AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..

టమోటాలు అలెర్జీ ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తాయి. ఇవి అలెర్జీ సమస్యలను పెంచుతాయి.  టమాటాలు అలెర్జీలు, శ్వాసకోశ సమస్యలను కలిగిస్తాయి. టమోటాల్లో అధిక ఆమ్లంగా ఉండటం వల్ల.. మీరు ఇప్పటికే యాసిడ్ రిఫ్లక్స్ లేదా గుండెల్లో మంటతో బాధపడుతుంటే అవి తీవ్రమైన కడుపు నొప్పిని కలిగిస్తాయి. టమోటాల్లో కడుపులో ఎక్కువ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి.

టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Tomatos
Jyothi Gadda
|

Updated on: Jul 27, 2024 | 5:10 PM

Share

టమాటాలు.. నాలుగు రోజులు భగ్గుమనే ధరలతో జనాల్ని భయపెడుతుంది.. కొన్ని రోజులు.. అసలు 10 రూపాయలు కూడా ధరలేక రైతుల్ని బోరున ఏడిపిస్తుంది. అలాంటి టమాట లేని కూరలు చాలా తక్కువ. ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్న టమాటా చాలా మందికి ఇష్టమైన కూరగాయ. ఇవి మనల్ని ఎన్నో రోగాల నుంచి కాపాడుతాయి. అలాగని టమాటాను మోతాదుకు మించి తింటే మాత్రం ముప్పు తప్పదంటున్నారు పోషకాహార నిపుణులు. టమాటాలు అతిగా తినటం వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

టమాటాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల విరోచనాలు అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.. ఇందులోని సాల్మొనెల్ల బ్యాక్టీరియా డయేరియా సమస్యకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. మాటోలను అతిగా తినడం వల్ల పొట్టలో గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉందని, దీనివల్ల జీర్ణవ్యవస్థ దెబ్బ తినే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలాంటి వారు టమాటాలకు దూరంగా ఉంటే మంచిది. టమోటాలు, వాటి తొక్కలు, విత్తనాలు కూడా ప్రకోప ప్రేగు సిండ్రోమ్ కు ఒక కారణం కావచ్చంటున్నారు నిపుణులు.మీకు ఇప్పటికే ఐబిఎస్ ఉంటే టమాలను తీసుకోకపోవడమే మంచిది. ఇవి కడుపు ఉబ్బరాన్ని ఎక్కువ చేస్తాయి

టమాటాలను తిన్న వెంటనే కొంతమందికి అలెర్జీ లక్షణాలు కనిపిస్తాయి. చర్మంపై దద్దుర్లు, తామర, దగ్గు, గొంతులో దురద, ముఖం, నోరు, నాలుక వాపు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కనుబొమ్మలు, రెప్పల చుట్టూ ఎర్రగా కనిపిస్తుంది. మూత్రపిండాల సమస్యలున్నవారు టమోటాలు చాలా తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మూత్రపిండాల వ్యాధికి దారితీసే కారకాల్లో ఒకటైన పొటాషియం స్థాయిలను టమోటాలు పెంచుతాయి. టమాటాలో హిస్టమిన్‌ అనే రసాయనం ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తి మీద ప్రతికూల ప్రభావం చూపించి, ఆర్థరైటిస్‌ లాంటి సమస్యల్ని తీవ్రతరం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

టమాటా సాస్ లో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును అమాంతం పెంచుతుంది. అలాగే టొమాటో సూప్ లో కూడా సోడియం ఎక్కువగా ఉంటుంది. టమోటాలు అలెర్జీ ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తాయి. ఇవి అలెర్జీ సమస్యలను పెంచుతాయి.  టమాటాలు అలెర్జీలు, శ్వాసకోశ సమస్యలను కలిగిస్తాయి. టమోటాల్లో అధిక ఆమ్లంగా ఉండటం వల్ల.. మీరు ఇప్పటికే యాసిడ్ రిఫ్లక్స్ లేదా గుండెల్లో మంటతో బాధపడుతుంటే అవి తీవ్రమైన కడుపు నొప్పిని కలిగిస్తాయి. టమోటాల్లో కడుపులో ఎక్కువ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..