AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చింతపండు పులుపు బాగా తింటున్నారా..! అయితే కష్టమే.. ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి..

Tamarind Side Effects : చింతపండు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది ఎందుకంటే ఇది తియ్యగా, పుల్లగా ఉంటుంది. చింత చెట్టు దాదాపు ప్రతి భాగం వేర్లు, బెరడు, ఆకులు, పండ్లు, పువ్వులతో

చింతపండు పులుపు బాగా తింటున్నారా..! అయితే కష్టమే.. ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి..
Tamarind Side Effects
uppula Raju
|

Updated on: Apr 10, 2021 | 5:24 AM

Share

Tamarind Side Effects : చింతపండు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది ఎందుకంటే ఇది తియ్యగా, పుల్లగా ఉంటుంది. చింత చెట్టు దాదాపు ప్రతి భాగం వేర్లు, బెరడు, ఆకులు, పండ్లు, పువ్వులతో సహా అన్ని ఆరోగ్య, ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది. వంటకాల్లో చింతపండును చేర్చడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది ఖనిజాలు, ఫైటోకెమికల్స్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ల మంచి మూలం ఇవి శరీరం సరైన పనితీరుకు అవసరం. చింతపండు మధుమేహం, ఊబకాయం వంటి సమస్యల చికిత్సకు సహాయపడుతుంది. అయితే ఇది మోతాదు దాటితే చాలా అనర్థాలకు కూడా కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. చింతపండు హైపోగ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. మధుమేహం కోసం మందులను వాడేవారు చింతపండును తినడాన్ని నివారించాలి. 2. ఒక కేసు స్టడీలో, మధుమేహంతో బాధపడుతున్న 47 ఏళ్ల వ్యక్తి మందుమేహ మందుల పై ఉన్నప్పటికీ అతని చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులకు గురవుతాయని తెలిసింది. 3. చింతపండును అధిక మొత్తంలో తరచుగా తీసుకోవడం వల్ల పిత్తాశయ రాళ్లు సంభవించవచ్చు. 4. చింతపండు రక్తపోటును తగ్గిస్తుందని అంటారు. రక్తపోటు కోసం మందులు వాడుతున్నట్లైతే, చింతపండును నివారించడం మంచిది. 5.చింతపండు అధికంగా తినే వారికి తలవెంట్రుకలు నెరసిపోతాయి. వయస్సు అధికముగా కనిపిస్తుంది, శరీరము లావై బుద్ధి కూడా మందగిస్తుంది. కాబట్టి చింతపండు వాడకాన్ని తగు రీతిలో వుండేట్లు చూసుకోవాలి.

మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారా..! అయితే తప్పకుండా ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే మీ జేబు ఖాళీ అవుతుంది..

తొలిపోరులో బోణీ కొట్టిన కోహ్లీసేన.. చివరి బంతి వరకు ఉత్కంఠ.. ముంబై ఇండియన్స్‌పై బెంగుళూర్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ గెలుపు..

నిరుద్యోగులు అలర్ట్..! యూనివర్సిటీ పోస్టులకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల వర్తింపు.. టీఎస్‌పీఎస్‌సీ తాజా నిర్ణయం..

Best Online Business Ideas: ఇంట్లో కూర్చొని కేవలం రూ. 5 వేల పెట్టుబడితో లక్షలు సంపాదించండి..