AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kavya Maran: ఐపీఎల్‌లో నా రియాక్షన్స్ సహజమే.. ట్రోల్స్‌పై కావ్య మారన్ క్లారిటీ

Kavya Maran: సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ వివాహ వేడుకలు గ్రీస్‌లో జరగనున్నాయి. నవంబర్ 10, 11 తేదీల్లో జరిగే వేడుకలకు రజినీకాంత్, ఎంకే స్టాలిన్ సహా ప్రముఖులు హాజరుకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. కావ్య ఐపీఎల్ మీమ్స్‌పై గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.

Kavya Maran: ఐపీఎల్‌లో నా రియాక్షన్స్ సహజమే.. ట్రోల్స్‌పై కావ్య మారన్ క్లారిటీ
Kavya Maran
Rakesh
|

Updated on: Nov 09, 2026 | 8:20 PM

Share

Kavya Maran: సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నవంబర్ 10, 11 తేదీల్లో గ్రీస్‌లో ఈ వేడుకలు జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వివాహానికి హాజరయ్యేందుకు సూపర్ స్టార్ రజినీకాంత్, తమిళనాడు రాజకీయ నేతలు సహా పలువురు ప్రముఖులు చెన్నై నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది. మరోవైపు నవంబర్ 21న చెన్నైలో భారీ రిసెప్షన్ నిర్వహించనున్నారు. కావ్య మారన్, అనిరుధ్ వివాహ వేడుక కోసం చెన్నై ఎయిర్ పోర్టు ప్రముఖుల రాకతో సందడిగా మారింది. రజినీకాంత్ తన కుమార్తె ఐశ్వర్యతో కలిసి గ్రీస్‌కు బయలుదేరారు. మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ కూడా గ్రీస్ ప్రయాణమైనట్లు వీడియోలు బయటకు వచ్చాయి. వీరు దుబాయ్ మీదుగా గ్రీస్ చేరుకోనున్నట్లు సమాచారం. నవంబర్ 10, 11 తేదీల్లో జరిగే వేడుకల అనంతరం నవంబర్ 13న చెన్నైకి తిరిగి వస్తారని కథనాలు పేర్కొంటున్నాయి.

నవంబర్ 10, 11 తేదీల్లో వివాహ వేడుకలు

గ్రీస్‌లో జరిగే వివాహ వేడుకలను అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించనున్నట్లు సమాచారం. అతిథుల విమాన ప్రయాణాలు, వసతి, ఇతర ఏర్పాట్లను మారన్ కుటుంబమే పర్యవేక్షిస్తున్నారు. ఈ వేడుకలు గ్రీస్‌లోని ఏ ప్రాంతంలో జరుగుతాయనే విషయంలోనూ రకరకాల ప్రచారాలు వచ్చాయి.

ఐపీఎల్‌లో కావ్య ఎమోషన్స్‌పై మీమ్స్

ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడుతున్నప్పుడు కావ్య మారన్ స్పందించే తీరు అభిమానులకు బాగా పరిచయం. జట్టు గెలిస్తే ఆనందం, ఓడితే నిరాశ.. ఆమె ముఖంలో కనిపించే భావాలు సోషల్ మీడియాలో మీమ్స్‌గా మారుతుంటాయి. అయితే వాటిని తాను సరదాగా తీసుకుంటానని గతంలో ఓ ఇంటర్వ్యూలో కావ్య చెప్పింది. మ్యాచ్ సమయంలో తన స్పందనలు సహజమైనవేనని వివరించింది. ఆఫీసుల్లో షేర్ల ధరలు పెరిగినా, తగ్గినా ఉద్యోగులు ఎలా స్పందిస్తారో.. స్టేడియంలో అభిమానులు కూడా అలాగే భావోద్వేగాలకు లోనవుతారని తెలిపింది. సన్‌రైజర్స్ జట్టు విషయంలో తన మనసంతా అక్కడే ఉంటుందని, విజయాలు, ఓటములు తనపై ప్రభావం చూపుతాయని చెప్పింది.

నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్

గ్రీస్‌లో వివాహ వేడుకల తర్వాత నవంబర్ 21న చెన్నైలో భారీ రిసెప్షన్ నిర్వహించనున్నారు. కావ్య తల్లిదండ్రులు, సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్, కావేరి మారన్ ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం అక్టోబర్‌లో అధికారికంగా వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ సహా పలువురు ప్రముఖులు రిసెప్షన్‌కు హాజరుకానున్నారు. అయితే అతిథుల పూర్తి జాబితాపై అధికారిక ప్రకటన లేదు. అనిరుధ్ తండ్రి రవి రాఘవేంద్రకు రజినీకాంత్ కుటుంబంతో బంధుత్వం ఉండటంతో ఈ వేడుకకు సినీ రంగంలోనూ ప్రాధాన్యం ఏర్పడింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఐపీఎల్‌లో నా రియాక్షన్స్ సహజమే.. ట్రోల్స్‌పై కావ్య మారన్ క్లారిటీ
ఐపీఎల్‌లో నా రియాక్షన్స్ సహజమే.. ట్రోల్స్‌పై కావ్య మారన్ క్లారిటీ
సూపర్‌ఫుడ్ అవకాడోతో అన్ని లాభాలే.. ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త!
సూపర్‌ఫుడ్ అవకాడోతో అన్ని లాభాలే.. ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త!
స్వర్ణ లంక అసలు ఎవరిది? పార్వతీదేవి కోసం నిర్మించిన ఆ బంగారు నగరం
స్వర్ణ లంక అసలు ఎవరిది? పార్వతీదేవి కోసం నిర్మించిన ఆ బంగారు నగరం
క్రకోవ్‌ కాల్పుల ఘటన.. ఆసుపత్రిలో కన్నుమూసిన ప్రధాన నిందితుడు..!?
క్రకోవ్‌ కాల్పుల ఘటన.. ఆసుపత్రిలో కన్నుమూసిన ప్రధాన నిందితుడు..!?
  నేలపై మైనం మరకలా అంటుకుందా? ఈ ట్రిక్‌తో ఇట్టే క్లీన్ చేయండి!
  నేలపై మైనం మరకలా అంటుకుందా? ఈ ట్రిక్‌తో ఇట్టే క్లీన్ చేయండి!
ఎప్పుడూ ఆలూ సమోసాలేనా? ఒక్కసారి ఈ పాలక్ పనీర్ సమోసా ట్రై చేయండి!
ఎప్పుడూ ఆలూ సమోసాలేనా? ఒక్కసారి ఈ పాలక్ పనీర్ సమోసా ట్రై చేయండి!
బరువు తగ్గాలనుకునే వారికి ఈ పువ్వు ఎంతో మేలు..
బరువు తగ్గాలనుకునే వారికి ఈ పువ్వు ఎంతో మేలు..
పండుగ విందుతో బరువు పెరిగారా? వెంటనే ఇలా చేయండి
పండుగ విందుతో బరువు పెరిగారా? వెంటనే ఇలా చేయండి
హోమ్ లోన్ లేకుండానే రూ.70 లక్షల ఇల్లు కొన్న మహిళ!సేవింగ్స్ ట్రిక్
హోమ్ లోన్ లేకుండానే రూ.70 లక్షల ఇల్లు కొన్న మహిళ!సేవింగ్స్ ట్రిక్
Video: ఫ్లయింగ్ బోర్డు పై చైనా యువకుడి విన్యాసాలు!
Video: ఫ్లయింగ్ బోర్డు పై చైనా యువకుడి విన్యాసాలు!