Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: అధిక బరువు అదుపు చేయడం మరీ ఇంత సింపులా? ఇంట్లో ఎప్పుడూ ఉండే వస్తువుతోనే అద్భుత ప్రయోజనాలు..

మీ బరువును సులువుగా తగ్గించే ఓ ఇంటి చిట్కానే నిపుణులు చెబుతున్నారు. దానిని తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గొచ్చంటా! అదేంటో తెలుసా పాలు తాగడం. నిజమేనండీ రోజూ గోరువెచ్చని పాల తీసుకోవడం ద్వారా బరువు అదుపులో ఉంటుందంటా! అదేలాగో చూద్దాం..

Weight Loss: అధిక బరువు అదుపు చేయడం మరీ ఇంత సింపులా? ఇంట్లో ఎప్పుడూ ఉండే వస్తువుతోనే అద్భుత ప్రయోజనాలు..
Milk
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 01, 2023 | 4:00 PM

అధిక బరువు మీకు భారం అయ్యిందా? బరువు తగ్గించుకోవడానికి విపరీతంగా శ్రమిస్తున్నారా? అది తినకూడదు, ఇది తాగకూడదని బాగా మిమ్మల్ని మీరు బాగా రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారా? అయినప్పటికీ ఎందుకో ఆశించిన ఫలితం రావడం లేదని బాధపడుతున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. మీ బరువును సులువుగా తగ్గించే ఓ ఇంటి చిట్కానే నిపుణులు చెబుతున్నారు. దానిని తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గొచ్చంటా! అదేంటో తెలుసా పాలు తాగడం. నిజమేనండీ రోజూ గోరువెచ్చని పాల తీసుకోవడం ద్వారా బరువు అదుపులో ఉంటుందంటా! అదేలాగో చూద్దాం..

ఆరోగ్యప్రదాయిని పాలు..

పాలు ఆరోగ్యకరం. అందులో ఎలాంటి సందేహం లేదు. మనలో చాలా మంది చిన్నతనం నుంచి స్వయంగా పాలు తాగుతూ లేదా అందులో కొన్ని రకాల ఆరోగ్య పొడులను కలుపుకొని తాగడం అలవాటు చేసుకుని ఉంటారు. మీ తల్లిదండ్రులు ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు పాలను తాగమని చిన్నప్పటి నుంచి మిమ్మల్ని బలవంతం చేయడాన్ని మీరూ అనుభవించే ఉంటారు. అవునండీ మరీ దానిలో అన్ని ప్రయోజనాలు ఉన్నాయి మరి.

బరువు తగ్గడానికి బెస్ట్ ఆప్షన్..

శరీర బరువు తగ్గడానికి, లేదా బరువు మరింత పెరగకుండా నిరోధించే గుణాలు పాలు కలిగి ఉన్నాయి. సాధారణంగా పాలలో ఉండే అధిక ప్రొటీన్ కంటెంట్ కడుపులో చేరాక.. ఎక్కువ కాలం నిండుగా అనిపించేలా చేస్తుంది. ఇది అతిగా తినడాన్ని నిరోధించవచ్చు. అలాగే పాలల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది పలు ఆహార పదార్థాల లభించే కాల్షియం కన్నా కూడా పాల ద్వారా లభించే కాల్షియం మంచి ప్రయోజనాలకు కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కాల్షియం జీవక్రియను ప్రోత్సహిస్తుంది. అలాగే పాలు శరీరంలో కండర నిర్మాణంలో కీలకంగా పనిచేస్తుంది. ఫలితంగా పాలు తీసుకోవడం ద్వారా కండర ద్రవ్యరాశిని తగ్గించుకునే వీలుంటుంది. పాలల్లో విటమిన్ B12, మెగ్నీషియం, జింక్, ప్రోటీన్, కాల్షియం వంటివి బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది. అలాగే మీరు ఒక గ్లాసు గోరువెచ్చని పాలతో మీ రోజును ప్రారంభించినట్లయితే, అది ప్రోటీన్‌ను కలిగి ఉన్నందున కండరాల నిర్మాణానికి సహాయపడటమే కాకుండా, రోజంతా మిమ్మల్ని చురుకుగా ఉంచుతూ, అధిక శక్తిని నింపుతుంది. చివరిగా పడుకునే ముందు కూడా ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగితే మంచి నిద్ర వస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..