Bahubali Thali: కూర్చుని బాహుబలి థాలీని తిని.. లక్ష రూపాయలు గెలిచిన యువకుడు ఎక్కడంటే..
Bahubali Thali: భారతీయుల వంటలే (Indina Food(స్పెషల్.. ఇక అందులోనూ భోజన ప్రియులైన ఆంధ్రవారు తాము తినే ఆహారం వెరీ వెరీ స్పెషల్. ఇక్కడి వారు ఒక్క వంటకంతో సరిపెట్టుకోరు. అందుకే సర్వ సాధారణంగా..
Bahubali Thali: భారతీయుల వంటలే (Indina Food(స్పెషల్.. ఇక అందులోనూ భోజన ప్రియులైన ఆంధ్రవారు తాము తినే ఆహారం వెరీ వెరీ స్పెషల్. ఇక్కడి వారు ఒక్క వంటకంతో సరిపెట్టుకోరు. అందుకే సర్వ సాధారణంగా సామాన్యుడి ఇంట్లో కూడా వారికి స్టేజ్ కు తగిన విధంగా కూర పప్పు చారు ఇలా రకరకాల వంటకాలతో భోజనం చేస్తాడు. ఇక అదే పండగలు, పంక్షన్ల సమయంలో అయితే ఫుడ్ మెనూ చూస్తే.. చాలు ఆహా అని అనకుండా ఉండరు ఎవరైనా.. ఎందుకంటే సాంప్రదాయ వంటలతో పాటు స్నాక్స్, డెజర్ట్‌లు, డ్రింక్స్ ఇలా రకరకాల వంటకాలు చోటు చేసుకుంటాయి. ఇక రెస్టారెంట్ల యజమానులు కూడా డిఫరెంట్ మెనుతో తమ కస్టమర్స్ ను ఆకట్టుకుంటూ ఉంటారు అయితే ఈ రోజుల్లో థాలీ అనే బాహుబలి(Bahubali Thali) భోజనానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ భోజనంలో ఒకేసారి చాలారకరకాల ఐటమ్స్ ను వడ్డిస్తారు. వీటన్నిటినీ సింగిల్ సిట్టింగ్ లో ఆరగించాలి అంటే దాదాపు ఎంత భోజన ప్రియుడికైనా అసాధ్యమే.
అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన ఒక రెస్టారెంట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ రెస్టారెంట్లో వడ్డించే థాలీని తినగలిగే కస్టమర్లకు అక్షరాల లక్ష రూపాయలను బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. ఈ థాలీని ‘బాహుబలి థాలీ ‘ అని పిలుస్తారు.
తాజాగా ఫేస్ బుక్ లో కుర్చుని తిని లక్ష రూపాయలు సంపాదించాలని ఉందా.. అయితే నాయుడుగారి కుండ బిర్యానీకి (Naidugari kundabiryani) రండి.. అంటూ ఒక వీడియో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఈ పెద్ద థాలీలో వడ్డించిన వంటకాలు ఉన్నాయి. ఈ ప్లేట్ లో కుండ బిర్యానీ, అన్నం, రకరకాల కూరలు, స్వీట్స్, నూడిల్స్ వంటి రకరకాల వంటకాలు ఉన్నాయి. అంతేకాదు ఈ థాలీలో నాలుగు రకాల పానీయాలు కూడా ఉన్నాయి.
ఈ థాలీని ఎవరినా 30 నిమిషాల్లో పూర్తి చేయగలిగితే.. వారు ఒక లక్ష రూపాయలు గెలుచుకోవచ్చు. ఈ థాలీని విజయవాడ లోని నాయుడుగారికుండబిర్యానీ రెస్టారెంట్ వడ్డిస్తోంది.
సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది. ఇందులో ఐటమ్స్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇవన్నీ 30 నిమిషాల్లో ఇద్దరు వ్యక్తులు తినడం చాలా కష్టమే అని పలువురు కామెంట్లు పెట్టారు. అయితే భోజన ప్రియులు.. ఆహార పోటీల్లో ప్రావీణ్యం ఉన్న వారు ఈ థాలీని పూర్తి చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే ఒక యువకుడు ఆ బాహుబలి థాలీలోని అన్ని రకాల వంటలకు ఆహా ఏమి రుచి అంటూ తినేశాడు. అక్షరాల ఒకరు లక్ష రూపాయలను గెలుచుకున్నాడు. ప్రస్తుతం ఈ పోటీలకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.