White Honey Benifits: యాంటీ ఆక్సిడెంట్స్‌లకు కేరాఫ్ అడ్రస్ వైట్ హనీ.. ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!

గోధుమ రంగు తేనె సాధారణంగా ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. అయితే తెల్ల తేనె గురించి మీకు తెలుసా? తెల్ల తేనె.. గోధుమ రంగు తేనె కంటే ఎక్కువ పోషకాలు కలిగినదిగా పేర్కొంటారు. తెల్ల తేనె వలన కలిగే లాభాలు, నష్టాలు తెలుసుకుందాం.

White Honey Benifits: యాంటీ ఆక్సిడెంట్స్‌లకు కేరాఫ్ అడ్రస్ వైట్ హనీ.. ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!
White Honey
Follow us
Venkata Chari

|

Updated on: Jul 30, 2021 | 7:51 AM

మనం తరచుగా గోధుమ రంగు తేనెను తీసుకుంటూనే ఉంటాం. కానీ, మీరు ఎప్పుడైనా తెలుపు రంగు తేనెను రుచి చూశారా? తెలుపు రంగులో ఉండే తేనె గురించి తెలుసుకున్నారా? తెల్ల తేనెను ముడి తేనె అని కూడా అంటారు. ఈ తేనెను తేనెటీగల నుంచి తీసినట్లు చెబుతారు. అయితే దీనిలో తాపన ప్రక్రియను ఉపయోగించరు. తాపన ప్రక్రియలో తేనెలో ఉన్న కొన్ని ప్రయోజనకరమైన అంశాలు తొలిగిపోతాయి. కాబట్టి ఇది గోధుమ తేనె కంటే ఎక్కువ ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. తెల్ల తేనె అల్ఫాల్ఫా, ఫైర్‌వీడ్, వైట్ క్లోవర్ పువ్వుల నుంచి తీస్తారు. రోజూ ఒక టీస్పూన్ వైట్ తేనె తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయని నమ్ముతారు. వైట్ హనీ కలిగించే సాటిలేని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. విటమిన్ ఏ, బీ, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, భాస్వరం, జింక్ వంటి అనేక పోషకాలను కలిగి ఉన్నందున తెల్ల తేనెను యాంటీఆక్సిడెంట్ల పవర్ హౌస్ అంటారు. ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ అని పిలువబడే సమ్మేళనాలు కూడా ఇందులో ఉన్నాయి. వృద్ధాప్యం రాకుండా సహాయపడుతుంది. అలాగే గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుతుంది.

2. దగ్గు సమస్య ఉంటే తెల్ల తేనె చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంది. నిమ్మకాయ, తెల్ల తేనె గోరువెచ్చని నీటిలో వేసి తాగవచ్చు. ఇది దగ్గు నుంచి ఉపశమనాన్ని కలిగించడంలో అద్భుతంగా పనిచేస్తోంది.

3. ముడి తేనె కడుపు పూతలు, అల్సర్ లాంటి సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది.అలాగే జీర్ణవ్యవస్థను సరిచేయడంలోనూ కీలకంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఒక చెంచా తెల్ల తేనె తీసుకుంటే చాలా మంచిది.

4. నోటిలో బొబ్బలు ఉంటే.. ముడి తేనెను తీసుకుని వాటిపై అప్లై చేసుకోవాలి. దీనివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది.

5. ఈ తేనెను ప్రతిరోజూ గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే, శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం వేగంగా పెరుగుతుంది. దీన్ని తినడం ద్వారా మహిళలు రక్తహీనత వంటి సమస్యల నుంచి బయటపడతారు.

6. ముడి తేనెలో ఫైటోన్యూట్రియెంట్స్ ఉంటాయి. కాబట్టి ఇది గాయాలను త్వరగా నయం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతోపాటు అందంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఫంగస్‌ను తొలగించే లక్షణాలు తెల్ల తేనెలో చాలా ఉన్నాయి.

ముడి తేనె వల్ల నష్టాలు కూడా ఉన్నాయి.. ముడి తేనెలో అనేక గుణాలు ఉన్నా.. వైద్య నిపుణుడి సలహా తీసుకున్న తర్వాతే ఎల్లప్పుడూ కొంత పరిమాణంలో తీసుకోవాలి. అప్పుడే ముడి తేనె నుంచి ప్రయోజనాలు పొందగల. శరీరానికి కూడా ఎలాంటి హాని ఉండదు. వాస్తవానికి, దాని సూక్ష్మజీవుల కారణంగా తెల్ల తేనె కొన్నిసార్లు బొటూలిజానికి కారణమవుతుంది. బోటులిజం వల్ల పక్షవాతం వచ్చే ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది.

ఇవే కాకుండా తెల్ల తేనెను అధికంగా తీసుకోవడం వల్ల కొన్నిసార్లు శరీరంలో ఫ్రక్టోజ్ అనే మూలకం పెరుగుతుంది. ఇది పోషకాలను గ్రహించే చిన్నపేగు సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అటువంటి పరిస్థితిలో శరీరం బలహీనపడటం ప్రారంభమవుతుంది. ముడి తేనెను అధికంగా తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ సమస్యకు కారణమవుతుంది. ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తెలుపు లేదా గోధుమ రంగులోని ఎలాంటి తేనెను ఇవ్వకూడదు. అలాగే, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు కూడా ముడి తేనెను తీసుకోకూడదు.

Also Read: Health Tips: రక్తంలో ప్లేట్‏లెట్స్ కౌంట్ తగ్గుతున్నాయా ? వీటిని ట్రై చేస్తే… డాక్టర్ అవసరం రానట్లే..

Green Chili Benefits: పచ్చిమిర్చియే కదా అని పక్కన పెట్టేస్తున్నారా ? ప్రయోజనాలు తెలిస్తే షాకవ్వాల్సిందే..