Good Sleep: గాఢమైన నిద్ర కోసం ప్రయత్నిస్తున్నారా? మూన్ మిల్క్ మీ మూడ్ మారిపోవడం ఖాయం.. మీరు ఓ సారి ట్రై చేయండి..
కొందరూ మంచెంపై పడుకున్నప్పటికీ చాలా సమయం వరకూ వారికి నిద్రపట్టదు. దీంతో చాలా విలువైన నిద్ర సమయాన్ని వారు కోల్పోతారు. ఈ నేపథ్యంలో త్వరగా నిద్ర పోవడానికి ఏం చేయాలి? ఏదైనా టిప్స్ ఉన్నాయా? ఏదైనా ఫుడ్స్ ఉన్నాయా? డ్రింక్స్ ఏమైనా ఉన్నాయా? అని నిపుణులను సంప్రదిస్తే వారు ఓ సూపర్ ఐడియాను ఇస్తున్నారు. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇటీవల కాలంలో అందరినీ వేధిస్తున్న సమస్య నిద్రలేమి. చాలామంది అర్ధరాత్రి వరకూ డ్యూటీలు చేయడం.. ఆ తర్వాత కూడా స్మార్ట్ ఫోన్ తో గడపుతుండటంతో వారిలో నిద్ర లోపిస్తోంది. ఫలితంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అయితే కొందరూ మంచెంపై పడుకున్నప్పటికీ చాలా సమయం వరకూ వారికి నిద్రపట్టదు. దీంతో చాలా విలువైన నిద్ర సమయాన్ని వారు కోల్పోతారు. ఈ నేపథ్యంలో త్వరగా నిద్ర పోవడానికి ఏం చేయాలి? ఏదైనా టిప్స్ ఉన్నాయా? ఏదైనా ఫుడ్స్ ఉన్నాయా? డ్రింక్స్ ఏమైనా ఉన్నాయా? అని నిపుణులను సంప్రదిస్తే వారు ఓ సూపర్ ఐడియాను ఇస్తున్నారు. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మూన్ మిల్క్.. బెస్ట్ ఆప్షన్..
త్వరగా నిద్రపోవడానికి మూన్ మిల్క్ బాగా ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరాన్ని శాంతిపరచడంతో పాటు బ్రెయిన్ ను రిలాక్స్ చేస్తుందని వివరిస్తున్నారు. మూన్ మిల్క్ పదం మీరు కొత్తగా వింటున్నారా? అసలు ఈ మూన్ మిల్క్ ఎలా తయారు చేయాలి? దాని వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటి? వంటి విషయాలపై ఆయుర్వేద నిపుణులు చెబుతున్న విషయాలను ఒకసారి పరిశీలిస్తే..
మూన్ మిల్క్ అంటే.. వెచ్చని పాలలో నీటితో పాటు జాజికాయ, ఏలకులు, దాల్చిన చెక్క, కుంకుమపవ్వు, పసుపు వంటి మూలికలతో చేసే ఒక రకమైన కషాయం లాంటిదని నిపుణులు చెబుతున్నారు. ఇది వేడిగా ఉండి.. మీ మెదడును కూల్ చేసి నిద్ర త్వరగా పట్టేట్లు చేస్తుందని వివరిస్తున్నారు. ఒత్తిడిని తగ్గిస్తుందని పేర్కొంటున్నారు. త్వరగా జీర్ణం అవుతుందని వివరిస్తున్నారు.
ఎలా తయారు చేయాలి..
అవకాశం ఉన్నంత వరకూ సేంద్రియ గడ్డితో పెంచిన ఆవు పాలను తీసుకోవాలి. దానిని బాగా మరిగించాలి. ఇప్పుడు ఒక కప్పు మరిగించిన పాలకు, మరో కప్పు నీటిని తీసుకొని దానిలో ఒక టీ స్పూన్ అశ్వగంధ వేసి కలపాలి. దీనిని మళ్లీ స్టవ్ పై పెట్టి, అది సగం అయ్యే వరకూ బాగా మరిగించాలి. ఆ తర్వాత ఏలకులు, దాల్చిన చెక్క, అర స్పూన్ జాజికాయ, రుచికి తగినట్లుగా తేనే జోడించాలి. అంతేనండి మీ మూన్ మిల్క్ రెడీ అయిపోయింది. ఇది రాత్రి సమయంలో తీసుకుంటే జీర్ణశక్తిని పెంచడంతో పాటు మెదడుపై ఒత్తిడిని తగ్గించి బాగా నిద్రపట్టేలా చేస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..