Ice cream: ఐస్‌క్రీమ్ అంటూ పిల్లలు మారాం చేస్తున్నారా.? ఇంట్లోనే సింపుల్‌గా రడీ చేయండి..
ఇందుకోసం ముందుగా ఒక బౌల్‌లో ఒక కప్ ఫ్రెష్ క్రీమ్‌ను తీసుకోవాలి. సాధారణంగా సూపర్ మార్కెట్లో ఫ్రెష్ క్రీమ్ లభిస్తుంది. అనంతరం బ్లెండర్‌తో బీట్ చేస్తూ మెత్తగా చేసుకోవాలి. మిక్సీలో కూడా చేసుకోవచ్చు. క్రీమ్ గట్టిగా మారిన తర్వాత అందులో వెనెలా ఎసెన్షియల్‌ను యాడ్ చేయాలి, అలాగే 200 గ్రాములు మిల్క్ మెయిడ్‌ను యాడ్ చేసి...
సమ్మర్‌లో ఐస్‌క్రీమ్‌ల అమ్మకాలు భారీగా పెరుగుతాయి. ఇంటి మందు నుంచి ఐస్ క్రీమ్ బండి వెళ్తే చాలు చిన్నారులు మారాం చేస్తుంటారు. అయితే మార్కెట్లో లభించే ఐస్‌క్రీమ్‌లలో ఎంత వరకు నాణ్యత ఉంటుందో లేదో అని చెప్పలేము. ఇటీవల నెట్టింట వైరల్ అవుతోన్న కొన్ని వీడియోలు చూస్తుంటే ఐస్‌క్రీమ్‌లు తినాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. మరి ఇంట్లోనే మంచి క్వాలిటీతో కూడిన ఐస్‌క్రీమ్‌ను తయారు చేసుకుంటే భలే ఉంటుంది కదూ! సింపుల్ స్టెప్స్‌తో ఇంట్లోనే వెనిలా ఐస్‌క్రీమ్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఇందుకోసం ముందుగా ఒక బౌల్‌లో ఒక కప్ ఫ్రెష్ క్రీమ్‌ను తీసుకోవాలి. సాధారణంగా సూపర్ మార్కెట్లో ఫ్రెష్ క్రీమ్ లభిస్తుంది. అనంతరం బ్లెండర్‌తో బీట్ చేస్తూ మెత్తగా చేసుకోవాలి. మిక్సీలో కూడా చేసుకోవచ్చు. క్రీమ్ గట్టిగా మారిన తర్వాత అందులో వెనెలా ఎసెన్షియల్‌ను యాడ్ చేయాలి, అలాగే 200 గ్రాములు మిల్క్ మెయిడ్‌ను యాడ్ చేసి మళ్లీ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి.
తర్వాత బౌల్‌కు టైట్‌గా మూతపెట్టి డీ ఫ్రిజ్‌లో 6 నుంచి 7 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. అంతే ఎంతో రుచికరమైన వెన్నెల ఐస్‌క్రీమ్ రడీ అయినట్లే. అంతే సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఐస్‌క్రీమ్ రుచి మరితం పెరగాలంటే ఐస్‌క్రీమ్‌పై కాస్త డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సరిపోతుంది. రుచి కరమైన ఐస్‌క్రీమ్ రడీ అయినట్లే. ఎలాంటి కెమెకల్స్ లేకుండా నేచురల్ ఐస్‌క్రీమ్ సిద్ధమైనట్లే. ఇక ఐస్ క్రీమ్ తయారీకి అవసరమయ్యే మిల్క్ మెయిడ్, ఫుల్ క్రీమ్, వెనిలా ఎసెన్షియల్ వంటి వస్తువులన్నీ సూపర్ మార్కెట్ లలో లభిస్తున్నాయి.
మరిన్ని ఫుఢ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి…