AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horse Milk : ఆ దేశంలో గుర్రం పాలకు యమ డిమాండ్.. ఏ వ్యాధికి వాడుతున్నారో తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు…

Horse Milk : గుర్రం చాలా ప్రాచీన జంతువు.. మానవ క్రమం మొదలైనప్పటి నుంచి అది మనుషుల మధ్యే ఉంటుందని అందరికి తెలుసు. అయితే

Horse Milk : ఆ దేశంలో గుర్రం పాలకు యమ డిమాండ్.. ఏ వ్యాధికి వాడుతున్నారో తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు...
Horse Milk
uppula Raju
|

Updated on: Mar 21, 2021 | 12:54 PM

Share

Horse Milk : గుర్రం చాలా ప్రాచీన జంతువు.. మానవ క్రమం మొదలైనప్పటి నుంచి అది మనుషుల మధ్యే ఉంటుందని అందరికి తెలుసు. అయితే ఈ మధ్య గుర్రం పాల గురించి చాలా వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా గుర్రాలను ఎందుకోసం ఉపయోగిస్తారో అందరికి తెలుసు కానీ దాని పాల గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసనేది వాస్తవం. అయితే బ్రిటన్‌లో గుర్రం పాలకు యమ డిమాండ్ ఉందని తెలుస్తోంది. ఆ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా ఆవు పాలు ఎంతో శ్రేష్టమని చెబుతుంటారు. అయితే బ్రిటన్‌లో దీనికి భిన్నంగా గుర్రం పాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇక్కడి ప్రజలంతా గుర్రం పాలు తాగేందుకు ఇష్టపడుతున్నారని తెలుస్తోంది. ఈ పాలలో అన్ని రకాల విటమిన్లు ఉన్నాయని, పలు వ్యాధులు రాకుండా ఈ పాలు కాపాడతాయని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. యూకేలో ఫ్రాంక్ షోలాయ్ అనే వ్యక్తి గుర్రం పాల వల్ల కలిగే లాభాల గురించి వివరిస్తున్నాడు. తాము విక్రయిస్తున్న ఈ పాలలో విటమిన్లు పుష్కలంగా ఉన్నాయని, టీ, కాఫీ, స్వీట్లలో కూడా ఈ పాలను వినియోగించవచ్చని, ఈ పాలు ఎంతో ఆరోగ్యకరమని చెబుతున్నాడు. గుర్రం పాలు మంచివి కావనే భావనను తొలగించేందుకు ఫ్రాంక్ షోలాయ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు.

అందరికి తెలిసిన విషయం ఏంటంటే.. ఆవు పాలు చాలా మంచివని ఆరోగ్యానికి బలమైనవని పెద్దలు అంటుంటారు కానీ ఆవుపాల వలే గుర్రం పాలు కూడా చాలా మంచివని కానీ ఈ విషయం అందరికి తెలియదని అతడు చెబుతున్నాడు. కాకపోతే ఆవుపాలకు లభించిన మార్కెట్ గుర్రం పాలకు లేదని వివరిస్తున్నాడు. అయితే.. ఫ్రాంక్ కుటుంబం రెండు దశాబ్ధాలుగా గుర్రం పాలను విక్రయిస్తోంది. యూకేలో ఫ్రాంక్ విక్రయిస్తున్న గుర్రం పాలకు మంచి డిమాండ్ ఉంది. అంతేకాకుండా గుర్రాలలో పాల దిగుబడి పెరిగేందుకు కూడా పలు పరిశోధనలు చేస్తున్నాడు. ఫ్రాంక్ 250 మిల్లీలీటర్లు గుర్రం పాలను 6.50 పౌండ్లు(656 రూపాయలు)కు విక్రయిస్తున్నాడు. కాగా గుర్రం పాలు ఎగ్జమా అనే వ్యాధిని తరిమికొడతాయని, ఇమ్యూన్ సిస్టమ్‌ను బలోపేతం చేస్తాయని గతంలోనే పలు పరిశోధనల్లో వెల్లడైన సంగతి తెలిసిందే.

Orvakal airport: కర్నూలు జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్.. 28వ తేదీ నుంచి ఓర్వకల్ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు

Lunar Eclipse 2021 : భారత దేశంలో ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడనుందో తెలుసా..!

Tamil Nadu Elections: రసవత్తరంగా మారిన తమిళ రాజకీయాలు.. జయలలిత మృతిపై సంచలన కామెంట్స్ చేసిన స్టాలిన్..