AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Side Effects Of Dates: ఖర్జూరాలతో సూపర్ బెనిఫిట్స్.. శీతాకాలంలో ఎందుకు తినాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

Health Benefits Of Dates: శీతాకాలం వచ్చిందంటే చాలు.. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరుకుంటాయి. ప్రజలు చలి తీవ్రతను ఎదుర్కోవాల్సి వస్తుంది...

Side Effects Of Dates: ఖర్జూరాలతో సూపర్ బెనిఫిట్స్.. శీతాకాలంలో ఎందుకు తినాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
Dates
Ravi Kiran
|

Updated on: Dec 24, 2021 | 9:51 AM

Share

శీతాకాలం వచ్చిందంటే చాలు.. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరుకుంటాయి. ప్రజలు చలి తీవ్రతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కాలంలో దగ్గు, జలబు, జ్వరం వంటి రోగాల బారిన పడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రజలు చలి నుంచి తమను తాము కాపాడుకునేందుకు దట్టమైన దుస్తులను ధరించడమే కాకుండా.. ఆహారపు అలవాట్ల విషయంలోనూ శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. వింటర్ సీజన్‌లో ప్రత్యేకమైన డైట్ తీసుకోవాలని, అందులో ఖర్జూరాన్ని చేర్చాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి చలికాలంలో ఖర్జూరం తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఖర్జూరం తినడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో ఈ 5 జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఖర్జూరాలను తినాలి. అదేంటో తెలుసుకుందాం..

గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది:

శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల మన శరీరానికి కావాల్సినంత వేడి అందదు. తద్వారా ఖర్జూరం తినడం వల్ల మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిణామం తగ్గి గుండెపోటు, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్రమం తప్పకుండ ఖర్జూరం తిన్నట్లయితే.. మీలో స్టామినా పెరిగడమే కాకుండా ఎలప్పుడూ చురుకుగా ఉంటారు.

వెచ్చగా ఉంచుతుంది:

చలికాలంలో మీరు ఖర్జూరాలు తింటే.. మీకు మీరు వెచ్చగా ఉండొచ్చు. విశేషమేమిటంటే ఖర్జూరాలను డ్రింక్ రూపంలో కూడా ఉపయోగించవచ్చు. అందుకే చలికాలంలో ఎక్కువగా ఖర్జూరం తినాలని వైద్యులు సూచిస్తారు.

ఎనర్జీ బూస్టర్:

శీతాకాలంలో మీరు ఎల్లప్పుడూ చురుకుగా ఉండేందుకు ఖర్జూరాలు సహాయపడతాయి. దీన్ని చాలా మంది ప్రీ-వర్కౌట్ స్నాక్‌గా కూడా ఉపయోగిస్తారు.

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది:

చలికాలంలో మెటబాలిజం తక్కువగా ఉంటుంది. కాబట్టి పీచు పదార్ధాలు పుష్కలంగా లభించే ఆహారాలను ఎక్కువగా తినాలి. ఖర్జూరాలు అయితే అందుకు బెస్ట్.. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. అంతే కాకుండా ఖర్జూరాలు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

కాగా, ఏదైనా కూడా అతిగా తినకూడదని డాక్టర్లు చెబుతారు. ఖర్జూరాలు కూడా అంతే. చలికాలంలోనే కాదు.. ఏ సీజన్‌లోనైనా వీటిని మోతాదుకు మించి తింటే.. కడుపు నొప్పి, ఉబ్బరం, అతిసారం, చర్మ దద్దుర్లు వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి.