Bajra Millet: సజ్జ పిండితో ఇన్ని లాభాలా? డైలీ ఆహారంలో చేర్చుకుంటే ఆ సమస్యలు దూరం
సజ్జ పిండి జీర్ణ వ్యవస్థను మెరుగుపర్చడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుందని వివరిస్తున్నారు. ఫైబర్, అమైనో యాసిడ్ వంటివి సజ్జపిండిలో పుష్కలంగా ఉన్నాయి. సజ్జ పిండిని ప్రస్తుతం అంగన్ వాడీ కేంద్రాల్లో కూడా గర్భిణులకు ఇస్తున్నారు. సజ్జ పిండితో చపాతీలు చేసుకుని తింటే మెరుగైన ఫలితాలు వస్తాయి.
ప్రస్తుతం ఆరోగ్య రక్షణకు అంతా మిల్లెట్ ఫుడ్స్ ను తింటున్నారు. చాలా చోట్ల మిల్లెట్ ఇడ్లీ అమ్ముతున్నారు. ఆ మిల్లెట్స్ లో ముఖ్యంగా సజ్జ పిండి చలికాలంలో చాలా మేలు చేస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. సజ్జ పిండి జీర్ణ వ్యవస్థను మెరుగుపర్చడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుందని వివరిస్తున్నారు. ఫైబర్, అమైనో యాసిడ్ వంటివి సజ్జపిండిలో పుష్కలంగా ఉన్నాయి. సజ్జ పిండిని ప్రస్తుతం అంగన్ వాడీ కేంద్రాల్లో కూడా గర్భిణులకు ఇస్తున్నారు. సజ్జ పిండితో చపాతీలు చేసుకుని తింటే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే సజ్జ పిండిలో ఓమెగా 3 అధికంగా ఉంటుంది. రోజూ సజ్జ పిండిని ఆహారంలో చేర్చుకుంటే ఎన్ని ప్రయోజనాలున్నాయో? ఓ లుక్కేద్దాం.
దండిగా ఫైబర్
సజ్జ పిండిలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువుగా ఉంటుంది. దీంతో డైలీ సజ్జ పిండిని తింటే మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. సజ్జ పిండి తింటే త్వరగా ఆకలి వేయదు. డైటింగ్ చేసే వారు సజ్జ పిండి ఎక్కువుగా తీసుకుంటే సులభంగా బరువు తగ్గడమే కాకుండా ప్రీ బయోటిక్ గా కూడా ఉపయోగపడుతుంది.
గుండె జబ్బుల నుంచి రక్షణ
సజ్జ పిండిని గుండె జబ్బులున్న వారు తీసుకుంటే అధిక మేలు జరుగుతుంది. ఇందులో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. సజ్జ పిండి రక్తనాళాల రక్షణకు కూడా ఉపయోగపడుతుంది. బీపీ పేషెంట్స్ సజ్జ పిండిని ఆహారంగా తీసుకుంటే అందులో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడమే కాక, మధుమేహం సమస్య త్వరగా రాకుండా అడ్డుకుంటుంది.
వృద్ధాప్య సమస్యలు దూరం
సజ్జ పిండిలో ఫైటిక్ యాసిడ్, టానిన్, ఫినాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు దండిగా ఉన్నాయి. దీన్ని డైలీ ఆహారంలో తీసుకుంటే వృద్ధాప్య సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. సజ్జ పిండి వల్ల శరీరంలోని టాక్సిన్స్ సులభంగా బయటకు వస్తాయి. దీంతో మూత్ర పిండాలు, కాలేయ సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.
అదుపులో మధుమేహం
అధిక మధుమేహం ఉన్న వారు డైలీ సజ్జ పిండితో చేసిన ఆహారం తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. మెగ్నీషియం శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది.