AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లవంగం టీతో దగ్గు, జలుబు, గొంతునొప్పి మాయం.. కానీ ఎప్పుడు తాగాలో తెలుసా..?

Clove Tea: లవంగం ఒక మసాలా దినుసు. ఇది ప్రతి ఇంట్లో వంటగదిలో ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని కూరలు, బిర్యానీలు తయారు చేయడానికి విరివిగా ఉపయోగిస్తారు.

లవంగం టీతో దగ్గు, జలుబు, గొంతునొప్పి మాయం.. కానీ ఎప్పుడు తాగాలో తెలుసా..?
Clove Tea
uppula Raju
|

Updated on: Jan 29, 2022 | 2:08 PM

Share

Clove Tea: లవంగం ఒక మసాలా దినుసు. ఇది ప్రతి ఇంట్లో వంటగదిలో ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని కూరలు, బిర్యానీలు తయారు చేయడానికి విరివిగా ఉపయోగిస్తారు. లవంగాలలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మీరు చలికాలంలో లవంగం టీని క్రమం తప్పకుండా తాగడం అలవాటు చేసుకుంటే జలుబు, దగ్గుతో సహా అన్ని సమస్యల నుంచి రక్షించుకోవచ్చు. లవంగం టీ చేయడానికి మీరు పాలను ఉపయోగించాల్సిన అవసరం కూడా లేదు. లవంగం టీ ప్రయోజనాలు దానిని ఎలా తయారు చేయడం తెలుసుకుందాం.

లవంగం టీ ప్రయోజనాలు

1. లవంగాల రుచి ఘాటుగా ఉంటుంది. దీని కారణంగా ఇది శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. గొంతు నొప్పి, మంట, దగ్గు, జలుబు మొదలైన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

2. లవంగాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి . బరువు తగ్గాలనుకుంటే లవంగం టీ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

3. లవంగం మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది మీ శరీరం జీవక్రియను మెరుగుపరుస్తుంది . దీని వల్ల శరీరంలో శక్తి సంక్రమిస్తుంది మీరు చురుకుదనంతో ఉంటారు.

4. మీ దంతాలలో నొప్పి ఉంటే, చిగుళ్ళలో వాపు ఉంటే, మీరు లవంగం టీ తాగాలి. ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నోటిలోని బ్యాక్టీరియాను కూడా చంపేస్తుంది.

5. లవంగం టీ మీ శరీరాన్ని కాపాడుతుంది. అన్ని చర్మ సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

లవంగం టీ ఎలా తయారు చేయాలి..?

లవంగం టీ చేయడానికి ఒకటిన్నర కప్పు నీటిలో రెండు లవంగాలను బాగా దంచి వేయాలి. గ్యాస్‌పై కొద్దిసేపు మరిగించాలి. తర్వాత టీని ఫిల్టర్ చేసి అందులో ఒక చెంచా తేనె కలపాలి. ఆ తర్వాత తాగాలి. ఈ టీ తాగడానికి ఉత్తమ సమయం ఉదయం. కానీ లవంగం దాని వేడి ప్రభావం వల్ల కూడా హాని కలిగిస్తుంది కాబట్టి దీన్ని ఎక్కువగా తాగవద్దు. దీన్ని ప్రారంభించే ముందు ఆయుర్వేద నిపుణులను సంప్రదించడం మంచిది. మీ ఆరోగ్యం ప్రకారం ఎప్పుడు తాగాలో అతడు స్పష్టం చేస్తాడు.

IND VS WI: వెస్టిండీస్ జట్టులో గొడవలు.. కెప్టెన్ కీరన్ పొలార్డ్ మరో ఆటగాడికి వాగ్వాదం..

శని దేవుడు నలుపు రంగులో ఉంటాడు.. నల్లటి వస్తువులనే ఇష్టపడుతాడు.. దీని వెనుక పరమార్థం ఏంటో తెలుసా..?

Apple Peels: యాపిల్ తొక్కలను విసిరేయకండి.. ఇలా ఉపయోగించుకోండి..