AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేసీఆర్‌కు ఇష్టమైన కమ్మటి కూర ఇదే.. ఇలా వండితే క్షణాల్లో గిన్నెలు ఖాళీ అవ్వాల్సిందే

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఇష్టమైన వంటకాల్లో పాలకూర పప్పు ఒకటి.. ఆయన ఎక్కువగా పాలకూర పప్పును ఇష్టపడతారని నేతలు చెబుతుంటారు. ఎన్నో పోషకాలు నిండిన పాలకూర పప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఐరన్, ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఈ రుచికరమైన పప్పును ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. తెలంగాణ స్టైల్లో పాలకూర పప్పు తయారీ విధానం, ఆరోగ్య ప్రయోజనాలను ఈ కథనంలో తెలుసుకోండి.

కేసీఆర్‌కు ఇష్టమైన కమ్మటి కూర ఇదే.. ఇలా వండితే క్షణాల్లో గిన్నెలు ఖాళీ అవ్వాల్సిందే
Kcr Food
Shaik Madar Saheb
|

Updated on: May 11, 2026 | 12:00 PM

Share

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (కె. చంద్రశేఖర్ రావు)కు ఇష్టమైన ఆహారాల్లో పాలకూర పప్పు ఒకటి.. ఆయన భోజనంలో ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూర పప్పు, పచ్చడి, వేపుళ్లు ఎక్కువగా ఇష్టపడతారని తరచుగా వార్తల్లో వినిపిస్తుంటుంది. కేసీఆర్ ఎక్కడకు వెళ్లినా.. ముఖ్యంగా తెలంగాణ స్టైల్ వంటకాలు, పాలకూర పప్పును ఎక్కువగా తింటారని.. అలాగే.. పలు రకాల పచ్చళ్లను తింటారని.. ఆయనకు సన్నిహితంగా ఉండే నేతలు చెబుతుంటారు. వాస్తవానికి, పాలకూర పప్పులో ఎన్నో పోషకాలు దాగుంటాయి. పాలకూరలో ఐరన్, ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇంకా ఆరోగ్యంగా, రుచిగా ఉండేలా ఈ పప్పును ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు..

తెలుగు వంటకాల్లో ప్రసిద్ధ, పోషకమైన వంటకం పాలకూర పప్పు.. కందిపప్పు, పాలకూర కలయికతో తయారుచేసే ఈ రుచికరమైన వంటకం భోజనంలో, చపాతీ, రోటిలో అద్భుతంగా ఉంటుంది..

పాలకూర పప్పు తయారీకి కావలసిన పదార్థాలు:

ఈ రుచికరమైన పాలకూర పప్పును తయారు చేసుకోవడానికి, పాలకూర, కందిపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చింతపండు, పోపు దినుసులు, ఆయిల్, తగినంత ఉప్పు, కారం, పసుపు, చిటికెడు ఇంగువ, కొద్దిగా కరివేపాకు, ఐదు చిన్న ఎల్లిపాయ రెబ్బలు అవసరం..

తయారీ విధానం:

మొదటగా, కందిపప్పును కుక్కర్లో వేసి మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తరువాత, కడిగిన పప్పులో తరిగిన పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, 200 మిల్లీలీటర్ల నీరు పోసి కుక్కర్ మూత పెట్టాలి. స్టవ్ వెలిగించి, కుక్కర్‌ను పొయ్యి మీద పెట్టి మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. కుక్కర్లో ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసి, ఉప్పు, పసుపు, కారం, చింతపండు రసం కలిపి బాగా మెదుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొంచెం నీరు పోసి కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి.

చివరగా, మరో పాన్‌లో నూనె వేడి చేసి, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఇంగువ, చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసి, ఈ పోపును ఉడికించిన పప్పులో వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఎంతో రుచికరమైన పాలకూర పప్పు సిద్ధం అవుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆ సినిమా కోసం 2 నెలల్లో 16 కిలోలు తగ్గా.. సత్యదేవ్ ..
ఆ సినిమా కోసం 2 నెలల్లో 16 కిలోలు తగ్గా.. సత్యదేవ్ ..
బియ్యంలో పురుగులు పడుతున్నాయా?ఈ చిన్న చిట్కాలతో సమస్యకు గుడ్‌బై !
బియ్యంలో పురుగులు పడుతున్నాయా?ఈ చిన్న చిట్కాలతో సమస్యకు గుడ్‌బై !
మరో రూ.5 మేర పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? కారణం ఇదే!
మరో రూ.5 మేర పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? కారణం ఇదే!
చేపలు తిన్న తర్వాత శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
చేపలు తిన్న తర్వాత శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
స్టార్ హీరోలకే షాకిచ్చిన 63 ఏళ్ల హీరోయిన్..
స్టార్ హీరోలకే షాకిచ్చిన 63 ఏళ్ల హీరోయిన్..
ఇక అలాంటివేమి కుదరదు..వంట నూనెల ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం
ఇక అలాంటివేమి కుదరదు..వంట నూనెల ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం
బొద్దింకలను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్స్.. ఈ 3 మీ ఇంట్లో ఉంటే..
బొద్దింకలను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్స్.. ఈ 3 మీ ఇంట్లో ఉంటే..
ఛాలెంజ్‌..జస్ట్‌ 10 రోజులు టీ తాగడం మానేస్తే,.శరీరంలో జరిగేది ఇదే
ఛాలెంజ్‌..జస్ట్‌ 10 రోజులు టీ తాగడం మానేస్తే,.శరీరంలో జరిగేది ఇదే
జీలకర్ర vs మెంతుల నీళ్లు.. పొట్ట కొవ్వు తగ్గించడానికి ఏది బెస్ట్?
జీలకర్ర vs మెంతుల నీళ్లు.. పొట్ట కొవ్వు తగ్గించడానికి ఏది బెస్ట్?
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుంది..?