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత జుట్టును షవర్ క్యాప్ తో కప్పి 30-40 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తరువాత తేలికపాటి షాంపూతో కడగాలి. వారానికి ఒకసారి చేస్తూ ఉండాలి.
ఆలివ్ నూనె.. బొప్పాయి హెయిర్ మాస్క్.. బొప్పాయి కొన్ని పదార్థాలు కలిపి గుజ్జును రెడి చేసుకోవాలి. బొప్పాయి క్యూబ్స్‌ను ఫోర్క్ తో వేరు చేసి బొప్పాయి గుజ్జును తయారు చేసుకోవచ్చు. ఒక గిన్నెలో 2 టీస్పూన్ల బొప్పాయి గుజ్జు తీసుకొని అందులో సమాన పరిమాణంలో ఆలివ్ నూనె కలపాలి. దీనిని మీ తలపై మసాజ్ చేసి 30-40 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తరువాత తేలికపాటి షాంపూతో తల కడగాలి. ఈ బొప్పాయి హెయిర్ మాస్క్‌ను వారానికి ఒకటి లేదా రెండుసార్లు అప్లై చేయవచ్చు.
కలబంద.. బొప్పాయి హెయిర్ మాస్క్.. బొప్పాయి గుజ్జును జల్లెడ సహాయంతో పిండి వేసి కంటైనర్‌లో భద్రపరుచుకోండి. బొప్పాయి రసంలో 2 టీస్పూన్ల కలబంద జెల్ కలిపి బొప్పాయి హెయిర్ మాస్క్ సిద్ధం చేయండి. దీనిని మీ తలపై మసాజ్ చేసి జుట్టును షవర్ క్యాప్ తో కప్పండి. ఒక గంట పాటు అలాగే ఉంచండి. తేలికపాటి షాంపూతో కడిగి, వారానికి ఒకసారి అయినా ఈ విధానాన్ని చేయాలి.
తేనె..కొబ్బరి పాలు.. బొప్పాయి హెయిర్ మాస్క్.. అరకప్పు పండిన బొప్పాయి ముక్కలను తీసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అందులో అరకప్పు కొబ్బరి పాలు, ఒక టీ స్పూన్ సేంద్రీయ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు 30-40 నిమిషాలు పట్టించాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో కడిగేయాలి. ఈ పద్దతిని
Also Read: Health Tips: రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గుతున్నాయా ? వీటిని ట్రై చేస్తే… డాక్టర్ అవసరం రానట్లే..