Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND VS WI: వెస్టిండీస్ జట్టులో గొడవలు.. కెప్టెన్ కీరన్ పొలార్డ్ మరో ఆటగాడికి వాగ్వాదం..

IND VS WI: ఫిబ్రవరి 6 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ప్రత్యర్థి జట్టు శిబిరంలో గొడవలు జరుగుతున్నాయి.

IND VS WI: వెస్టిండీస్ జట్టులో గొడవలు.. కెప్టెన్ కీరన్ పొలార్డ్ మరో ఆటగాడికి వాగ్వాదం..
Kieron Pollard
Follow us
uppula Raju

|

Updated on: Jan 29, 2022 | 9:45 AM

IND VS WI: ఫిబ్రవరి 6 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ప్రత్యర్థి జట్టు శిబిరంలో గొడవలు జరుగుతున్నాయి. కెప్టెన్ కీరన్ పొలార్డ్, ఆల్ రౌండర్ ఓడిన్ స్మిత్ మధ్య మనస్పర్ధలు వచ్చాయని మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ఒడియన్ స్మిత్‌ను కీరన్ పొలార్డ్ ఉద్దేశపూర్వకంగా ఉపయోగించుకోలేదని ఇద్దరు ఆటగాళ్ల మధ్య విభేదాలు వచ్చాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ విషయాలను వెస్టిండీస్ బోర్డు, కోచ్ తీవ్రంగా ఖండించారు. జట్టులో అంతా బాగానే ఉందని తెలిపారు.

వెస్టిండీస్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌తో T20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఓడిన్ స్మిత్ మొదటి మ్యాచ్‌లో కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత రెండో టీ20లో అతనికి ఓవర్ ఇవ్వలేదు. మూడో టీ20లో రోవ్‌మన్ పావెల్ స్థానంలో ఓడిన్ స్మిత్‌ని తీసుకున్నారు. దీంతో ఓడిన్‌ స్మిత్‌ ఈ విషయమై కెప్టెన్‌ కీలన్ పొలార్డ్‌తో గొడవ పెట్టుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే వెస్టిండీస్ కోచ్ ఫిల్ సిమన్స్ మరోవిధంగా చెబుతున్నాడు.

జట్టులో ఎవరినీ టార్గెట్ చేయడం లేదని, వెస్టిండీస్ జట్టులో ఇలాంటివి జరగవని సిమన్స్ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఎవరూ ఎవరినీ టార్గెట్ చేయడం లేదని, వెస్టిండీస్ జట్టులోని ప్రతి ఆటగాడు కలిసికట్టుగా ఉన్నాడని పేర్కొన్నాడు. ప్లేయింగ్ XI నుంచి ఓడిన్ స్మిత్‌ను మినహాయించడానికి గల కారణాన్ని ఫిల్ సిమన్స్ చెప్పాడు. ‘మేమంతా కూర్చుని అత్యుత్తమ జట్టును ఎంపిక చేస్తాం. రోవ్‌మాన్ పావెల్ ఆ రోజు మాకు ప్లేయింగ్ XIకి అర్హుడైతే మేము అతనిని ఎంచుకున్నాం. నేను దీనిని వెస్టిండీస్ కెప్టెన్‌పై దాడిగా భావిస్తున్నాను’ అన్నాడు. వెస్టిండీస్, ఇంగ్లాండ్ మధ్య 3 T20 మ్యాచ్‌లు జరిగాయి వెస్టిండీస్ 2-1 ఆధిక్యంలో ఉంది. చివరి రెండు టీ20లు జనవరి 29, 30 తేదీల్లో బ్రిడ్జ్‌టౌన్‌లో జరుగుతాయి.

Apple Peels: ఆపిల్ తొక్కలను విసిరేయకండి.. ఇలా ఉపయోగించుకోండి..

అతడి వేగం గవాస్కర్‌, ఇమ్రాన్‌ ఖాన్‌లని వణికించింది.. విండీస్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌కి కేరాఫ్ అడ్రస్‌ అతడు..

India vs Bangladesh, U19 World Cup: మ్యాచ్‌ ఎప్పుడు ఏ సమయంలో చూడాలో తెలుసుకోండి..?