AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఈ వంటకాలను ఐరన్ పాత్రలలో.. కడాయిలలో అసలు వండకూడదట.. ఎందుకంటే…

మన భారతీయ వంటశాలలో నల్లగా ఉండే ఇనుప కడాయిలలో వంటలు చేస్తుంటారు. అలాగే ఇనుప చిప్పలలో వంటలు చేయడమనేది...

Health Tips: ఈ వంటకాలను ఐరన్ పాత్రలలో.. కడాయిలలో అసలు వండకూడదట.. ఎందుకంటే...
Health Tips
Rajitha Chanti
|

Updated on: Jun 05, 2021 | 9:44 PM

Share

మన భారతీయ వంటశాలలో నల్లగా ఉండే ఇనుప కడాయిలలో వంటలు చేస్తుంటారు. అలాగే ఇనుప చిప్పలలో వంటలు చేయడమనేది… పూర్వపు రోజుల నుంచి వాడుకలో ఉన్నదే. ఈ ఇనుప కడాయిలలో వంటలు చేయడం వలన వాటి రుచి మరింత పెరుగుతుంది. టెప్లాన్, ఇతర పూత పూసిన పాత్రలతో పోల్చితే.. ఇనుముతో చేసిన పాత్రలు.. కడాయిలు వంట చేయడానికి మంచివి. కానీ ఇనుప కడాయిలలో, పాన్ లలో ఎప్పుడూ ఉడికించకూడని కొన్ని ఆహారాలు కూడా ఉన్నాయి. అవెంటో తెలుసుకుందామా.

నిమ్మకాయ, టమోటాలు, వెనిగర్ వంటి ఆమ్ల స్వభావం గల టార్టీ ఆహారాలను వండకుండా ఉండాలి. ఇందులో రసం, కడి, నిమ్మకాయ, పెరుగు వంటి చిక్కని పచ్చడి లేదా టమోటా ఆధారిత కూరలను ఇనుప కడాయిలో ఎప్పుడూ ఉడికించకూడదు. అయిన కానీ మీరు అందులోనే వంట చేయాలనుకుంటే.. మంచి కాస్ట్లీ ఐరన్ పాన్‌ను ఉపయోగించాలి. ఐరన్ పాన్‌లో ఆమ్ల ఆహారాలను వంట చేయడం తగ్గించుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కృతులు గుడ్డు, బియ్యం, పాస్తా రుచికరమైన పదార్ధాలను కాస్ట్ ఇనుప పాన్‌లో వండుతున్నారని.. ఈ ఆహారాలు వాటి ప్రాథమిక ఆకృతి కారణంగా పాన్‌కు అంటుకుంటాయని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి పాన్లలో వంట చేయకుండా ఉండటం మంచిది. చేపలు, కొన్ని సీఫుడ్లు ప్రకృతిలో పొరలుగా ఉండేవాటిని వంట చేసేటప్పుడు పాన్ కు అంటుకోవచ్చు. నూనె, వెన్నను ఉపయోగించినప్పటికీ కొన్ని చేపలు అంటుకుని రుచి మారుతుంది. చాలా మంది భారతీయులకు స్వీట్లు కడాయిలో తయారుచేసే అలవాటు ఉంటుంది. ఇనుప కడాయిలలో స్వీట్లు చేయడం వలన రుచికరమైన వాసన కడిగిన తర్వాత కూడా అలాగే వస్తాయి. ఇది మీ ఇతర వంటల రుచి, వాసనను మారుస్తుంది.

కఠినమైన స్క్రబ్బర్లు లేదా చాలా తేలికపాటి స్పాంజ్లు ఉపయోగించి కడాయిలను ఎప్పుడూ స్క్రబ్ చేయవద్దు. తేలికపాటి లిక్విడ్ వాష్‌తో మీ పాన్‌ను చక్కగా శుభ్రపరిచేలా చూసుకోండి. ఇనుముతో చేసిన కడాయిలు తుప్పు పట్టకుండా ఉండాలంటే.. కడిగిన తరువాత వాటిని తుడిచి చిన్న పొర నూనె వేసి శుభ్రమైన పొడి ప్రదేశంలో ఉంచండి. మీ వండిన ఆహారాన్ని ఐరన్ పాత్రలలో ఎక్కువ గంటలు నిల్వ ఉంచవద్దు. ఎందుకంటే ఇది లోహ రుచి లేదా వాసనను వదిలివేస్తుంది. పాన్ తుప్పు పట్టకుండా ఉండటానికి, వాసనను తొలగించడానికి ఎప్పుడూ వంటను వేరే పాత్రలోకి మార్చి.. కొద్దిగా వేడి పాన్ ను వెంటనే శుభ్రం చేయండి.

Also Read: బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక.. HDFC, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులలో జూన్ 30 తర్వాత ఆ సేవలు బంద్ …