Milk Side Effects: ఈ వ్యక్తులు అస్సలు పాలు తాగకూడదు.. పాలు ఎప్పుడెప్పుడు తాగాలో తెలుసుకోండి..
పాలు (Milk) ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్స్, విటమిన్ డి, ఎ, ఇ పుష్కలంగా ఉంటాయి.
పాలు (Milk) ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్స్, విటమిన్ డి, ఎ, ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు.. దంతాలు బలంగా ఉండేందుకు సహయపడతాయి. పిల్లల నుంచి వృద్దుల వరకు ప్రతిరోజు ఒక గ్లాసు పాలు కచ్చితంగా తీసుకోవాలి. కానీ ఆయుర్వేదం ప్రకారం శారీరక సమస్యలు ఉన్నవారు పాలను అస్సలు తీసుకోవద్దు. పాలను ఏఏ సమయాల్లో తీసుకోవాలి.. ఎవరు తీసుకోవద్దు.. సరైన సమయంలో పాలు తాగడం వలన కలిగే ప్రయోజనాలెంటో తెలుసుకుందామా.
పాలు ఎవరు తాగకూడదు.. దగ్గు, జలుబు, చర్మ సంబంధిత సమస్యలు, దురద, బరువు పెరగడం వంటి సమస్యలు ఉన్నవారు పాలను తాగకూడదు. చెవి, గొంతులో దురద సమస్య ఉన్నవారు కూడా పాలను తాగకూడదు. ఈ సమస్యలు ఉన్నవారు కేవలం రాత్రి వేళలో పాలను తీసుకోవచ్చు. పొడి దగ్గు ఉన్నప్పుడు తక్కువ మోతాదులో పాలను తీసుకోవాలి. కానీ అదే పనిగా దగ్గు సమస్య ఉంటే పాలను తాగకూడదు. రాత్రిళ్లు ఆలస్యంగా తినడం.. నిద్రపోయే ముందు పాలను తాగడం చాలా హానికరం. ఇది తలకు సంబంధించిన వ్యాధులకు దారి తీస్తుంది.
ఆవు పాలు ఆరోగ్యానికి మంచివి.. ఆవు పాలు ఆరోగ్యానికి మంచివని నిపుణులు అంకుర్ అగర్వాల్ తెలిపారు. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవారు.. కడుపులో మంటగా ఉన్నవారు శారీరక శ్రమ ఎక్కువగా ఉండేవారు ప్రతిరోజూ పాలు తీసుకోవాలి. కడుపులో మంటగా అనిపిస్తే పాలు తాగాలి.
పాలను తాగడానికి సరైన సమయం.. ఆకలిగా ఉన్నప్పుడు పాలను తాగడం మేలు. అయితే ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత పాలను తాగకూడదు. దీంతో పాలు సరిగ్గా జీర్ణం కావు. పాలు సరిగ్గా జీర్ణం కావు. అలాంటి సమయంలో జలుబు, దగ్గు, విరేచనాలు, వాంతులు, జ్వరంతోపాటు అజీర్తి సమస్యలు వస్తాయి. పాలు సరిగ్గా జీర్ణం కాకపోవడం వంటి సమస్యతో ఇబ్బందిపడేవారు పాలలో కొద్దిగా శొంఠి పొడి వేసి మరిగించాలి. అలాగే ఆహారంతోపాటు పాలను కలిపి అస్సలు తీసుకోవద్దు. ఇది చర్మ సమస్యలను కలిగిస్తోంది. పులుపు, లవణం కలిగిన వాటిని ఎప్పుడూ పాలతో కలిపి తీసుకోవద్దు. వేసవిలో మిల్క్ షేక్స్.. మామిడికాయ షేక్స్ తీసుకొవద్దు. మామిడి కాయను పాలతో కలిపి అస్సలు తీసుకోవద్దు. అదేవిధంగా పాలతో కలిపి స్ట్రాబెరీ షేక్ కూడా తీసుకోవద్దు. అలాగే పాలతో కలిపి సిట్రస్ పండ్లను తీసుకోవద్దు.
Also Read: Mehreen Pirzada: జీవితం గురించి మెహ్రీన్ ఎమోషనల్ పోస్ట్.. రాత్రికి రాత్రే జీవితాలు
Nagababu: నిహారిక ఇన్స్టా అకౌంట్ పై నాగబాబు ఆసక్తికర కామెంట్స్.. నేనే డియాక్టివేట్ చేశానంటూ..
Naga Chaitanya: సోషల్ మీడియాలో నాగచైతన్య మరో మైలు రాయి.. అసలు విషయం ఏంటంటే..