AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే చద్దన్నం తినాలంటే మోహం మాడ్చుకుంటున్నారా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

రాత్రి మిగిలిపోయిన అన్నంలో నీరు పోసి మరుసటి రోజు ఉదయం తింటే దాన్నే సద్దన్నం లేదా చద్ది అన్నం అంటారు. ఇది మన దేశంలో ఎంతో కాలంగా వస్తున్న ఆరోగ్యకరమైన సాంప్రదాయ ఆహారం. రాత్రిపూట పులియబెట్టడం వల్ల ఈ అన్నంలో విటమిన్ బి-12, ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు రెట్టింపు అవుతాయి. ఉదయం పూట పరిగడుపున లేదా అల్పాహారంగా దీనిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. పూర్తి ప్రయోజనాలు తెలియాలంటే ఫుల్‌ డిటెల్స్‌లోకి వెళ్లాల్సిందే..

ఉదయాన్నే చద్దన్నం తినాలంటే మోహం మాడ్చుకుంటున్నారా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
Fermented Rice Benefits
Jyothi Gadda
|

Updated on: Nov 09, 2026 | 8:43 PM

Share

నేటి ఆధునిక జీవనశైలిలో రకరకాల ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్‌కు అలవాటు పడి, మన పూర్వీకులు ఆచరించిన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చాలావరకు దూరం చేసుకుంటున్నాం. అలాంటి అద్భుతమైన సాంప్రదాయ ఆహారాల్లో చద్దన్నం ఒకటి. రాత్రి మిగిలిపోయిన అన్నంలో నీళ్లు పోసి మరుసటి రోజు ఉదయం తినే ఈ సాధారణ ఆహారంలో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. దీనిని తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పోషకాలు రెట్టింపు అవుతాయి:

అన్నాన్ని నీటిలో రాత్రి అంతా నానబెట్టి పులియబెట్టడం వల్ల అందులో ఉండే సూక్ష్మజీవులు, మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల సాధారణ అన్నంలో ఉండే పోషకాల కంటే, పులియబెట్టిన అన్నంలో విటమిన్ బి-6, విటమిన్ బి-12, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాల మోతాదు విపరీతంగా పెరుగుతుంది. ఇది శరీర పోషకాహార లోపాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

జీర్ణక్రియకు ఎంతో మేలు:

ఉదయం పూట అల్పాహారంగా సద్దన్నం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఎంతో చురుగ్గా పనిచేస్తుంది. ఇందులో ఉండే ప్రొబయోటిక్స్ గట్ హెల్త్ ను మెరుగుపరుస్తాయి. గ్యాస్, అసిడిటీ, కడుపులో మంట, మలబద్ధకం వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

శరీరానికి శక్తి, చలువ:

ఉదయం పూట ఈ అన్నం తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ చద్ది అన్నం తినడం వల్ల శరీరం లోపలి నుంచి చల్లబడుతుంది. శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది.

బరువు నియంత్రణ, రోగ నిరోధక శక్తి:

సద్దన్నంలో క్యాలరీలు తక్కువగా మరియు ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది అనవసరమైన స్నాక్స్ తినకుండా అడ్డుకుని, బరువు నియంత్రణలో ఉంచడానికి సహకరిస్తుంది. అంతేకాకుండా, రోగ నిరోధక శక్తిని పెంచి, చిన్నపాటి అనారోగ్యాల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.

ఎంతో ఖరీదైన సప్లిమెంట్లు వాడే బదులు, మన సంప్రదాయంలో భాగమైన ఈ సద్దన్నంను ఉదయం అల్పాహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది సులభమైన, ఉత్తమమైన మార్గం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఉదయాన్నే చద్దన్నం తినాలంటే మోహం మాడ్చుకుంటున్నారా? ఆరోగ్య ప్రయోజం
ఉదయాన్నే చద్దన్నం తినాలంటే మోహం మాడ్చుకుంటున్నారా? ఆరోగ్య ప్రయోజం
మధుమేహం ఉన్నా పాయసం తినొచ్చు.. ఎలాగో తెలుసా? 
మధుమేహం ఉన్నా పాయసం తినొచ్చు.. ఎలాగో తెలుసా? 
 కార్తీక మాసంలో నాన్‌వెజ్ ఎందుకు తినకూడదు?
 కార్తీక మాసంలో నాన్‌వెజ్ ఎందుకు తినకూడదు?
Video: కళ్లు చెదిరే వేగంతో దూసుకెళ్లిన ఏలియన్స్.. ట్రంప్ షాక్
Video: కళ్లు చెదిరే వేగంతో దూసుకెళ్లిన ఏలియన్స్.. ట్రంప్ షాక్
కరోనాతో చావు అంచుల్లో.. ఆ నటుడే ఆస్పత్రికి వచ్చి రూ.లక్ష కట్టాడు
కరోనాతో చావు అంచుల్లో.. ఆ నటుడే ఆస్పత్రికి వచ్చి రూ.లక్ష కట్టాడు
ఇంటర్నెట్ ఉన్న కార్లను హ్యాక్ చేయవచ్చా? వీటితో జాగ్రత్త
ఇంటర్నెట్ ఉన్న కార్లను హ్యాక్ చేయవచ్చా? వీటితో జాగ్రత్త
ఐపీఎల్‌లో నా రియాక్షన్స్ సహజమే.. ట్రోల్స్‌పై కావ్య మారన్ క్లారిటీ
ఐపీఎల్‌లో నా రియాక్షన్స్ సహజమే.. ట్రోల్స్‌పై కావ్య మారన్ క్లారిటీ
సూపర్‌ఫుడ్ అవకాడోతో అన్ని లాభాలే.. ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త!
సూపర్‌ఫుడ్ అవకాడోతో అన్ని లాభాలే.. ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త!
స్వర్ణ లంక అసలు ఎవరిది? పార్వతీదేవి కోసం నిర్మించిన ఆ బంగారు నగరం
స్వర్ణ లంక అసలు ఎవరిది? పార్వతీదేవి కోసం నిర్మించిన ఆ బంగారు నగరం
క్రకోవ్‌ కాల్పుల ఘటన.. ఆసుపత్రిలో కన్నుమూసిన ప్రధాన నిందితుడు..!?
క్రకోవ్‌ కాల్పుల ఘటన.. ఆసుపత్రిలో కన్నుమూసిన ప్రధాన నిందితుడు..!?