Curry Leaves: ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు నమిలి తినడం వలన ఖతర్నాక్ బెనిఫిట్స్..! తెలిస్తే..
కమ్మటి సువానతో కూడిన కరివేపాకు లేనిదే ఏ పోపు పూర్తికాదు..దాదాపు ప్రతి వంటకంలోనూ కరివేపాకును ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా పప్పు, సాంబారు, పులిహోర వంటి వంటకాల్లో తప్పనిసరిగా కరివేపాకు ఉండాల్సిందే.. కానీ, చాలా మంది కరివేపాకును సులువుగా తీసిపారేస్తుంటారు. అయితే, కరివేపాకు కేవలం వంటలకు సువాసన కోసం మాత్రమే కాదు..పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుందని మీకు తెలుసా..? ఉదయాన్నే ఖాళీ కడుపుతో పది కరివేపాకు ఆకుల్ని నమిలి తినటం వల్ల ఖతర్నాక్ బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

కరివేపాకును వివిధ రకాలైన వంటల్లో ఉపయోగిస్తారు. చట్నీ, కూరల్లో ఎక్కువగా వాడతారు. కరివేకును ఉదయాన్నే తీసుకోవడం వలన ఖతార్నాక్ బెనిఫిట్స్ ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కరివేపాకు తినడం వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ట్రైగ్లిజరాయిడ్ లెవల్స్ తగ్గుతాయి. దీని వలన గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. కరివేపాకు తీసుకోవడం వలన జీర్ణఎంజైములు ప్రేరేపించబడతాయి. దీని వలన జీర్ణశక్తి పెరుగుతుంది, కడుపు ఉబ్బరం తగ్గుతుంది. దీనితో పాటు గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. కరివేపాకులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాలు, ఎలుకల ఆరోగ్యానికి మంచిది.
కరివేపాకు తినడం వల్ల కీళ్ళనొప్పులు, షుగర్ ఉన్నవారిలో ఎముకల నొప్పిని తగ్గించి ఎముకల్ని బలంగా మారుస్తుంది. ఉదయాన్నే కరివేపాకు తినడం వలన జీవక్రియ మెరుగవుతుంది. ఫైబర్, అల్కలాయిడ్స్ ఉండటం వలన టాక్సిన్స్ తగ్గిపోతాయి. దీని వలన శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడంలో కరివేపాకు ఎంతో దోహదం చేస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివీటి మెరుగవుతుంది.
ప్రతిరోజూ ఉదయాన్నే పరగడపున కరివేపాకుని తింటే మూత్రిపిండాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు పూర్తిగా తొలిగి వాటి పనితీరు మెరుగవుతుంది. కరివేపాకు వలన జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండటం వలన జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు తగ్గుతాయి. కరివేపాకులో విటమిన్ బి12, విటమిన్ ఇ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి కరివేపాకు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ దూరమవుతాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..