Mango Benefits: పండ్లలో రారాజు ‘మామిడి’ తింటే ఆ సమస్యలన్నీ మటుమాయం.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు..
Mango Health Benefits: వేసవికాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో అందరి చూపు ముఖ్యంగా అన్ని పండ్లల్లో రారాజు అయిన మామిడి పండు వైపే ఉంటుంది. వీటిని పిల్లలే కాదు.. పెద్దలు కూడా
Mango Health Benefits: వేసవికాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో అందరి చూపు ముఖ్యంగా అన్ని పండ్లల్లో రారాజు అయిన మామిడి పండు వైపే ఉంటుంది. వీటిని పిల్లలే కాదు.. పెద్దలు కూడా ఎంతో ఆస్వాదిస్తూ తింటారు. వేసవి కాలంలో ఎక్కువగా లభించే ఈ పండు కోసం చాలా మంది ఎదురుచూస్తుంటారు. మామిడి పండు రుచితో పాటు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మామిడిపండు తినడం వల్ల శరీరంలోని అనేక సమస్యలు తొలగిపోతాయి. అందుకే వేసవిలో ప్రతి ఒక్కరు మామిడిని తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వేసవి (Summer) లో లభించే మామిడి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..
బరువును తగ్గిస్తుంది: మామిడి స్థూలకాయాన్ని తగ్గించడానికి మంచి ఔషధం. మామిడి గింజల్లో ఉండే ఫైబర్‌లు శరీరంలోని అధిక కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. మామిడి తిన్న తర్వాత ఆకలి తగ్గుతుంది. ఇది అతిగా తినకుండా చేస్తుంది.
జ్ఞాపకశక్తిని పెంచుతుంది: మతిమరుపు ఉన్నవారు మామిడిని తినాలి. ఇందులో ఉండే గ్లుటామైన్ యాసిడ్ అనే మూలకం జ్ఞాపకశక్తిని పెంచడంలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. దీనితో పాటు రక్త కణాలను కూడా పెంచుతుంది. కావున గర్భిణీ స్త్రీలు మామిడి పండ్లను తినడం మంచిది.
రోగనిరోధక శక్తి: మీ రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే మామిడిని తీసుకోవడం మంచిది. దీంతోపాటు పలు అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుంది.
చర్మ సమస్యలు: మామిడి పండు గుజ్జు ప్యాక్‌ను అప్లై చేయడం లేదా దీంతో ముఖంపై మసాజ్ చేయడం వల్ల మొహం కాంతివంతంగా మెరుస్తుంది. దీంతోపాటు మామిడిలోని విటమిన్ సి ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది.
జీర్ణక్రియ: మామిడిలో చాలా ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి పని చేస్తాయి. దీని కారణంగా ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. దీనితోపాటు ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్ శరీరంలోని ఆల్కలీన్ ఎలిమెంట్స్‌ను బ్యాలెన్స్‌గా ఉంచుతుంది.
క్యాన్సర్‌ను నివారిస్తుంది: మామిడిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు పెద్దప్రేగు క్యాన్సర్, లుకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారించడంలో మేలు చేస్తాయి.
Also Read: