Weight Loss: రాత్రి 8 గంటల తర్వాత తింటే బరువు పెరుగుతారా ? అధ్యాయనాల్లో షాకింగ్ నిజాలు..
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవన విధానంలో చాలా మంది తీసుకునే ఆహారం మీద అస్సలు శ్రద్ధ చూపడం లేదు. అంతేకాదు..
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవన విధానంలో చాలా మంది తీసుకునే ఆహారం మీద అస్సలు శ్రద్ధ చూపడం లేదు. అంతేకాదు.. సమయానికి సరిగ్గా తిండి తినక.. అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతుండగా.. చివరికి అధికంగా బరువు పెరుగుతున్నారు. ఉదయం లేచిన గంటలోపు బ్రేక్ ఫాస్ట్ చేయాలని చాలా మంది చెబుతుంటారు. అలాగే.. సాయంత్రం తేలికపాటి ఆహారం తీసుకోవడం వలన బరువు పెరగడం మీద ఆధారపడి ఉంటుంది. అయితే అర్ధరాత్రిళ్లు తినడం వలన బరువు పెరుగుతుంటారని అంటుంటారు. అయితే రాత్రి లేట్ గా తింటే బరువు పెరుగుతారా ? లేదా ? అనే విషయం తెలుసుకుందాం.
బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం భోజనం చేసే సమయం, బరువు పెరగడం మధ్య ఎటువంటి సంబంధం లేదని వెల్లడైంది. లండన్ కింగ్స్ కాలేజీకి చెందిన పరిశోధకుల బృందం నిర్వహించిన అధ్యయనం 2008, 2012 మధ్య సేకరించిన UK యొక్క నేషనల్ డైట్ అండ్ న్యూట్రిషన్ సర్వే రోలింగ్ ప్రోగ్రాం నుండి డేటాను ఉపయోగించి 1500 మందికి పైగా పిల్లల ఆహారపు అలవాట్లను పరిశీలించింది. సాయంత్రం భోజనం మధ్య సంబంధాన్ని కనుగొనడానికి వారు డేటాను విశ్లేషించారు. సమయం, అధిక బరువు లేదా ఉబకాయం వంటి సమస్యలను తెలుసుకునేందుకు వారు ఈ అధ్యయనం చేశారు. అయితే అర్థరాత్రి తినడం వలన బరువు పెరడానికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడైంది.
రాత్రిళ్లు లేట్ గా తినడం వలన బరువు పెరగరు… కానీ ఆ సమయంలో తీసుకునే ఆహార పదార్థాల వలన బరువు పెరిగే అవకాశం ఉంటుంది. రాత్రిళ్లు.. ఎక్కువగా కార్బోనేటేడ్ డ్రింక్స్, ఉప్పుగా ఉండే స్నాక్స్, స్వీట్స్ వంటి పదార్థాలలో చాలా కేలరీలు ఉంటాయి. ఇవి రాత్రి సమయంలో తినడం వలన సులభంగా బరువు పెరుగుతుంటారు. అలాగే ఒత్తిడి, విసుగు, ఆందోళన నుంచి బయటపడటానికి కొంతమంది ఎక్కువగా భోజనం చేస్తుంటారు. ఇలాంటి సమయంలో వారు అధికంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా.. రాత్రిళ్లు లేట్ గా.. కేలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వలన కేవలం బరువు పెరగడం మాత్రమే కాదు.. ఇతర సమస్యల బారిన పడాల్సి వస్తుంది. కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే.. అజీర్ణ సమస్య వస్తుంది. దీంతో రాత్రి నిద్రకు భంగం కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు రాత్రిళ్లు ఆహారం తినకపోయిన పర్వాలేదు. మీ సిర్కాడియన్ లయ ప్రకారం ఆహారం తీసుకునే సమయాన్ని సెట్ చేసుకోవాలి. అలాగే పడుకోవడానికి రెండు గంటల ముందు భోజనం చేయడం మంచిది. కేలరీలు తక్కువగా ఉండే పోషకహారాన్ని తీసుకోవడం మంచిది.