Diwali Special Recipe: కప్పు టీతో ఆస్వాదించడానికి రుచికరమైన బ్రెడ్ ఆలూ పకోడా రెసిపీ మీకోసం..

Diwali Special Recipe Aloo Bread Pakoda: పండగ, ఫంక్షన్ ఇలా ఏ సందర్భంలోనైనా కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ ఒక చోట కలుస్తారు. సరదాగా పండగలను..

Diwali Special Recipe: కప్పు టీతో ఆస్వాదించడానికి రుచికరమైన బ్రెడ్ ఆలూ పకోడా రెసిపీ మీకోసం..
Aloo Bread Pakoda
Follow us
Surya Kala

|

Updated on: Nov 01, 2021 | 6:17 PM

Diwali Special Recipe Aloo Bread Pakoda: పండగ, ఫంక్షన్ ఇలా ఏ సందర్భంలోనైనా కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ ఒక చోట కలుస్తారు. సరదాగా పండగలను శుభకార్యాలను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే దీపావళి పండగ సందడి మొదలైంది.  దీపావళి అంటేనే సీట్స్ స్పెషల్.. అయితే ఫ్యామిలీ అందరూ కలిసిన సందర్భంలో సరదాగా గడుపుతుంటే చిరు తిండిపై మనసు పోతుంది. ఈరోజు రెగ్యులర్ స్నాక్స్ కి భిన్నంగా దీపావళి స్పెషల్ గా కప్పు టీ లేదా కాఫీతో ఆస్వాదించడానికి రుచికరమైన బ్రెడ్ ఆలూ పకోడా తయారీ గురించి తెలుసుకుందాం..

కావల్సిన పదార్ధాలు:

బంగాళదుంపలు- 3 బ్రెడ్ -ఒక పేకెట్ బేకింగ్ సోడా – చిటికెడు నీరు- సరిపడినంత ఉప్పు రుచికి సరిపడా శనగపిండి- ఒక కప్పు కారం- ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి- పావు స్పూన్ ధనియాల పొడి- అర టేబుల్ స్పూన్ జీలకర్ర- కొంచెం నూనె వేయించడానికి సరిపడా..

తయారీ విధానం: ఈ స్నాక్ ఐటెం తయారీకి ముందుగా మూడు బంగాళదుంపలను వాటిని ఉడికించి.. అనంతరం తొక్కతీసుకుని ఒక గిన్నెలో వేసుకుని స్మాష్ చేసుకోవాలి. అనంతరం స్టౌ మీద బాణలి పెట్టి.. నూనె వేసుకుని జీలకర్ర వేసి చిటపటలాడించాలి. అనంతరం మెత్తని బంగాళాదుంపలతో పాటు కారం, మిరియాలు, ధనియాల పొడి , ఉప్పు  వేసుకుని కొంచెం సేపు మగ్గించాలి. మంచి వాసన వచ్చిన తర్వాత ఈ బంగాళదుంప మిశ్రమాన్ని స్టౌ మీద నుంచి దింపుకోవాలి. తరువాత ఒక గిన్నె తీసుకుని శనగపిండి, నీరు, చిటికెడు బేకింగ్ సోడా,  కొంచెం ఉప్పు  వేసుకుని బజ్జి పిండిలా కలుపుకోవాలి.  స్టౌ మీద పాన్ పెట్టి వేయించడానికి సరిపడా నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఒక  బ్రెడ్ ముక్కని తీసుకుని.. ట్రై యాంగిల్ గా కట్ వాటి మధ్యలో ఆలూ మసాలా పెట్టి.. దానిని శనగ పిండిలో బజ్జిలా ముంచుకొవాలి. ఇప్పుడు ఆ బ్రెడ్ ను  వేడి నూనె లో వేసుకుని బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. అంతే రుచికరమైన బ్రెడ్ ఆలూ పకోడా రెడీ.. మీ దీపావళిని తియ్య తియ్యని స్వీట్స్ తో పాటు. ఈ స్నాక్స్ ని కూడా జత చేసుకుని ఎంజాయ్ చేయండి..

Also Read:  నెటిజన్లు తలచుకుంటే ఏమైనా చేయగలరు.. అడవిలోని మోగ్లీకి.. మళ్ళీ లైఫ్.. స్కూల్‌కు వెళ్తున్న ఫోటోలు వైరల్..