- Telugu News Photo Gallery Amazing health benefits of eating pumpkin regularly in telugu lifestyle news
Pumpkin: గుమ్మడికాయలో ఇంతుందా..? బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదలరు!
గుమ్మడికాయ ఈ పేరు చెప్పగానే చాలా మందికి దిష్టి కోసం వాడుతారని గుర్తుకు వస్తుంది. చాలా మంది ఈ గుమ్మడి కాయను గుమ్మానికి వేలాడదీస్తుంటారు. అలాగే కొందరు వడియాలు, హల్వ వంటివి తయారు చేస్తుంటారు. అయితే, ఈ గుమ్మడి కాయ తినటం వల్ల ఊహించని లాభాలు ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలోని వ్యర్ధాలను తొలగించడానికి బూడిద గుమ్మడికాయ అద్భుతంగా పనిచేస్తుంది. గుమ్మడి కాయ తినటం వల్ల కలిగే మరిన్ని లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం...
Updated on: May 13, 2025 | 3:38 PM

గుమ్మడికాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వివిధ రకాల సమస్యలను సులువుగా తొలగిస్తుంది. గుమ్మడికాయలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్దకం తగ్గుతుంది. గుమ్మడికాయలో కేలరీలు తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని వలన శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.

గుమ్మడికాయను తరచూ డైట్‌లో చేర్చుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. గుమ్మడికాయలో విటమిన్లు ఎ,సి, ఈ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. గుమ్మడికాయలో విటమిన్ ఎ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీని వలన కంటి ఆరోగ్యం మెరుగవుతుంది, వయస్సు సంబంధిత కంటి సమస్యలు తగ్గుతాయి.

యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్లు గుమ్మడికాయలో అధికంగా ఉంటాయి. దీని వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫైబర్, పొటాషియం మరియు విటమిన్ సి కంటెంట్ గుమ్మడికాయలో అధికంగా ఉంటుంది. దీని వలన గుండె పనితీరు మెరుగవుతుంది, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

గుమ్మడికాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, బీటా కెరోటీన్ ఎక్కువగా ఉంటాయి. గుమ్మడికాయ తినడం వల్ల కణాల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. గుమ్మడికాయను తినడం వల్ల సెరోటోనిన్, మెలటోనిన్ ఉత్పత్తి అవుతాయి. ఇవి నిద్ర నాణ్యతను పెంచుతాయి. గుమ్మడికాయ తింటే నిద్రలేమి ఉండదు.

గుమ్మడికాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సాయపడతాయి. గుమ్మడికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉంచుతుంది. గుమ్మడికాయ తింటే చర్మం ముడతలు తగ్గుతాయి.




