AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gongura Chicken Curry Recipe : ఆంధ్రా స్టైల్‌లో టేస్టీ టేస్టీ గోంగూర చికెన్ కూర తయారీ విధానం..

Gongura Chicken Curry: లోకంలో ఉన్న అందరికి ఒకే ఇష్టాలు ఉండవు. ఉద్యోగం, వ్యాపారం, జీవించే విధానం, కట్టు బొట్టు వంటివే కాదు..తినే ఆహారం లో కూడా ఒకొక్కరికి ఒకొక్క ఇష్టం..

Gongura Chicken Curry Recipe : ఆంధ్రా స్టైల్‌లో టేస్టీ టేస్టీ గోంగూర చికెన్ కూర తయారీ విధానం..
Gongura Chicken
TV9 Telugu Digital Desk
| Edited By: Surya Kala|

Updated on: Jul 18, 2021 | 4:40 PM

Share

Gongura Chicken Curry: లోకంలో ఉన్న అందరికి ఒకే ఇష్టాలు ఉండవు. ఉద్యోగం, వ్యాపారం, జీవించే విధానం, కట్టు బొట్టు వంటివే కాదు..తినే ఆహారం లో కూడా ఒకొక్కరికి ఒకొక్క ఇష్టం ఉంటుంది. కొందరు మసాలా ఫుడ్ ని, మాంసాహారాన్ని ఇష్టపడితే.. మరికొందరు శాకాహారాన్ని ఇష్టపడతారు. కానీ తినే ఆహారం ఏదైనా దానిని కూడా రోజు ఒకే రకంగా తినడం అంటే.. ఎవరైనా కష్టం అంటారు. ఇక ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ప్రియుల దృష్టి చికెన్ వైపు వెళ్తుంది. అయితే ఆ చికెన్ ను కూడా ఒకే విధంగా వండితే.. వద్దు రెస్టారెంట్ కు వెళ్లి.. తిందాం అంటారు. ఈరోజు చికెన్ ను ఆంధ్రా మాత గోంగూరతో కలిసి టేస్టీ టేస్టీ కూర తయారీ గురించి తెలుసుకుందాం

గోంగూర చికెన్ తయారీకి కావలసిన పదార్ధాలు:

చికెన్ – అరకిలో ఉల్లిపాయలు – 2 గోంగూర – రెండు కట్టలు పచ్చి మిరపకాయలు -3 అల్లం వెల్లుల్లి పేస్ట్ -2 స్పూన్లు దాల్చిన చెక్క కొంచెం ముక్క ధనియాలు ఒక టీ స్పూను జీల కర్ర ఒక టీ స్పూన్ గసగసాలు ఒక టీ స్పూన్ లవంగాలు – 4 యాలుకలు – 2 పసుపు – కొంచెం కారం సరిపడా నూనె – సరిపడా ఉప్పు రుచికి తగినంత కరివేపాకు పుదినా

తయారీ విధానం :

ముందుగా చికెన్ ను గోంగూర ఆకులను శుభ్రం చేసుకోవాలి. తర్వాత గోంగూర ఆకులను ఉడికించుకుని చల్లారివ్వాలి. ఇంతలో మిక్సీలో దాల్చిన చెక్క ,ధనియాలు, జీల కర్ర , గసగసాలు , లవంగాలు , యాలుకలను మిక్సీలో వేసుకుని పొడి చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత చల్లారిన గోంగూర ఆకులను మిక్సీలో వేసుకుని పేస్టు చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలను కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

స్టౌ వెలిగించుకుని ఒక దళసరి గిన్నె పెట్టుకుని నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత ఉల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్.. పసుపు వేసి కమ్మటి వాసన వచ్చే వరకూ వేయించాలి. తర్వాత చికెన్ వేసి.. కారం వేసుకుని 3 నిముషాలు ఉల్లిపేస్ట్ తో పాటు వేయించాలి.

తర్వాత రెడీ చేసుకున్న మసాల పొడిని.. గోంగూర పేస్ట్ ను వేసి.. చికెన్ తో పాటు మగ్గించాలి. అలా కొంచెం సేపు మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పుదీనా , కర్వేపాకు వేసి ఈ మిశ్రమాన్ని కలిపి.. తర్వాత కూరకు సరిపడా నీరు పోయాలి. గ్రేవీ దగ్గరకు వచ్చే వరకూ ఉడికించాలి. చికెన్ ముక్కలు ఉడికిన తర్వాత నూనె కొంచెం కూరలో తేలుతుంది.. అప్పుడు స్టౌ మీద నుంచి కూరను దింపేయాలి.. అంతే పుల్లపుల్లగా నోటికి రుచిగా ఉండే గోంగూర చికెన్ రెడీ.. ఈ కూర అన్నంలోకి చపాతీల్లో కి చాలా బాగుటుంది.

Also Read: NTR-Koratala: వరస సినిమాలతో ఎన్టీఆర్ బిజిబిజీ.. కొరటాలతో పాన్ ఇండియా మూవీ.. భారీ బడ్జెట్